suryapet

16:57 - July 15, 2018

సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఎస్ వాహనం అదుపు తప్పింది. కొమరబండ సమీపంలో వాహనం టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన 25 మంది సూర్యాపేటలోని దండు మైసమ్మ ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

09:26 - July 2, 2018

సూర్యాపేట : మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తి దందా బైటపడింది. మావోల సానుభూతిపరులకు ఆలవాలంగా వున్న చింతలపల్లిలో నరసింహారావు అనే వ్యక్తి ఓ పత్తిమిల్లు యజమనానికి ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పత్తిమిల్లు జయమాని రాంరెడ్డికి తరచు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి రాంరెడ్డికి ఫోన్ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని..గతంలో కూడా ఓ సర్పంచ్ కు ఫోన్ చేస్తే..తనకు డబ్బులు ఇచ్చాడని పత్తిమిల్లు యజమాన రాంరెడ్డిని బెదిరించాడు. కాగా గతంలో కూడా అదే నంబర్ నుండి ఫోన్ రావటంతో అనుమానించిన రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సదరు సర్పంచ్ ను విచారించారు. తాను ఎవరికి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదని స్ఫష్టం చేశాడు. దీంతో నరసింహకు మావోయిస్టులకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు గుర్తించారు. అనంతరం నరసింహారావును పోలీసులు అరెస్ట్ చేసారు. 

06:36 - June 11, 2018

సూర్యాపేట : జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లిలో.. లలిత సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని గ్రామస్థులు నిర్భందించారు. సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాలు కల్పిస్తామంటూ 50 కోట్ల రూపాయలను యాజయాన్యం తీసుకుని మొహం చాటేసిందని రైతులు మండిపడ్డారు. ప్లాంట్‌ ప్రారంభం చేయపోవటం, ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వకపోవటంతో.. ప్లాంట్‌ యాజమాన్యం వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని ముట్టడించారు. ఫ్యాక్టరీ కార్యాలయంలో నిర్భందించారు. సుమారు ఐదు వందల మంది దగ్గర 50 కోట్ల రూపాయలను, మూడు వందల ఎకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని గ్రామస్థులు వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యను పట్టించుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

10:17 - June 4, 2018

సూర్యపేట : కోదాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య సౌజన్య, మరదలు మాధురితో కలిసి సత్యనారాయణ కారులో హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వెళ్తున్నారు. మార్గంమధ్యలో సూర్యపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై వేగంగా వె ళ్తున్న కారు ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, మాధురి అక్కడికక్కడే మృతి చెందారు. సౌజన్య, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:20 - May 30, 2018

సూర్యాపేట : మేళ్లచెర్వు తహశీల్దారు కార్యాలయానికి మహిళ రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. రైతుబంధు పథకంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.... పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులపంపిణీలో జాప్యం చేస్తున్నారని మహిళ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

08:05 - May 2, 2018

సూర్యాపేట : జిల్లాలోని మునగాల మండలం రామసముద్రంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు సుంకర బంగారు రామయ్య, నారాయణమ్మల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. పలువురు సీపీఎం నేతలు హాజరై జోహార్లు అర్పించారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన బంగారు రామయ్యలాంటి వారు కలకలం గుర్తుండిపోతున్నారని పలువురు కొనియాడారు. 

 

11:26 - April 27, 2018

నల్గొండ : రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం...పంట పెట్టుబడి కింద నగదు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సమస్యలు మాత్రం తీరడం లేదు. రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమకు మద్దతు ధర కల్పించాలని..ధాన్యం కొనుగోలు చేయాలని ఆయా ప్రాంతాల్లో రైతన్నలు నిరసనలు..ఆందోళనలు చేపడుతున్నారు. శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు వరుస సెలవులు ప్రకటించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మద్దతు ధర కంటే తక్కువగా ప్రకటిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించే విధంగా చేస్తామని..ధాన్యం కొనుగోలు చేస్తామని గురువారం అధికారులు హామీనిచ్చారు. కానీ శుక్రవారం అదే పరిస్థితి కొనసాగడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతుల సమస్యలు పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

19:38 - April 25, 2018

సూర్యాపేట : జిల్లా మునగాల మండలం కలుకోవ సర్పంచ్‌ చిర్రా శ్రీనివాస్‌ అవినీతికి వ్యతిరేకంగా గ్రామస్థులు తిరుగుబాటు చేశారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో  కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కలుకోవలో పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకానికి నీటి సరఫరా నిలిపివేసిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ చర్యను ప్రజలు తప్పు పట్టారు. ఈ విషయాలను ప్రశ్నించిన సీపీఎం నాయకులపై సర్పంచ్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్మును సర్పంచ్‌ నుంచి రికవరీ చేసి, పుచ్చలపల్లి సుందరయ్య వాటర్‌ ప్లాంట్‌కు వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

 

13:26 - April 9, 2018

సూర్యాపేట : జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అర్వపల్లి మండలం కొమ్మల గ్రామంలో పెళ్లిపనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొకుడు తండ్రి సత్యనారాయణ, పెళ్లికొడుకు బావ శోభన్‌బాబు అక్కడిక్కడే చనిపోయారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

12:07 - April 2, 2018

సూర్యపేట : జిల్లా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు కొంత ఉపశమనం కలిగించాలని రైతులు కోరుతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - suryapet