Swamy Goud

21:04 - March 17, 2018

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన కేటీఆర్ నియోజకవర్గంలో ఖాళీ బిందెలు నిరసన చేస్తున్న మహిళలు..

21:34 - March 12, 2018

హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని.. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్టగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం
తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విపక్షాల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత : గవర్నర్
అలాగే తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందని.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలను ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని తప్పు పట్టిన విపక్షాలు
మరోవైపు గవర్నర్‌ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ప్రసంగం మొత్తం అబద్దాలే ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తుల విషయంలోనూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.గవర్నర్‌ ప్రసంగం మొత్తం సత్యదూరంగా ఉందంటూ ప్రసంగం మధ్యలోనే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలోని ఏ అంశాన్నీ గవర్నర్‌ ప్రసంగంలో పెట్టలేదని టీడీపీ ఆరోపించింది. చివరిబడ్జెట్‌లోనైనా న్యాయం చేస్తారనుకుంటే అదీ లేదని ఆపార్టీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య మండిపడ్డారు.

రైతులను విస్మరించారు : సున్నం రాజయ్య
రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఎరువుల సాయం అంశాలను గవర్నర్‌ ప్రసంగంలో విస్మరించారని సీపీఎం ఆరోపించింది. మిషన్‌ భగీరథ 90 శాతం పూర్తయిందనడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఖండించారు. స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ వర్కర్లు, నిరుద్యోగుల అంశాన్ని గవర్నర్‌ ప్రస్తావించలేదన్నారు.

21:27 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తొలి రోజే గందరగోళం ..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే గందరగోళం నెలకొంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు చేపట్టిన నిరసన... సభలో గందరగోళానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగాన్ని వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మరింత ముందుకెళ్ళాలని భావించిన సభ్యులు...తమ చేతిలోని ప్రసంగం కాపీలను చించి విసిరారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టేబుల్‌పైనున్న హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడంతో.. అది గవర్నర్‌ పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్పగాయమైంది. గవర్నర్‌ ప్రసంగం అయ్యే వరకు అలాగే ఉండి తర్వాత సరోజనీ దేవి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

దాడికి పాల్పడిన సభ్యులపై కఠిన చర్యలు :
సభలో కాంగ్రెస్ సభ్యులు అనుసరించిన తీరును టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దాడికి పాల్పడిన సభ్యులపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు సభలో ఉండటం ఇష్టం లేదని హరీష్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గుండాల్లాగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, కొండాసురేఖ విమర్శించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారమే కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారని మీడియా పాయింట్‌ వద్ద అన్నారు.

గొంతునొక్కేస్తున్నారు : విపక్షాలు
ఇటు కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అంతే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సభలో తమగొంతునొక్కేస్తున్నారని.. అసలు నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహిరించదని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా లేదని.. అందుకే తాము ఆందోళన చేశామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లామన్నారు... అయితే మార్షల్స్‌ తమకు అడ్డుతగిలి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గలాటాలోతన కాలికి గాయం అయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చూపించారు. అయితే తమ ఆందోళన గవర్నర్‌ మీదే తప్ప...మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ మీద కాదని..ఇది అనుకోకండా జరిగిన పరిణామం అని విచారం వ్యక్తం చేశారు.

27 వరకు శాసనసభ సమావేశాలు
అనంతరం జరిగిన బిజినెస్‌ అడ్వయిజరీ మీటింగ్‌లో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

17:58 - March 12, 2018

హైదరాబాద్ : సభలో విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఇవాళ సభలో.. జరిగిన తమ ఆందోళనను పెద్దదిగా చేసి.. ప్రయోజనం పొందాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మొదట మాములుగా కనిపించిన మండలి ఛైర్మన్.. తరువాత ఆసుపత్రికి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మటిరెడ్డితో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

16:01 - March 12, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్‌ అన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపించివేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పట్ల గవర్నర్‌ స్పీచ్‌లో ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణలో 4వేల మంది చనిపోయిన రైతులవి ఆత్మహత్యలు కాదని కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు ఉత్తమ్‌. తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో లక్షా నలభైవేల కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 

15:07 - March 12, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగిస్తుండగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలకు సర్కార్‌ సిద్దమైంది. కోమటిరెడ్డి, సంపత్‌, మరో ఇద్దరు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. వీడియో ఫుటేజి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

14:59 - March 12, 2018

హైదరాబాద్ : ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన భేటీకి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ శాసనసభాక్ష నేత కిషన్‌ రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 12 రోజుల పాటు సభ జరుగుతుంది. 

13:43 - March 12, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో 4 వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని..అవి కేసీఆర్ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో అనేక ప్రాధాన్యత కల్గిన అంశాలను మెన్షన్ చేయలేదన్నారు. ముస్లీం, మైనారిటీల రిజర్వేషన్ల విషయాన్ని గవర్నర్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని... వారి ప్రస్తావనే ప్రసంగంలో లేదన్నారు. దళితులకు మూడెకరాలు, వ్యవసాయం విషయంలో అన్యాయంగా మాట్లాడారు. రైతు రుణమాఫీ టోటల్ గా ఫెయిల్ అయిందని.. ఎవరికీ రుణమాఫీ చేయలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని పేర్కొన్నారు. తమపైకి పోలీసులను ఎగదోశారని తెలిపారు. తమను తొక్కి, అణచివేసే ప్రయత్నం చేశారని వాపోయారు.

13:21 - March 12, 2018

హైదరాబాద్ : సభలో కాంగ్రెస్ సభ్యులు మైక్ విసరడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం అయింది. సరోజినాయుడు కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. కోమటిరెడ్డి, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ లు చైర్మన్ వైపు మైకులు విసిరారని భావిస్తున్నారు... అయితే ఎవరు విసిరిన మైక్ స్వామిగౌడ్ కు తగలిందో చూడాల్సిందన్నారు. సీపీ ఫుటీజీని పరిశీలించనున్నారు. వారిపై వేటు పడే అవకాశం ఉంది. 

13:44 - June 23, 2016

హైదరాబాద్ : పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తూనేఉంది.. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను ఆ పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి కలిశారు.. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఫారుక్‌ హుస్సేన్‌, ప్రభాకర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు.. ఫిర్యాదు పత్రాన్ని స్వామిగౌడ్‌కు అందజేశారు..ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతల గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - Swamy Goud