t congress leaders

09:01 - April 20, 2018

సిద్దిపేట : భదాద్రి శ్రీరాముడి సాక్షిగా కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. భద్రాచలం పట్టణాన్ని టీఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదన్నది సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు బీజేపీ బిల్లు పెట్టిందని.. దానికి కాంగ్రెస్ మద్దతిచ్చిందని హరీష్‌ గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉండి చోద్యం చూసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారన్నారు.

 

18:36 - April 18, 2018

భద్రాచలం : కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం, స్పీకర్‌లకు తమ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. భద్రాచలంలో సీతారామ స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని తర్వాత కూడా భద్రాచలం అభివృద్ధికి నోచుకోలేదని...గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం వదలటం లేదని ఉత్తమ్ ఆరోపించారు. భద్రాచలం ప్రస్తుతం అక్రమ ఇసుక దందాకు మారు పేరుగా మారుతుందని.. ప్రజల సొమ్ముని, సహజ వనరులను అడ్డంగా దొచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. 

06:28 - April 15, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలనలో మహిళలపై దారుణాలు పెరిగాయి. బీజేపీ నాయకులే మహిళలపై అత్యాచారాలు చేయడం సిగ్గుచేటు అని జానారెడ్డి అన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలంటూ పీపుల్స్ ఫ్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ పాల్గొన్న జానారెడ్డి. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరవాలని.. .మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్, షబ్బీర్ అలీ, పొన్నాల, వీహెచ్ దానం, డికె ఆరుణ, పొంగులేటి పాల్గొన్నారు.

19:07 - April 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... దళితులంటే గౌరవం లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కుల వివక్షతో దళితులను అంటరానివారిగా చూస్తున్నాడని ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతిలో పాల్గొనేందుకు ఇష్టపడని.. కేసీఆర్.. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నానని.. దళితులపై కపటప్రేమ చూపుతున్నారని పొన్నం ఆరోపించారు. 

09:13 - April 11, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్..ఆయన అనుచరుల వీరంగంపై టీ మాస్ ఛైర్మన్ కంచె ఐలయ్య స్పందించారు. అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్..ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడారు. పూలే అంటే ఇష్టం లేదా ? మానవత్వం ఉండకూడదా ? అని ప్రశ్నించారు. బిసీ, ఎస్సీ, ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే వారు పూలేకు దండలు వేయాలని డిమాండ్ చేశారు. పూలే ఒక మహత్తరం పోరాటం చేశారని, అగ్రకులాల వారు రోడ్డు మీదకొచ్చి 11 మంది తమ వారసులను చంపేశారని తెలిపారు. కాంగ్రెస్ రెడ్ల చేతుల్లో ఉందని..వెలమలు అధికారంలో ఉన్నారని, సామాజిక న్యాయం కోరుకుంటే టీ మాస్ తో పనిచేయాలని సూచించారు. 

08:28 - April 11, 2018

 

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం శ్రేణులపై దాడికి దిగడం సంచలనం సృష్టించింది. అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్..ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీపీఎం శ్రేణులు..కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పూలే అందరి వాడని ఎవరైనా నివాళులర్పించవచ్చని, తాము నివాళులర్పించడానికి రావడం జరిగిందని ఎంబీసీ నేత ఆశయ్య తెలిపారు. అక్కడకు వచ్చిన వీహెచ్ దీనిని జీర్ణించుకోలేకపోయి..అనుచరులతో తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఒక బీసీ నేత అయిన వీహెచ్..ఎంబీసీ రాష్ట్ర నేత అయిన తనపై దాడికి దిగడం సబబు కాదన్నారు. వీహెచ్ ఒక రౌడీ..గూండాలాగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. 

06:46 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది... కేసీఆర్‌ విధానాలన్నీ ప్రజావ్యతిరేకంగా ఉన్నాయంటూ వాయిస్‌ పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒడిసి పట్టుకునేందుకు.. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నా బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లింది. అయితే... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్‌ అన్ని పక్షాలను ఒక్కతాటిపైకి తేగలదా ? దాని కోసం హస్తం పార్టీ వ్యూహం ఏంటి ? ప్రస్తుత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రచారం ముందుగానే మొదలుపెట్టింది. ప్రజల్లోకి వెళ్తూ కేసీఆర్‌ విధానాలను ఎండగడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. కేసీఆర్‌ తన మాటల గారడీతోనే ప్రజలను మోసం చేస్తున్నారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. ఇదే ఎజెండాగా తీసుకుని... జనంబాట పట్టిన కాంగ్రెస్‌ నేతలు.... క్షేత్రస్థాయిలో గులాబీ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడు పెంచారు. బస్సుయాత్రతో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో.. తమ ప్రణాళికలకు మరింత పదును పెడుతూ దూసుకెళ్తున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజల్లో తీవ్రవైన వ్యతిరేకత ఉందంటున్న హస్తం పార్టీ... క్షేత్రస్థాయిలో ప్రజల నాడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా... ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేతను తమవైపు మలుచుకునేందుకు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా హస్తం పార్టీ ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే.. ప్రతిపక్ష పార్టీలన్నింటిని కాంగ్రెస్ ఏకతాటిపైకి తీసుకురావాలి. అయితే... ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, ఎంఐఎంలు కాంగ్రెస్‌తో కలిసొచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది వామపక్షాలు. వాటిలో సీపీఎం లాల్‌ నీల్‌ జెండాతో స్వతంత్రంగా ముందుకెళ్లేందుక సిద్దమైంది. దీంతో సీపీఎం దోస్తీపై క్లారిటీ లేదు. ఇక మిగిలిన సీపీఐ కాంగ్రెస్‌తో వచ్చేందుకు సిద్దంగా ఉన్నా... ఆ పార్టీని కాంగ్రెస్‌ ఇంతవరకు సంప్రదించిన సందర్భమే లేదు. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభనష్టాలేంటి ? అనే విషయంలో హస్తం పార్టీలోనే భిన్న వాదనలున్నాయి. ఇదిలావుంటే టీడీపీ అసలు ఆ దిశగా ఆలోచిస్తుందా ? లేదా ? అనేది అసలు ప్రశ్న. టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ముఖ్యం కాబట్టి.... చంద్రబాబు అక్కడి రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకోకుండా ఇక్కడ పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశమే లేదు.

ఇక తాజాగా ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుపై ఎలాంటి స్పష్టత లేదు. తాము ఒంటరిగా పోటీ చేస్తామని కోదండరామ్‌ ప్రకటించడంతో... ఆ పార్టీ స్టాండ్‌ అలాగే ఉంటుందా ? లేక మారుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. కోదండరామ్‌తో కలిసి నడిచే విషయంలో కూడా పార్టీ ఎలాంటి ముందడుగు వేయలేదు. ఇదిలావుంటే...ఎన్నికల నాటికి పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నప్పటికీ... లైక్‌ మైండెడ్‌ పార్టీలతో సానుకూల వాతావరణాన్ని క్రియేట్‌ చేసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీయే. మరి కాంగ్రెస్‌ పార్టీ ఆ పని చేస్తుందా ? రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.... వ్యతిరేక ఓట్లు చీలిపోతే కాంగ్రెస్‌ ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనేది ప్రశ్న. మరోవైపు గులాబీ అధినేత వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ, సీపీఎం, టీడీపీ, కోదండరామ్‌ పార్టీలు అన్ని స్థానాలకు పోటీ చేస్తే... టీఆర్‌ఎస్‌కు మరింత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని కాంగ్రెస్‌ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నా... అందకనుగుణంగా వ్యూహాలు పదును పెట్టడంలో బాగా వీక్‌గా ఉందనేది సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలన్నింటికి హస్తం నేతలు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది. 

13:52 - April 9, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం రోజున జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తు వీరి సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని కోమటి రెడ్డి, సంపత్‌లు హైకోర్టులో సవాల్‌ చేయగా విచారణ కొనసాగుతోంది. 
 

21:22 - April 8, 2018

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడం సహా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 

20:45 - April 8, 2018

సురేష్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? టి.కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది ? తదితర విషయాలు తెలుసుకోనేందుకు మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. స్పీకర్ అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయా ? కోమటిరెడ్డి, సంపత్ లు చేసింది తప్పు కాదా ? ఫిరాయింపులను ఏమీ చేయలేమా ? కాంగ్రెస్ తో పదవికి లాబీయింగే అర్హతా ? ఇలాంటి ఎన్నో విషయాలపై ఎలాంటి విషయాలు..వెల్లడించారు ? తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - t congress leaders