tamil nadu

20:40 - October 3, 2016

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.. అందరిలో అనేక ప్రశ్నలు. అత్యున్నత స్థాయిలో నిజాలు తెలిసినప్పటికీ బయటకి వివరాలు రాకపోవటంతో ప్రజల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

జయలలిత ఆరోగ్యంపై నెట్లింట్లో రకరకాల పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్‌పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమిళ నాట ఆమె ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి. ఆమె రూటే సెపరేటు..

ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను, ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా...ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. అలాంటి జయలలిత ఆస్పత్రి పాలైతే సగటు అభిమాని జీర్ణించుకోవటం అంత తేలిక కాదు..

నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.

ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు.. దేశమంతటా ఉత్కంఠగా చూస్తోంది. జయ ఆరోగ్యం కోసం ఆమె అభిమానులు, అన్నాడీఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఎప్పుడు బయటికి వస్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న జయలాంటి మహిళ ఆస్పత్రి పాలైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. మరో పక్క పార్టీలో తానే తిరుగులేని శక్తిగా ఉండి.. నంబర్ టూ అంటూ ఎవరూ లేని తరుణంలో భవిష్యత్తుపై ఆసక్తి, ఆందోళన ఉండటం కూడా సహజమే.

18:52 - April 18, 2018

చెన్నై : మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ క్షమాపణ చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే చెంపను తాకానని... దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్‌ కోరారు. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ మహిళా అసిస్టెంట్‌ లెక్చరర్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా గవర్నర్‌ ఆమె చెంపను తాకారు. ఈ చర్యపై తోటి జర్నలిస్టులంతా అవాక్కయ్యారు. గవర్నర్‌ చర్యను ట్విట్టర్‌ ద్వారా ఆమె తీవ్రంగా ఖండించారు. మీరు నాకు తాతయ్యలాంటి వారే కావచ్చు కానీ...మీ చర్య నాకు తప్పుగా అనిపిస్తుందని మండిపడ్డారు.

10:16 - April 12, 2018
14:32 - April 9, 2018

చెన్నై : కావేరీ జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గత కొంతకాలంగా కావేరీ జలాల విషయంలో తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కర్నాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నిరసన తెలియచేస్తున్నారు. ఇటీవలే సినీ ప్రముఖులు ఏకంగా నిరసనకు దిగారు. నీళ్లు లేవంటే ఐపీఎల్ కావాలా ? అంటూ వారు ప్రశ్నించారు. తమిళనాడులో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై తమిళనాడు రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. మేనేజ్ మెంట్ బోర్డు విషయంలో తమను ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు ప్రశ్నించింది. మే మూడో తేదీలోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలనిల కోర్టు ఆదేశించింది. 

17:37 - March 25, 2018

తమిళనాడు : తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆమరణ నిరాహార దీక్షకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. కలుషిత నీటితో సమీప గ్రామ ప్రజలు మృత్యువాత పడటం.. ఇతర గ్రామాలలో పంటలు నాశనమవుతున్నాయని 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో నటుడు కమలహాసన్‌, ఎండిఎంకే నేత వైగో మద్దతు పలకటమే గాక, ఆందోళనకారులతో దీక్షలో కూర్చునేందుకు బయలుదేరారు. వీరిని తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్‌ చేయడంతో, తూత్తుకుడి జిల్లా ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దీక్షలో కుర్చున్నారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఫ్యాక్టరీ మూసి వేసివేసేంత వరకు పోరాటం చేస్తామని ప్రజలు భీష్మించుకు కూర్చున్నారు.

08:11 - March 23, 2018

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మరో సంచలన విషయం వెలుగు చూసింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సిసిటీవీ  కెమెరాలు పనిచేయలేదు. ఈ విషయాన్ని అపోలో ఛైర్మన్ సి.ప్రతాప్‌రెడ్డి మీడియాకు స్వయంగా వెల్లడించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జస్టిస్ ఏ. ఆర్ముగస్వామి దర్యాప్తు కమిషన్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. జయలలిత చికిత్సకు సంబంధించిన సీటీవీ ఫుటేజ్‌ను కూడా సమర్పించారా? అని మీడియా ప్రశ్నించినపుడు సిసిటీవీలను స్విచ్‌ ఆఫ్‌ చేసిన విషయం వెలుగు చూసింది. జయలలిత చికిత్స పొందిన 75 రోజులు సీసీటీవీలను స్విచ్ ఆఫ్ చేసినట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతోనే సీసీటీవీ కెమెరాలను స్విచ్‌ ఆఫ్ చేశారని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యంత సన్నిహితులను తప్ప ఎవరినీ అనుమతించలేదన్నారు. 
 

11:49 - March 12, 2018

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అడవుల్లో కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరిగింది. పది మంది అగ్నికి ఆహుతయ్యారు. 39 మంది విద్యార్థులు పర్వతారోహణకు వెళ్లారు. పర్వతారోహణ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 39 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. హెలికాప్టర్ల సహాయంతో అధికారులు 15 మందిని రక్షించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

17:27 - March 9, 2018

చెన్నై : కేకే నగర్ లో వున్న ఓ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. కళాశాల గేటు ముందు అశ్విని అనే విద్యార్థినిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని ఆసుపత్రికి తరలించారు. కేకే నగర్ లోని మీనాక్షి కళాశాలలో బి.కామ్ చదువుతున్న అశ్వినిగా గుర్తించారు. అశ్వినిపై దాడి చేసిన యువకుడు ఆమె చాతీపైనా, కడుపులోను కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రోమోన్మాది దాడి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

16:57 - March 9, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కార్తీని ఈడీ అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకు కార్తీని అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఈడీని ఆదేశించింది. కార్తీకి మరో 6 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని సిబిఐ కోర్టును కోరింది. ఈ కేసులో కార్తీ సిఎ భాస్కర రామన్ జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది. ఈ కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు కార్తీకి నార్కో టెస్ట్‌ జరిపేందుకు అనుమతించాలి సిబిఐ బుధవారం కోర్టును కోరింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

13:13 - March 7, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - tamil nadu