tamil nadu government

13:18 - May 22, 2017

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రజనీకాంత్ స్థానికత అంశాన్ని ఆందోళనకారులు లేవనెత్తారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రజనీకాంత్ ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. కాగా, రజనీకాంత్ స్థానికతపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా రజనీ కాంత్, ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:08 - May 6, 2017

తమిళనాడు : చెన్నైలో రోడ్ మరోసారి కుంగింది. మెట్రో పనుల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో నేల కుంగింది. ఇవాళ తాజాగా రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడటంతో...చెన్నై వాసులు ఆందోళనకు గురవుతున్నారు. 

 

12:52 - April 20, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. పన్నీరు సెల్వం సీఎం సీటుపై పట్టుపట్టడంతో పళని వర్గం ఒప్పుకోవడం లేదు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావుతో తంబిదురై భేటీ అయ్యారు. భేటీకి ముందు ఆయన ఇరు వర్గాలతో చర్చించారు. పళని స్వామికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కేంద్రం రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పళని స్వామి వర్గం ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.

11:25 - April 20, 2017

చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకేలో హైడ్రామా కొనసాగుతోంది. నిన్నటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఆశించిన పన్నీరు సెల్వం నేడు ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెట్టారు. అంతేకాకుండా పొయెస్ గార్డెన్ ను జయలలిత స్మారక చిహ్నంగా మార్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు పదవిని వదులుకోవడానికి సీఎం పళనిస్వామి విముఖం చూపిస్తున్నారు. కాసేపట్లో పన్నీరు వర్గీయులు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి పన్నీరు సెల్వం, పళని స్వామిలు సమావేశం అయ్యే అవకాశ ఉంది.

15:10 - April 19, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.. నిన్నటివరకూ పన్నీర్‌, పళని వర్గం విలీనాన్ని వ్యతిరేకించిన దినకరణ్.. తాజాగా వెనక్కితగ్గారు.. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు కలవడాన్ని తాను వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు.. తనను పార్టీనుంచి బహిష్కరించారని... నిన్నటి తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నానని తెలిపారు.. పార్టీ బలహీనం కావడానికి తాను కారణం కాబోనని... పార్టీలో అందరూ ఐకమత్యంగా ఉండాలన్నదే అభిమతమని తేల్చిచెప్పారు.. పార్టీకి మేలుచేసే నిర్ణయాలు సహకరిస్తానని చెప్పారు.. 

13:52 - April 19, 2017

చెన్నై : అమ్మకు శశికళ ద్రోహం చేశారని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తీవ్రస్థాయిలో శశికళపై విరుచుకపడ్డారు. అన్నాడీఎంకేలో చీలిక వర్గాలైన పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు మళ్లీ ఒక్కటయ్యేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడారు. శశికళను అమ్మ ఏనాడు ఇష్టపడలేదని, జయలలిత ఆశయాలే తమకు ముఖ్యమన్నారు. ప్రజలే తమ ఎజెండా అని, రాజకీయాలు కాదని పేర్కొన్నారు. పార్టీని ఒక్క కుటుంబం చేతిలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

12:24 - April 19, 2017

చెన్నై : తమినాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీ గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపారని దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేసింది. పన్నీర్ వర్గం..పళనీ వర్గాలు ఒకటయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దినకరన్ తిరుగుబాటుకు ప్రయత్నించారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బుధవారం మీడియాకు తెలపడం విశేషం. పార్టీ బలహీనం కావడానికి కారణం తాను కాదని, పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. బలం నిరూపించుకోవడానికి తాను సిద్దంగా లేనని ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీలో అందరూ తనకు సహోదరులేనని, ఎవరితోమ తనకు వ్యక్తిగతంగా గొడవలు లేవన్నారు. దినకరన్ వెనక్కి తగ్గడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయా ? దీనిపై పళనీ..పన్నీర్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

 

 

10:16 - April 19, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో గంటగంటకు రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా టీటీవి దినకరన్ కు మరో షాక్ తగిలింది. దినకరన్ కు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రధాన విమాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు పంపారు. నేడు దినకరన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ గుర్తు కోసం ఈసీకి దినకరన్ లంచాలు ఇవ్వజూపారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉంటే బుధవారం మరోసారి పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య చర్చలు జరగనున్నాయి. దాదాపు రెండు వర్గాలు విలీనయ్యే దిశగా కదులుతున్నాయి. సెల్వం షరతుల మేరకు ఇప్పటికే పార్టీ నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగే ఈ చర్చల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

09:01 - April 19, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీనుంచి శశికళ కుటుంబసభ్యుల తొలగింపుతర్వాత పళనిస్వామి మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పన్నీర్‌ సెల్వం వర్గంతో పళనిస్వామి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంతర్వాత పార్టీ విలీనంపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి శశికళను, కుటుంబసభ్యుల్ని బహిష్కరిస్తూ పళనిస్వామి ప్రకటన చేశారు. 20మంది మంత్రులతో కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు శశికళ కుటుంబసభ్యుల తొలగింపు నిర్ణయాన్ని దినకరన్ వ్యతిరేకిస్తున్నారు. నేడు ఫెరా కేసులో దినకరన్ కోర్టు ముందుకు రానున్నారు. 

 

07:53 - April 18, 2017

చెన్నై : తమిళనాడులో శశికళ వర్గానికి మరో షాక్‌ తగిలింది. ఆమె మేనల్లుడు దినకరన్‌పై అవినీతి కేసు నమోదైంది. పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపాడని దినకరన్‌పై ఆరోపణ. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్‌ ఖండించారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ 
శశికళ వర్గం తరపున ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల బరిలో ఉన్న ఆమె మేనల్లుడు దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌ అధికారులకు లంచం ఇవ్వ జూపాడన్న ఆరోపణలతో దినకరన్‌పై అవినీతి కేసు నమోదైంది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో మధ్యవర్థి సుకేశ్‌ చంద్రశేఖర్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. తనకు ఎన్నికల కమిషన్‌తో మంచి సంబంధాలున్నాయని, అన్నాడిఎంకే శశికళ వర్గానికి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానని సుకేశ్‌ దినకరన్‌ను నమ్మించాడు. ఈ పని కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వడానికి 50 కోట్లు బేరం కుదుర్చున్నాడు. ఇందులో భాగంగా కోటి 30 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. సుకేశ్‌పై ఎఫ్‌ఐర్‌ నమోదు చేసిన పోలీసులు ఆయన వద్ద కోటి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్‌తో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని.... ఈ డబ్బులు దినకరన్‌వేనని పోలీసుల విచారణలో సుకేశ్‌ చెప్పడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్‌ ఖండించారు. సుకేశ్ చంద్రశేఖర్‌ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. నాకు సమన్లు జారీ అయ్యాకే దీనిపై స్పందిస్తానని దినకరన్‌ చెప్పారు. దీన్ని తాను లీగల్‌గానే ఎదుర్కొంటానన్నారు.
అవినీతికి పాల్పడిన శశికళ వర్గం : పన్నీర్‌సెల్వం వర్గం 
ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అవినీతికి పాల్పడిందని పన్నీర్‌సెల్వం వర్గం ఆరోపిస్తోంది. ప్రజలపై నమ్మకం లేనందునే దినకరన్ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని, ఇదే పాలసీని ఈసీతోనూ కొనసాగించే యత్నం చేశారని విమర్శించింది.
పార్టీ గుర్తు ఫ్రీజ్‌ 
అన్నాడీఎంకే గుర్తు రెండాకుల కోసం శ‌శిక‌ళ‌, ప‌న్నీరుసెల్వం వ‌ర్గాలు ప్రయత్నించినా... పార్టీ గుర్తును ఈసీ ఎవ‌రికీ కేటాయించ‌కుండా ఫ్రీజ్‌ చేసింది. దీని స్థానంలో రెండు వ‌ర్గాల వారికి రెండు కొత్త గుర్తుల‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్‌కె నగర్‌ ఉపఎన్నికలో డబ్బులు పంచడం ద్వారా పెద్దమొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. తాజాగా ఈసీకీ లంచం ఇవ్వజూపారన్న ఆరోప‌ణ‌ల‌తో శశికళ వర్గం మ‌రింత చిక్కుల్లో ప‌డింది. పోలీసులు త్వరలో దినకరన్‌కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - tamil nadu government