tamil politics

08:50 - April 19, 2018

చెన్నై : తమిళ సినీ పరిశ్రమ సమ్మెకు తెరపడింది.. గత 48 రోజులుగా కొనసాగుతున్న బంద్‌కు ముగింపు పలుకుతున్నట్లు నిర్మాతల మండలి అద్యక్షుడు విశాల్ ప్రకటించారు. ఇండస్ర్టీలోని  ఇబ్బందులకు న్యాయం జరిగేలా సమ్మె సాగిందన్నారు. శుక్రవారం నుంచి సినిమా థియేటర్లతోపాటు, షూటింగులు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. చిత్రసీమ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా సమ్మె విరమణకు సహకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, తదితర నటులు, చిత్రనిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలతోపాటు సినీపరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లకు విశాల్ ధన్యవాదాలు తెలిపారు. 

 

21:55 - March 20, 2018

చెన్నై : కొత్త పార్టీ, జెండా, ఎజెండా ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఏప్రిల్ 14న పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిమాలయాల్లో ఆధ్మాత్మిక యాత్ర ముగించుకుని చెన్నైకి చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు. హిమాలయ యాత్ర తనలో కొత్త శక్తి ఇచ్చిందని పేర్కొన్నారు. తన వెనక బిజెపి ఉందన్న వార్తలను రజనీ ఖండించారు. తన వెనక ద్రవిడ పార్టీలు, వ్యక్తులు ఎవరూ లేరని తాను స్వయంగా ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. రామరాజ్య రథయాత్ర కారణంగా మత విద్వేషాలు చెలరేగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రజనీకాంత్‌ స్పష్టం చేశారు.

 

19:44 - January 27, 2018

చెన్నై : తమిళనాడులో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిఎంకెతో పాటు వామపక్షాలు, తమిళ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సామాన్యులకు భారంగా మారిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్, సిపిఎం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ కార్యదర్శి ముత్తరన్, ఎండిఎంకె వైగో, విసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్‌ నేత తిరునావుక్కరసు నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

19:42 - January 27, 2018

చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థానికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానివ్వమంటూ దర్శకుడు, తమిళన్‌ పార్టీ నేత సీమన్ హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్‌కు నిజంగా దమ్ముంటే కర్ణాటకకు వెళ్లి తాను తమిళుడినని ప్రకటించాలని సవాల్‌ విసిరారు. 44 ఏళ్లపాటు తమిళనాడులో ఉన్నంత మాత్రాన రజనీ తమిళుడు కాదని సీమన్‌ స్పష్టం చేశారు. సినిమాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇపుడు రాజకీయాలంటూ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

21:46 - January 1, 2018

చెన్నై : తమిళరాజకీయాలను మార్చేసేందుకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పిలుపునిచ్చారు. రజని మన్డ్రమ్‌ డాట్‌ ఓఆర్జీ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన రజనీకాంత్‌.. అందులో అభిమానులు, ప్రజలు తమ పేరును ఓటర్‌ ఐడీ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని కోరారు. పోర్టల్‌లో యోగ ముద్రను రజనీకాంత్‌ ప్రధానంగా చూపించారు. తమిళనాట మంచి రాజకీయాలను నెలకొల్పుదామంటూ రజనీకాంత్‌ 74 సెకన్ల వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. 

11:57 - January 1, 2018

జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, అఖిల భారత ఆదివాలసీల నాయకుడు బెల్లనాయక్, ఏపీ టీడీపీ నేత దుర్గప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి కుమార్ పాల్గొని, మాట్లాడారు. తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశం, టీఆర్ ఎస్ పాలన, ఏపీ ప్రభుత్వం పాలన, పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపై వక్తలు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:36 - December 31, 2017

చెన్నై : పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తలైవా ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ స్థాపిస్తానని తేల్చి చెప్పారు. సొంతంగా పార్టీ పెడతానని స్పష్టం చేశారు. 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాజకీయాలంటే తనకు భయం లేదన్నారు. యుద్ధం చేస్తానని గెలుపోటములు దేవుడే నిర్ణయిస్తాడని పేర్కొన్నారు. అధికారం, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని తెలిపారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతల వల్ల తమిళనాడు పరువుపోయిందన్నారు. అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - December 31, 2017

చెన్నై : తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఆరో రోజు అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. 234 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ స్థాపిస్తానని తేల్చి చెప్పారు. అధికారం, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. కొందరు నేతల వల్ల తమిళనాడు పరువుపోయిందన్నారు. అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. 

 

11:49 - December 30, 2017

చెన్నై : ఐదో రోజు అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.0, కాలా చిత్రాల తర్వాత దేవుడే తన భవిష్యత్ నిర్ణయిస్తాడని తెలిపారు. ఏప్రిల్ లో 2.0 చిత్రం, రెండు నెలల తర్వాత కాలా చిత్రం విడుదల అవుతాయని పేర్కొన్నారు. తాను సినీ రంగానికి రావడానికి తన మిత్రుడు రాజ బహదూర్ కారణమన్నారు. గురువు బాలాచందర్ లేకపోతే రజనీకాంత్ ఉండేవాడు కాదని చెప్పారు. తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని తెలిపారు. 

 

21:22 - December 29, 2017

తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితి అక్కడ ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎప్పుడు పోరు జరిగింది. అయితే ప్రస్తుతం జయలలిత లేరు, కరణానిధి వృధ్దప్యంలోకి వెళ్లారు. ప్రస్తుతం డీఎంకే పుంజుకోలేదు అలా అని అన్నాడీఎంకే కూడా బలంగా లేదు దానికి ఉదాహరణ ఆర్కేనగర్ ఉపఎన్నికే అని ప్రముఖ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్ అన్నారు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - tamil politics