tamilnadu government

10:44 - June 4, 2017

చెన్నై : టి. నగర్ ఉస్మాన్ రోడ్డులో ఉన్న చెన్నై సిల్క్ భవనంలో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగి కాలి బూడిదైన సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని కూల్చివేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతల కోసం ఓ ప్రత్యేక బృందాన్ని నియమించింది. కూల్చివేతలకయ్యే ఖర్చును తొలుత ప్రభుత్వం భరించి తరువాత యాజమాన్యం నుండి వసూలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. అగ్నిప్రమాదం వల్ల రూ. 300 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు వెల్లడించారు.

07:59 - May 20, 2017

చెన్నై : చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమంటపంలో అభిమానులతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భేటి చివరి రోజున కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మంచి నేతలున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని... ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీకాంత్‌ చెప్పారు. యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

పక్కా తమిళుణ్ణే...
తన స్థానికతపై వస్తున్న విమర్శలను రజనీకాంత్‌ తిప్పికొట్టారు. తాను పక్కా తమిళుణ్ణేనని స్పష్టతనిచ్చారు. ఇరవైమూడేళ్లపాటు కర్నాటకలో ఉన్నా, 43 ఏళ్లుగా తమిళనాడులో నివసిస్తున్న విషయాన్ని రజనీకాంత్‌ గుర్తు చేశారు. కర్నాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగానే ప్రజలు ఆదరించారని చెప్పారు. తాను ఉంటే మంచిమనసులున్న తమిళనాడులో ఉంటానని, లేకుంటే రుషులు సంచరించే హిమాలయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారాయన. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. చెన్నైలో గత ఐదురోజులుగా అభిమానులను కలుసుకున్నారు. తనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. 

16:45 - May 19, 2017
16:44 - May 19, 2017
11:36 - April 25, 2017

చెన్నై: రైతుల కోసం డీఎంకే సహా ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ తమిళనాడులో కొనసాగుతోంది. దీన్ని అఖిలపక్ష బంద్‌గా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మరికొన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే తదితర పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి. తమిళనాడు వర్తకుల సమాఖ్య, వ్యాపారుల సమాఖ్య, రవాణా కార్మికుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. 10వేల పెద్ద, చిన్న హోటళ్లు మూతపడ్డాయి. పౌరసరఫరాలు, ప్రజా రవాణా దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సులను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయన్న కారణంతో భారీ బందోబస్తు నడుమ వాటిని తిప్పుతున్నారు. బస్టాండ్లలోనూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. చెన్నైలో 13వేల మంది..రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.

11:27 - April 24, 2017

చెన్నై: తమిళనాడు అన్నా డీఎంకే లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జయలలిత మరణం తర్వాత రెండుగా చీలిపోయిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు భేటీ అవుతున్నాయి. చెన్నైలోని అన్నా డీఎంకే కార్యాలయంలో 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో వీలీనంపై చర్చలు జరుపనున్నారు. పన్నీరు సెల్వంకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఈయన వర్గం పట్టుపడుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తామని సెల్వం వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది.

13:34 - April 18, 2017

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళపై తీవ్ర విమర్శలు చేశారు. శశికళను అమ్మ ఏనాడు ఇష్టపడలేదని జయలలిత ఆశయాలే తమకు ముఖ్యమని రాజకీయాలు కాదని అన్నారు. అమ్మకు శశికళ ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. తమిళనాడు రాజకీలు మరోసారి వేడెక్కిన సంగతి తెలిసిందే. పార్టీ చిహ్నం కోసం ఈసికి లంచం ఇవ్వచూపుతూ దినకరన్ అడ్డంగా బుక్కయ్యారు. దీనితో వైరి వర్గాలైన పన్నీర్..పళనీ వర్గాలు ఒక్కటయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు పన్నీర్ వర్గం కొన్ని షరతులు విధిస్తోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా పన్నీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శశికళను, దినకరన్ లను పార్టీ పదవుల నుంచి తొలగించాలని అన్నారు. పార్టీని ఒక్క కుటుంబం చేతిలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల విలీనానికి అన్నాడీఎంకే పార్టీ సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

12:34 - April 18, 2017
12:24 - April 18, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇక శశికళ శకం ముగిసిపోయే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శశికళకు చెక్ పెట్టేలా రాజకీయాలు మలుపు తీసుకుంటున్నాయి. రెండుగా చీలిన పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటవుతుండడమే దీనికి కారణం. పార్టీ చిహ్నం కోసం ఈసీకి లంచం ఇవ్వడంలో దినకర్ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. పన్నీర్..పళని వర్గాలు ఒక్కటి కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలకు మధ్యవర్తిగా ఎంపీ తంబితురై వ్యవహిరిస్తున్నారు. ఇందుకు పన్నీర్ వర్గం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇందుకు పన్నీర్ షరతులు విధిస్తున్నారు. పళనిస్వామియే సీఎంగా కొనసాగాలని..శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలని..కేబినెట్ లోకి తనను తీసుకోవాలని పన్నీర్ షరతులు విధించారని తెలుస్తోంది. కొద్దిగంటల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

10:46 - April 18, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత కొద్ది రోజుల కిందట సీఎం జయలలిత మృతి చెందిన అనంతరం పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే విలీనం దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు మధ్యవర్తిగా తంబిదురై వ్యవహరిస్తున్నారు. పళని స్వామికి సీఎం పదవి, పన్నీరుకు పార్టీ  ప్రధాన కార్యదర్శి పదవులు వచ్చే విధంగా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. నేడు మంత్రులతో పన్నీరు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు వర్గాలు విలీనం అయితే శశికల శకం ముగిసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే శశికల మేనల్లుడు దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఈసీకి అంచం ఇవ్వజూపి విషయంలో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. 

Pages

Don't Miss

Subscribe to RSS - tamilnadu government