tamilnadu politics

07:59 - May 20, 2017

చెన్నై : చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమంటపంలో అభిమానులతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భేటి చివరి రోజున కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మంచి నేతలున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని... ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీకాంత్‌ చెప్పారు. యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

పక్కా తమిళుణ్ణే...
తన స్థానికతపై వస్తున్న విమర్శలను రజనీకాంత్‌ తిప్పికొట్టారు. తాను పక్కా తమిళుణ్ణేనని స్పష్టతనిచ్చారు. ఇరవైమూడేళ్లపాటు కర్నాటకలో ఉన్నా, 43 ఏళ్లుగా తమిళనాడులో నివసిస్తున్న విషయాన్ని రజనీకాంత్‌ గుర్తు చేశారు. కర్నాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగానే ప్రజలు ఆదరించారని చెప్పారు. తాను ఉంటే మంచిమనసులున్న తమిళనాడులో ఉంటానని, లేకుంటే రుషులు సంచరించే హిమాలయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారాయన. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. చెన్నైలో గత ఐదురోజులుగా అభిమానులను కలుసుకున్నారు. తనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. 

16:45 - May 19, 2017
16:44 - May 19, 2017
14:43 - March 9, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జయలలిత మృతితో ఆర్కేనగర్‌ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

16:07 - February 14, 2017

చెన్నై : మొత్తానికి శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధరించింది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు విచారణ సాగిన కేసులో ఈరోజు తుది తీర్పు వెలువడింది. ఇంతకీ శశికళపై నమోదైన కేసు ఏంటి..? దానికి సాక్ష్యాధారాలు సమర్పించినది ఎవరు..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
రూ. 66.65 కోట్ల విలువైన ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ..  ఆమెపై 1996లో కేసు నమోదైంది.  నాటి జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 1991 నుంచి 1996 మధ్య తొలిసారిగా  జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా  పని చేసిన సమయంలో ... 66.65 కోట్ల విలువైన ఆస్తులను పోగేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో జయలలితతోపాటు శశికళ, జె.ఇళవరసి, వి.ఎన్‌.సుధాకరన్‌లను నిందితులుగా పేర్కొంటూ మద్రాస్‌ హైకోర్టులో విచారణ సాగింది. 
2001లో మళ్లీ అధికారంలోకి  అన్నా డీఎంకే
2001లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. జయలలిత మరోమారు ముఖ్యమంత్రి అయ్యారు.  దీంతో ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగదంటూ డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.  అయితే 2003 నవంబర్‌లో ఈ కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక కోర్టు ఈకేసును విచారించింది.   జయ, శశికళ  సహా నలుగురిని నిందితులుగా పేర్కొంటూ కర్నాటక న్యాయస్థానం 2014 సెప్టెంబర్‌ 27న తీర్పు వెలువరించింది.  నిందితులందరికీ నాలుగేళ్ల చొప్పున కారాగార శిక్ష, కోట్ల రూపాయల జరిమానాను విధించింది. దీంతో జయ తన పదవికి రాజీనామా చేసి, కొంతకాలం బెంగళూరులోని జైల్లో ఉండాల్సి వచ్చింది.
ప్రత్యేక కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టులో సవాల్‌ చేసిన నిందితులు
దిగువ కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు
ప్రత్యేక కోర్టు తీర్పును ఈకేసు నిందితులు  కర్ణాటక హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై  విచారణ జరిపిన హైకోర్టు 2015 మే 11న దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. దీనిపై గత ఏడాది ఫిబ్రవరి 23న వాదనలు మొదలయ్యాయి. అక్రమ మార్గంలో సొమ్మును ఆర్జించినట్లు తేలితే తప్పించి ఆదాయానికి మించి ఆస్తులున్నంత మాత్రాన అవినీతి చేసినట్లు కాదని ఒక సందర్భంలో ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ పూర్తిచేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం.. గత ఏడాది జూన్‌ 7న తీర్పును వాయిదా వేసింది.
20 సం.ల పాటు సాగిన కేసులో తుది తీర్పు 
మొత్తానికి దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే.. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. తుది తీర్పు రూపంలో.. సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలపై నీళ్లు జల్లింది.

 

16:00 - February 14, 2017

చెన్నై : సుప్రీం తీర్పుతో తమిళరాజకీయాల్లో అనూహ్యమార్పులు చోటుచేసుకున్నాయి. సెల్వంకు చెక్ పెట్టేందుకు శశికళ మరో అస్ర్తాన్ని ప్రయోగించింది. పన్నీర్‌ సెల్వంకు బద్ధశత్రువైన పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాజ్‌భవన్‌కు శశికళ లేఖ పంపారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పళనిస్వామి అన్నారు.  గవర్నర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌ వెళ్లారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు పళనిస్వామి సమర్పించనున్నారు. 

 

13:27 - February 14, 2017

చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పందించారు. ఇది తమిళనాడు ప్రజల విజయమని, ఈ తీర్పుతో ప్రజలకు మరింత భద్రత కలిగిందని పన్నీర్‌ సెల్వం అన్నారు.

13:20 - February 14, 2017

చెన్నై: నగరంలోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో హైటెన్షన్‌ నెలకొంది. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో భారీగా పోలీసులు మోహరించారు. శశికళ చుట్టూ వలయంగా ఉన్నారు పోలీసులు. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు నాలుగు రాష్ర్టాల బలగాలు చేరుకున్నాయి. రిసార్ట్స్‌లో 10మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్స్‌లో ఉన్న వెయ్యి మందికి పైగా శశికళ అనుచరులను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

13:17 - February 14, 2017

చెన్నై: శశికళ వర్గం సీఎం అభ్యర్థిగా పళని స్వామి తెరపైకి వచ్చారు. పళనిస్వామి సేలం జిల్లా ఎడప్పాడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల మంత్రిగా ఉన్నారు పళని స్వామి. ఇప్పటికే సెంగొట్టయ్యన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా శశికళ నియమించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వంను శశికళ తొలగించారు. కాసేపట్లో ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి గవర్నర్‌ను కలిసే అవకాశాలు ఉన్నాయి. సేలం జిల్లా ఎడప్పాడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పళని స్వామి, ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే సెంగొట్టయ్యన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా శశికళ నియమించారు. మరో వైపు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వం తొలగించినట్లు ప్రకటించారు. మరో వైపు చెన్నైలోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో భారీగా మోహరించిన పోలీసులు హైటెన్షన్‌ నెలకొంది. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు నాలుగు రాష్ర్టాల బలగాలు వచ్చి శశికళ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. అంతే కాక రిసార్ట్స్‌లో 10మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్స్‌లో ఉన్న వెయ్యి మందికి పైగా శశికళ అనుచరులకు ఖాళీ చేయాలని ఆదేశం జయలలిత మేనల్లుడు దీపక్‌కుమార్‌కు శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు పిలిపించుకున్నారు.

12:28 - February 14, 2017

చెన్నై: శశికళ కల చెదిరిపోయింది. చిన్నమ్మకు సుప్రీం కోర్టు షాక్‌నిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను ద్విసభ్య ధర్మాసనం దోషులుగా నిర్ధారించింది. అంతేకాదు..10 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. జయలలిత సహా శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను సుప్రీం దోషులుగా నిర్ధారించింది. జడ్జీలు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, అమితావ్‌లు తీర్పును వెల్లడించారు. నాలుగువారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం సంచలన తీర్పుతో శశికళ శిబిరంలో కలకలం రేగింది. గోల్డెన్‌బే రిసార్ట్స్‌కు పోలీసులు భారీగా చేరుకున్నారు. శశికళను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిసార్ట్స్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బొరున విలపించిన శశికళ...

సుప్రీం కోర్టు తీర్పు వినగానే శశికళ బోరున విలపించారు. ప్రస్తుతం గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లోకి ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శశికళను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తమిళనాడు రాష్ర్టంలో శశికళ మద్దతు దారులు ఆందోళనలు చేయకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పోయెస్‌ గార్డెన్‌ నిర్మానుష్యంగా మారింది.

పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు...

సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీర్‌ సెల్వం శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. శశికళకు శిక్ష.. తమిళనాడుకు రక్ష అంటూ సెల్వం మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్‌ వ్యూహంపై ఆంతరంగికులతో సెల్వం మంతనాలు జరుపుతున్నారు. సుప్రీం తీర్పుతో తమిళనాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. పన్నీర్‌ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని పన్నీర్‌ సెల్వం భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తమిళనాడు శాసనసభలో బల నిరూపణపై ఇవాళ గవర్నర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకేలోని పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ తీర్పు ఓ గుణపాఠం కావాలి...స్ఠాలిన్...

జయ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం కావాలని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు. 20 సంవత్సరాల తర్వాతైనా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునీయడం సంతోషకరమన్నారు. ఇప్పటికైనా తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ కోరారు.

Pages

Don't Miss

Subscribe to RSS - tamilnadu politics