Task Force Police

21:17 - November 8, 2018

హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను ఈరోజు హైదరాబాద్ లో  వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మంగలికృష్ణ పై  హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ  గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా....  కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

21:38 - October 27, 2018

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం దొంగలు బరితెగించారు. కూంబింగ్‌ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై రాళ్ళతో దాడి చేశారు. చంద్రగిరి మండలం భీమవరం సమీపంలోని ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లొంగిపోవాలంటూ హెచ్చరించిన పోలీసులపై స్మగ్లర్లు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి, 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రాళ్ళ దాడిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కోదండంకు గాయాలయ్యాయి. గాయపడ్డ అధికారిని ఆసుపత్రికి తరలించారు.

 

21:39 - October 21, 2018

హైదరాబాద్ : నగరంలో హవాలా వ్యాపారం గుట్టు రట్టు అయింది. కోఠిలో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా నగదు తరలిస్తున్న నలుగురిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.54 కోట్ల నగదును పట్టుకున్నారు. కౌంటింగ్ మిషన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని గుజరాత్‌కు చెందిన అక్రమ వ్యాపారస్తులుగా పోలీసులు గుర్తించారు. 0.6 శాతం వడ్డీతో నగదును సప్లై చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడించారు.


కోఠిలో ఏపీ09బీఎన్02505 హోండా ఆక్టీవా బైక్‌పై వెళ్తున్న జ్యూలరీస్ బిజినెస్ మేన్ పటేల్ జయేష్, విన్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పాట్‌లో వీరి నుంచి కోటి 80 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లను రుజువు చేయలేకపోయారు.

అయితే వీరిని విచారించగా కోఠిలోని మార్వెల్ మోడల్ ఆఫీస్‌లోని 202 ఫ్లాట్‌లో 74 లక్షల రూపాయలను దాచి పెట్టామని నిందితులు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడి వెళ్లి ఆ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పటేల్ జయేష్, విన్‌రాజ్‌, పటేల్ అశ్విన్, నవీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గుజరాత్‌కు చెందిన నగదును అక్రమంగా తరలిస్తున్నారు. పటేల్ జయేష్, విన్‌రాజు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరికి పటేల్ అశ్విన్, నవీన్‌లు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం నగరంలో కలకలం సృష్టిస్తోంది. 

 

12:50 - September 29, 2018

చిత్తూరు : శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కాపుకాసి ఉన్న పోలీసులకు చంద్రగిరి మండలం నారావారిపల్లి వద్ద స్మగ్లర్లు కారు ఎదురు పడింది. ఆ వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించింది. నారావారిపల్లి నుంచి భయ్యారెడ్డిపల్లి వరకు 20 నుంచి 25 కిలీ మీటర్ల మేర సినీ ఫక్కిలో పోలీసులు చేజింగ్ చేశారు. అయితే తప్పని పరిస్థతిలో స్మగ్లర్లు భయ్యారెడ్డిపల్లి వద్ద కారును గుంతలోకి దించి, డ్రైవర్‌తోసహా పరారయ్యారు. 13 ఎర్రచందనం దుంగలు, వాహనాన్నిస్వాధీనం చేసుకున్నారు. చేజింగ్ సమయంలో ముగ్గురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. స్మగ్లర్లు దగ్గరలోని అటవీప్రాంతంలోకి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

 

10:24 - August 2, 2018
10:14 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో కొకైన్ విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోజిని దేవి ఆసుపత్రి సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొకైన్ కొనడానికి వచ్చిన వ్యక్తిని..అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అనే వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల డ్రై గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

08:15 - August 2, 2018
11:47 - March 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో పాతనోట్లు మార్పిడి చేస్తున్న 10 మంది సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్‌బాగ్‌లోని మొఘల్స్ కోర్టులో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 10 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి దాదాపు 8 కోట్లకుపైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

09:29 - February 17, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సింగరేణి కాలనీలో ఈస్ట్‌జోన్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులు ఈ కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. 3గంటలకు ప్రారంభమైన కార్డన్‌సెర్చ్‌ 6 గంటల వరకు కొనసాగింది. 48 గ్యాస్‌ సిలిండర్లు, 57 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 12మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

10:51 - February 11, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలోని మాదన్నపేటలో నకిలీ పాలు తయారు చేసే కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంలోకి వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..500 కేజీల నకిలీ పాలపౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాలను తయారు చేస్తున్న పాల కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - Task Force Police