tdp government

12:25 - December 16, 2017
07:55 - December 16, 2017

సర్కారు బడిలె సద్వు జెప్పె పంతులు పదవికోసం.. టెట్టు పాస్ గావాలె..హోంగార్డుల మీద వరాల వాన అనంగనే పాపం వాళ్లుగూడ పాల ప్యాకెట్లు బాగనే గొన్నరు... ఎన్ కౌంటర్.. ఇది పేరుకే ఇరువర్గాల నడ్మ కాల్పులు.. ఎదురుకాల్పులు అనిపిస్తదిగని.. ఆడ ఏముండది..పార్టీ అధిష్టానం మాటలు వట్టిచ్చుకోకుంట ఎవ్వలు వ్యవహరించినా ముమ్మాటికి తప్పై అయితది అంటున్నడు విద్యావంతుడు.. నాగార్జున సాగర్ కట్టకు గులాబీ రంగేయ జూశి.. మంది దిట్టంగనే మళ్ల దాన్ని చెడిపేశిండ్రు.. అయ్యా ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ గారు.. అంటెనేమో.. అగో మల్లన్న నోరు బైటవెట్టిండని మొత్తుకుంటవ్.. వంద రోజుల తర్వాత హైద్రావాదుల ఒక్క గుంత గనిపిచ్చినా.. వెయ్యిరూపాల నజరానా ఇస్తాని చెప్పిన జీహెచ్ఎంసీ కమీషనర్ ఎటువొయ్యిండో....గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:38 - December 15, 2017

కృష్ణా : కాపు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాపు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోట్ల శివశంకర్. కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు చేపడుతుందని తెలిపారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా అందరికీ లబ్ది చేకూరేలా చేస్తామంటున్నారు.

16:35 - December 15, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముగ్గురు వార్డు మెంబర్లను కిడ్నాప్‌ చేశారంటూ ఒక వర్గం ఆందోళకు దిగారు. మరో వర్గంతో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పంచాయతీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉప సర్పంచ్‌ ఎన్నికలో గందరగోళం ఏర్పడింది. 

13:40 - December 14, 2017
18:07 - December 13, 2017
13:58 - December 13, 2017

కడప : ప్రజా పోరాటాలతోనే ఉక్కు పరిశ్రమ సాధ్యమవుతుందని సీపీఎం జాతాయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకరాకపోతే ఏపీకి ప్రత్యేకహోదా, రాయలసీమకు ప్రత్యేకహోదా రాదని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం తమ వాగ్దానాలను పూర్తి చేసే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని చెప్పారు. అందుకు ప్రజా ఉద్యమాలను బలపర్చాలని కోరారు. కడపలో నిర్వహించిన సీపీఎం బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఏచూరీ డిమాండ్ చేశారు. విజభన చట్టంలోనే ఈ అంశం ఉందన్నారు. ఆ హామీని వెంటనే అమలు చేయకుంటే ప్రజా పోరాటాలు తప్పవన్నారు. ఏపీలో నాలుగేళ్లుగా ఏ అభివృద్ధి లేదన్నారు. ఏపీలో అమరావతి తప్ప వేరే చర్చ లేదన్నారు.. అమరావతి కోసం రైతుల నుంచి బలవతంగా ప్రభుత్వం భూములు లాక్కున్నారని పేర్కొన్నారు. మతతత్వ ప్రభుత్వంతో వెళ్లొద్దని సీఎం చంద్రబాబుకు చెప్పినా వినలేదన్నారు. మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని...ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో మనందరికీ తెలుసన్నారు. కొత్త ఉద్యోగాలు ఏమోగానీ...ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. మోడీ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రజలు కోసం మోడీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు..కానీ ఇప్పటి వరకు కల్పించలేదన్నారు. ప్రతి ఏడాది 80 వేల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్వయానా ప్రభుత్వమే చెప్పిందన్నారు. 
కానీ రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. ఉద్యోగాల్లో వృద్ధి రేటు పది సంవత్సరాల కిందికి దిగజారిందన్నారు. 67 వేల మందిని ఉద్యోగాలను తొలగించారని తెలిపారు. 96 లక్షల మంది నిరుద్యోగులయ్యారు. 

 

19:25 - December 12, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామికవేత్తలు సన్నద్ధమవుతున్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం లభిస్తుండడంతో.. అనేకమంది పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో ఆదరణ పొందిన ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ను రాజధానికి పరిచయం చేయబోతుంది చందన కార్పొరేషన్‌. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ కేంద్రం అమరావతిలో ఏర్పాటు చేయడానికి యువ పారిశ్రామికవేత్త,... చందన కార్పొరేషన్‌ ఎండీ వెంకటరమణ ముందుకొచ్చారు. ఈ యూనిట్‌ను దక్షిణ కొరియా సహకారంతో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కొరియా బృందం ఇటీవలే ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని 'ఆవరా' ఎలక్ట్రికల్‌ వెహికల్‌ పేరుతో అమరావతిలో ప్రారంభించనున్నట్లు చందన కార్పొరేషన్‌ తెలిపింది.

దక్షిణ కొరియా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం
విద్యుత్‌ వాహనాలను తయారు చేసే సంస్థలను సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ ఎండీ వెంకటరమణ తెలిపారు. లోకేశ్‌ ఆధ్వర్యంలో దక్షిణ కొరియా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాలను అమరావతిలో తయారు చేస్తామని.. ఈ వాహనం ఒకసారి వాహనం చార్జ్‌ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల మేర నడుస్తుందన్నారు. ఈ వాహనాల ద్వారా ఎలాంటి కాలుష్యం ఉండదని, ఇతర ఖర్చులు లేకుండా.. వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మూడు రకాల ధరల్లో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెంకటరమణ తెలిపారు. తొలిసారి దేశంలో పూర్తిగా మహిళలతో.. ఈ ప్రాజెక్ట్‌ కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే ఐదేళ్లలో బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాల విక్రయాలను అధికం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు వెంకటరమణ. ఎలక్ట్రిక్‌ వాహనాల ప్లాంట్‌ నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తుందన్నారు దక్షిణ కొరియా ప్రతినిధులు. అనుకున్న సమయానికే వినియోగదారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలు అందిస్తామన్నారు. మొత్తానికి నవ్యాంధ్ర రాజధానిలో వచ్చే ఏడాది ఉగాది ఉంచి.. కాలుష్యం వెదజల్లని ఎలక్ర్టిక్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 

19:24 - December 12, 2017

కడప : విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు రాయలసీమలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. నవంబర్‌ 29 నుంచి రాయలసీమలో చేపట్టిన బైక్‌ ర్యాలీ... రేపు కడప చేరుకోనుంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, అనంతపురం జిల్లా సెంట్రల్‌ యూనివర్సిటీ, కర్నూలులో రైల్వే వ్యాగన్ల నిర్మాణం చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. టీటీడీలో 10వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. బైక్‌ ర్యాలీ ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు విద్యార్థి సంఘ నేతలు తెలిపారు. విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

19:23 - December 12, 2017

కర్నూలు : ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్‌ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. 200మంది సెక్యూరీటి గార్డులు ఆరు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో రక్తం అమ్ముకుని వారి జీవనం సాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తమ సమస్యలను పరిష్కరించాలని ఇవాళ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

Pages

Don't Miss

Subscribe to RSS - tdp government