tdp government failures

16:44 - July 6, 2018

శ్రీకాకుళం : సాక్షాత్తు సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. రెండు నెలలో ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించకపోతే ముఖ్యమంత్రే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తానని బహిరంగసభలో హెచ్చరించారు. అయితే చంద్రబాబు చెప్పి ఆరు నెలలవుతున్నా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.
టెక్కలిలో నత్తనడకన నిర్మాణ పనులు 
వందల కోట్లు రూపాయలు వెచ్చించి అన్ని జిల్లాల మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో ఏడాది కాలం నుంచి ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతోంది. అయితే లక్ష్యం నీరుగారిపోతోంది. లక్ష్యాన్ని పూర్తి చేయాలని  కలెక్టర్ ధనుంజయరెడ్డి నెలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో కదలిక కరువవుతోంది. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నిర్మాణాలు నత్తతో పోటీపడుతున్నాయి.
మరుగుదొడ్ల నిర్మాణాల వెనుకంజపై మండిపడ్డ కలెక్టర్‌
టెక్కలి, సంతబొమ్మాళి మండలాలతో పాటు రాజాం నియోజకవర్గం సంతకవిటిలో మరుగుదొడ్ల నిర్మాణాలు వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్‌ మండిపడుతున్నారు. బహిరంగ మల, మూత్ర విజర్జన నిరోదించి, సామాజిక చైతన్యం కలిగించేందుకు పెద్ద ఎత్తున నిధులు, అంతకన్నా ప్రచారం చేస్తున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. 
కలెక్టర్‌ ఎదుట ధర్నా చేస్తానని సీఎం హెచ్చరిక
ఈ ఏడాది జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించి, ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్చి 31వలోగా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగకపోతే సీఎంగా తాను కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చారించారు. నేటికి ఆరు మాసాలు పూర్తయిన జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదని స్థానికులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలుండగా ఇంకా 85 శాతం కూడా నిర్మాణాలు పూర్తికాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పనులపై మండల తహశీల్దారులు దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

06:33 - June 24, 2018

విజయవాడ : అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏదైనా పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. కేంద్రం సహకరించకున్నా.. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో.. అంగన్‌వాడీ టీచర్లు.. చంద్రబాబును కలిశారు. తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు.. సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఈ సందర్భంలో.. విపక్షాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. ఏదైనా ఒకపార్టీ.. వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్‌వాడీ టీచర్లకు చంద్రబాబు సూచించారు.

ఎన్నో కష్టాలు ఉన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా.. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, తద్వారా.. అభివృద్ధి శరవేగం పుంజుకుంటుందని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాను కరవు కోరలనుంచి బయట పడేయగలుగుతున్నామని, ఆ జిల్లాలో మండువేసవిలో కూడా చెరువుల్లో నీరుందంటే అది తమ ప్రభుత్వ దూరదృష్టి, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గర్భిణులు, గర్భస్థ, నవజాత శిశువులు మరణించకుండా చూడడం కూడా అభివృద్ధిలో భాగమేనని అన్నారు. ఆ దిశగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ అంగన్‌వాడీలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

స్విస్ బ్యాంక్ నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి పౌరుడికీ 15 లక్షల రూపాయలు ఇస్తానన్న ఎన్నికల హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇరవై వేలకుపైగా విద్యావాలంటీర్ల ఉపాధిని దెబ్బతీసిందని ఆరోపించారు. కేంద్రం మాటలే తప్ప ఆచరణలో హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. 

07:49 - June 14, 2018

చిత్తూరు : టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేసిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీవారి ఆభరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారంటూ రమణదీక్షితులు ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై చట్టపరమైన చర్యలకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు 
తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఆరోపణలు చేసిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై  టీటీడీ పాలక మండలి తీవ్రంగా స్పందించింది. శ్రీవారి ఆరభరణాలు దోచుకున్నారని, విలువైన వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని, స్వామికి నిత్యం జరిగే కైంకర్యాల్లో లోపాలున్నాయని విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించిన పాలక మండలి వీరికి నోటీసులు జారీ చేసింది. 
టీటీడీపై రమణదీక్షితులు ఆరోపణలు 
టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు 65 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ కల్పించారు. ఆ తర్వాత నుంచి రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. చెన్నైలో మొదలుపెట్టి తిరుమల, తిరుపతి, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పాలక మండలి సభ్యులతోపాటు అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారని ఆరోపణలు చేశారు. శ్రీవారి సొమ్ములకు  లెక్కలులేవని, మణులు, మాణిక్యాలు, రవ్వలు, రత్నాలు, వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న వాదాన్ని లేవనెత్తారు. వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించారు. దీనిపై టీటీడీ వివరణ  ఇచ్చినా.. తన ఆరోపణల పర్వాన్ని ఆపకపోగా,...మరింత విస్తృతం చేశారు. ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న సమయంలో ఈ అంశాలపై నోరు మెదపని రమణదీక్షితులు.. పదవి నుంచి తొలగించిన తర్వాతే మాట్లాడటంలోని ఔచిత్యాన్ని చాలామంది ప్రశ్నించారు. అయినా రమణదీక్షితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఆ ప్రకారం ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 
దీక్షితులను వెనకేసుకొచ్చిన వైసీపీ 
మరోవైపు కారణాలు ఏవైనా కానీ... రమణదీక్షితులు వివాదాన్ని వైసీపీ అందిపుచ్చుకొంది.  దీక్షితులు తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆయన్న వెనకేసుకు రావాడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు నివాసంలో ఉన్నాయని, కొన్నింటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం, ఢిల్లీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు వెళ్లింది. దీక్షితులు, విజయసాయిరెడ్డి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అశోక్‌ కుమార్‌ సింఘాల్‌తో సమీక్షించి.. దేవస్థానాల పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్యలకు తీర్మానించి... ఇప్పుడు విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు, ప్రతిష్ఠతలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. 
టీటీడీ నుంచి నోటీసులు అందలేదన్న విజయసాయిరెడ్డి 
టీటీడీ జారీ చేసిన నోటీసులపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నోటీసులు ఇంతవరకు  తనకు అందలేదన్నారు. సమాధానం ఇవ్వాలా... లేదా.. అన్న అంశాన్ని నోటీసులు అందిన తర్వాత పరిశీలిస్తానని చెప్పారు. ఏపీ  దేవాదాయ, ధర్మాదాయ చట్టం పరిధిలోకి వచ్చే టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదన్న వాదాన్ని వినిపించారు. సీఆర్‌పీసీ కింది దర్యాప్తు అధికారికే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందున్నారు. శ్రీవారి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయన్న తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. నోటీసులకు విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి ప్రతిపాదించింది. 
 

 

19:23 - June 13, 2018

టీటీడీ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈఅంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. 

18:51 - June 13, 2018

ఢిల్లీ : టీటీడీ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు.

13:47 - June 14, 2016

విజయవాడ : చంద్రబాబు పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఐదేళ్ల క్రితం తాను, తన అమ్మ విజయమ్మ మాత్రమే వైసీపీలో ఉన్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో అతి పెద్ద పార్టీగా ఆవతరించామని చెప్పారు. 

 

Don't Miss

Subscribe to RSS - tdp government failures