TDP MPs Protest

21:49 - July 19, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైంది. శుక్రవారం ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇచ్చిన నోటీసుపై జరిగే చర్చలో  మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా... విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ మోసం చేశారన్న అంశాన్ని అవిశ్వాసం ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకురానున్నారు. విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం,  లోటు బడ్జెట్‌ భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తాత్సారం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు  వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. 

ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ఎన్డీయే సర్కారును నిలదీసేందుకు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశం  ఇద్దరు టీడీపీ ఎంపీలకే దక్కింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు మాత్రమే  కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం లభిచింది.  దీంతో ఆ పార్టీ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  నోటీసు ఇచ్చిన తనకు అవకావం దక్కకలేదన్న అసంతృప్తిలో కేశినేని నాని ఉన్నారు. టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే ఎంపీలు విభజన హామీలపై కేంద్రాన్ని గట్టిగా నిలయాలని ఆదేశించారు. గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభిస్తే.. మధ్యలో వచ్చే అవకాశాన్ని రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని ఉపయోగించుకోవాలని సూచించారు. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని కేశినేని నాని ... చంద్రబాబు దృష్టికి తెచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు.. మొత్తం ఏడు గంటల పాటు చర్చ జరుగుతుంది. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను బట్టి టీడీపీకి 15 నిమిషాల  సమయం కేటాయించే అవకాశం ఉంది. అయితే బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో రెండు గంటల సమయం కావాలని టీడీపీ ఎంపీలు కోకారు. నిబంధనల ప్రకారం అంతసమయం లభించే అవకాశం లేకపోవడంతో ఇచ్చిన సమయంలోనే అన్ని అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. అయితే అదనపు సమయం కోసం డిమాండ్‌ చేయాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. చర్చలో పాల్గొనే ఎంపీలు పూర్తిగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 

అవిశ్వాసానికి విపక్షాల మద్దతు కూడగట్టడంలో టీడీపీ కొంతవరకు విజయం సాధించింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ, వామపక్షాలు అవిశ్వానానికి మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ కూడా అవిశ్వాసాన్ని బలపరుస్తామని హామీ ఇచ్చింది. సుజనాచౌదరి నేతృత్వంలోని టీడీపీ ఎంపీ బృంద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి మద్దుతు కోరింది. 

మరోవైపు ప్రధాని మోదీ  నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో తమ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు... దేశంలోని అన్ని పార్టీల నాయకులకు లేఖ రాశారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో అమలుచేయని అన్ని విషయాలను దీనిలో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సహా 18 హామీలు అపరిష్కృతంగా ఉన్న అంశాన్ని ఉదహరించారు. రాష్ట్రంలోని వెనుకబడి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, దుగరాజపట్నం పోర్టు, విభజన చట్టంలో ప్రస్తావించిన విద్యాసంస్థలు, అసెంబ్లీ సీట్ల పెంపు, రైల్వే లైన్లు, రోడ్లతో అమరావతి అనుసంధానం వంటి అంశాలను చంద్రబాబు తన లేఖలో  పొందుపరిచారు. అవిశ్వాసంపై చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే టీడీపీ ఎంపీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై  సమాచారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ వెళ్లారు. అవిశాసంపై చర్చ ముగిసే వరకు పార్లమెంటు లాబీల్లో టీడీపీ ఎంపీలకు అందుబాటులో ఉంటారు. కేంద్ర ఇచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను ఎంపీలకు అందించారు. 

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశం వైపీసీపి లేకుండా పోయింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌ గతనెలలోనే ఆమోదించారు. ఇది వైసీపీ వ్యూహాత్మక తప్పిదమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అన్నది టీడీపీ వాదన. అవిశాసంపై జరిగే చర్చలో పాల్గొంటే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రెండు పార్టీల నాయకులు చర్చించుకుని రాజీనామాలను ఆమోదింప చేసుకున్నారన్న అంశాన్ని టీడీపీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ వాదాన్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాము లోక్‌సభలో లేని సమయంలో టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతించడం..టీడీపీ, బీజేపీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమన్న వాదాన్ని వినిపిస్తున్నారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశం కోల్పోయామన్న అంశంపై వైసీపీలో అంతర్మథనం జరుగుతోంది. ఇది పార్టీ నాయకులను ఆత్మరక్షణలో పడిసిందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అవిశ్వాసాన్ని రాజకీయంగా సానుకూలంగా తీసుకోవాలని టీడీపీ నిర్ణయించిన తరుణంలో... తమ వాదాన్ని ప్రజలకు వినిపించాలని వైసీపీ నిర్ణయించింది. 

అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గోనున్న టీఆర్‌ఎస్‌... విభజన చట్టంలోని హామీల వరకే పరిమితం కావాలని నిర్ణయించింది. విభజనట్టంలోని ప్రత్యేక హోదా అంశంతో తమకు సంబంధలేని తేల్చి చెప్పింది. మొత్తంమీద అవిశ్వాసంపై ఎవరికి వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

17:06 - July 19, 2018

గుంటూరు : దేశ రాజకీయాల్లో రేపు అరుదైన ఘటన జరగబోతుందన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌. టీడీపీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరుగుతుందని, ఇది మోదీకి అగ్నిపరీక్ష అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హింసాత్మక సంఘనలకు పాల్పడుతుందని మండిపడ్డారు. పాదయాత్రలకంటే పార్లమెంట్‌ పవిత్రమైనదని వైసీపీ గుర్తించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం రాజకీయాలకు అతీతంగా అవిశ్వాసానికి అందరూ మద్దతు పలకాలన్నారు. 

 

11:45 - July 19, 2018
21:07 - July 16, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలపై పోరాడేందుకు మద్ధతివ్వాలని కోరుతూ.. ఢిల్లీలో ప్రతిపక్షనేతలను టీడీపీ ఎంపీలు కలిశారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోపాటు వామపక్షనేతలను కలిశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంపీ డీ రాజాను టీడీపీ ఎంపీలు తోట నరసింహం, రవీంద్ర బాబు కలిశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖతోపాటు.. విభజన చట్టంలో అమలు కాని హామీల వివరాలను వారికి అందజేశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని సీతారాం ఏచూరి విమర్శించారు. బీజేపీ వైఫల్యాలను, మోసాలను బట్టబయలు చేస్తామని ఆయన అన్నారు.

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

16:29 - July 11, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కృషి చేస్తుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకరించడం లేదని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ గడ్డపై ఎంతో మంది వీరులు పుట్టారని..వారి ఉద్యమ స్పూర్తిని తీసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభివృద్ధికి మోడీ సహకరించాలని..కానీ అలా చేయడం లేదన్నారు. కరవు జిల్లా..ఎడారిగా మారుతున్న జిల్లాలో సంకల్పం పూనుకుని కాల్వలు..చెరువులు..నీళ్లతో నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో స్వచ్చమైన నీరు తాండవం చేస్తోందని, ఉద్యోగాలు..ఉపాధి కోసం..కడుపు మంటతో వలసలు వెళ్లిన కుటుంబాలను చూసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కియో పరిశ్రమ ఏర్పాటు చేసి వలసల నివారణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం..జాతిపై చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. 

16:25 - July 11, 2018

అనంతపురం : టిడిపి మంత్రులు..ఎంపీలు జనసేన అధ్యక్షుడు పవన్ ను టార్గెట్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. బాబు..లోకేష్ లపై పవన్ చేస్తున్న ఆరోపణలను ఎంపీలు తిప్పికొట్టారు.

పవన్ ను చూస్తే బాధేస్తోందని..ప్రజారాజ్యాన్ని ప్రజలు నమ్మారని..కానీ వారు మాత్రం కోట్ల రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు. పవన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి బీఫారాలు తీసుకున్నారని..ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇవన్నీ పవన్ కు తెలియదా ? అని నిలదీశారు. ప్రజల్లో మమేకమవుతే రాజకీయాలు తెలుస్తాయని, కేంద్రంతో డబ్బులు తీసుకుని బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

15:59 - July 11, 2018

అనంతపురం : వైసిపి..జనసేన..బిజెపి పార్టీలపై టిడిపి మంత్రులు, ఎంపీలు విమర్శల పర్వం కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని... గద్దె నింపే వరకు పోరాటం చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామన్నారు. బీజేపీ..జనసేన..వైసీపీ పార్టీలు కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంలో వీరు కూడా పావుగా మారుతున్నారని..మోడీకి భజనపరులరని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన పవన్ జగన్ ఫ్యాన్ గాలిగా ఎందుకు మారాడో అర్థం కావడం లేదన్నారు. పోరాటం ఇక్కడితే ఆగదని..ఇంకా ఉధృతంగా సాగుతుందన్నారు. 

15:04 - April 23, 2018

గుంటూరు : ప్రధాని మోదీ, అమిత్‌ షాలు చేస్తున్న కుట్రలను ఏపీ ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌. జనసేన, వైసీపీలు బీజేపీతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకొని ఆంధ్రకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాంటూ టీడీపీ గుంటూరు తూర్పు నియోజక వర్గ ఇంచార్జ్‌ మద్దాల గిరి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు భారీ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 30 వరకు ఈ ర్యాలీలు కొనసాగుతాయని నేతలు తెలిపారు. 

13:32 - April 11, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అంతా ఇచ్చేశారంటూ మోడీ..జైట్లీని ఆకాశానికెత్తేసి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసింది ప్రభుత్వమయితే తమపై ఎందుకు బురద చల్లుతున్నారని, విభజన హోదా అమలు కోసం వెళ్లేలేదని..వెళితే వినతిపత్రాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని, ప్రత్యేక హోదా సాధించడమే వైసీపీ లక్ష్యమయితే హోదాకు వెన్నుపోటు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓ పత్రికలో పథకాలపై 71 శాతం సంతృప్తిగా ఉన్నట్లు ఓ వార్త ప్రచురితమైందని..ఇది అసత్యమని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - TDP MPs Protest