tdp party

18:18 - August 26, 2018

శ్రీకాకుళం : మరో నేత జంప్ కానున్నారు. కాంగ్రెస్ నేత కొండ్రు మురళి టిడిపి పార్టీలో చేరనున్నారు. ఆయన కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో సంప్రదింపులు జరపగా, కార్యకర్తల అభీష్టం మేరకే టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈనెల 31 న పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధినేత కళావెంకట్రావు ఆధ్వ‌ర్యంలో అమరావతి చంద్రబాబు నివాసంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబు పడుతున్న తపన..అభివృద్ధి చూసి తాను టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు.

 

11:48 - July 13, 2018

రాజకీయాల్లో నేతలు, నాయకులు ఎంతమంది వున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే నిజాయితీ, నిబద్దత, అంకిత,సేవా భావాలు కలిగిన నాయకులు మాత్రం కొందరే వుంటారు. వారి ప్రాణాలతో లేకపోయినా..ప్రజల గుండెల్లో మాత్రం నిత్యం మన్ననలు అందుకుంటునే వుంటారు. అటువంటి అరుదైన, అద్భుతమైన నాయకుల్లో ఒకరు నటరత్న ఎన్టీఆర్. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోను ఆయన ఒక ప్రభంజనం, ఒక సంచలనం, ఒక చరిత్ర, ఒక సునామీ. పార్టీ పెట్టిన కేవలం నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించి చరిత్రలో నిలిచిపోయారు స్వర్గీయ నందమూర్తి తారక రామారావు. కానీ అంతటి ఘనత, తెగువ, సమర్థత గలిగన నాయకులు నందమూరి కుటుంబంలో ఎవరు లేరు. కానీ నందమూరి వారి పేరు మాత్రం రాజకీయాల్లో వినిపిస్తు..కనిపిస్తునే వుంటుంది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలి నుండి ఇప్పటివరకూ నేతలు పలువురు వున్నారు. ఈ క్రమంలో మరో యువనేతగా అరగ్రేటం చేసేందుకు రెడీ అవుతున్నారు. అతనే ఎన్టీఆర్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న సమయంలో కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేసిన దగ్గుపాటి పురంధేశ్వరి కుమారుడు హితేష్. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిలిద్దరు తమ రాజకీయ వారసుడిగా కుమారుడు హితేష్ చెంచురామ్ ను నిలపాలని భావిస్తున్నారు. కాకపోతే ఏ పార్టీ నుంచి అతన్ని పోటీ చేయించాలా? అన్న విషయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదని దగ్గుబాటి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

పరిచయం అక్కర్లేని కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడిగా, మాజీ మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి, ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం గతంలో కాంగ్రెస్ లో, ప్రస్తుతం బీజేపీలో ఉంటూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక తమ కుమారుడు హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి అసెంబ్లీకి నిలపాలని భావిస్తున్న వీరిద్దరూ, ఏ పార్టీ నుంచి పోటీకి దింపాలన్న విషయమై నిర్ణయం తీసుకోలేదట.

హితేశ్ టీడీపీ నుండి పోటీ చేస్తారా?..
బీజేపీ నుంచి హితేష్ ను బరిలోకి దింపడానికి పురందేశ్వరికి ఆటంకం ఏమీ లేనప్పటికీ, గెలుపు అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయని ఈ దంపతులు భావిస్తున్నారట. తమ కుటుంబాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా, పిల్లల ఎదుగుదలపై అటువంటి ప్రభావం పడేలా భువనేశ్వరి, పురందేశ్వరిలు వ్యవహరించక పోవడంతో, లోకేష్, హితేష్ ల మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని దగ్గుబాటి అనుచరగణం వ్యాఖ్యానిస్తోంది. అదే జరిగితే పురందేశ్వరి బీజేపీలో కొనసాగే అవకాశం ఉండదు. మరోపక్క, అటు వైకాపా, ఇటు కాంగ్రెస్ కూడా హితేష్ పట్ల సానుకూలంగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో ఉన్న హితేష్ చెంచురామ్ ఏ పార్టీ వైపు వెళతారో త్వరలోనే తేలుతుంది.

09:51 - April 6, 2018

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తెలుగువారితో పెట్టుకోవద్దు...తమ పొట్టకొట్టదన్నారు.

 

09:51 - April 6, 2018

గుంటూరు : టీడీపీ సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది. వెంటకపాలెం నుంచి చంద్రబాబు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ పై చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తెలుగువారితో పెట్టుకోవద్దు...తమ పొట్టకొట్టదన్నారు.

 

08:52 - April 6, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సీఎం సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.  

 

08:27 - April 6, 2018

గుంటూరు : కాసేపట్లో సీఎం చంద్రబాబ సైకిల్ ర్యాలీ ప్రారంభించనున్నారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర యాత్ర చేయనున్నారు. సైకిల్ యాత్రలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సీఎం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లాల్లో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.  

 

07:19 - April 6, 2018

గుంటూరు : విభజన హక్కుల సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేలా టీడీపీ సన్నద్ధమవుతోంది. పరిస్థితులకు అనుగుణంగ వ్యూహాలు మార్చుకుంటూ దశలవారీ పోరాటానికి రెడీ అయ్యింది. ఇవాళ సైకిల్‌ యాత్రలకు పిలుపునిచ్చింది. వెంకటపాలెం ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర సైకిల్‌యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిల్‌యాత్ర నిర్వహించి కేంద్రానికి నిరసన తెలుపనున్నారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. దశలవారీగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సందర్భానుసారం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ.. తదుపరి కార్యాచరణకు రెడీ అయ్యింది. నేటితో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనుండడంతో ఏం చేయాలన్నదానిపై రాత్రి చంద్రబాబు పార్టీ ముఖ్యులతో సమావేశయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
నేడు సైకిల్‌, మోటార్‌సైకిల్‌ యాత్రలు
ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో సైకిల్‌, మోటార్‌సైకిల్‌ యాత్రలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వెంకటపాలెం వద్దనున్న ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర సైకిల్‌యాత్రను సీఎం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చంద్రబాబుతోసహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  సైకిళ్లతో వెళ్తారు. 
13 జిల్లాల్లో టీడీపీ ఎంపీల ఆత్మగౌరవయాత్ర
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆత్మగౌరవయాత్ర పేరుతో ఎంపీలు బస్సుయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఎంపీలతోపాటు మిగతా ప్రజాప్రతినిధులంతా  ఆయా జిల్లా కేంద్రాల్లో పాల్గొననున్నారు. ఈ యాత్ర తేదీలు, విధివిధానాలు శనివారం ఖరారు చేయనున్నారు.   శనివారం మధ్యాహ్నం రెండున్నరకు మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశానికి జగన్‌నూ ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ జగన్‌ దగ్గరికి ప్రభుత్వం ప్రత్యేక దూతలను పంపనుంది. శాసనసభ సమావేశాలు పూర్తైన వెంటనే ఇద్దరు మంత్రులను జగన్‌ పాదయాత్ర దగ్గరికి పంపించి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. భవిష్యత్‌ కార్యాచరణను శనివారం ప్రకటించనున్నట్టు ఏపీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మొత్తానికి ప్రత్యేకహోదాపై భవిష్యత్‌ ఉద్యమానికి టీడీపీ సన్నద్దమవుతోంది. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

 

17:21 - March 14, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా తలబడి నినాదాలు చేసుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు గోకవరం బస్టాండ్‌ వద్ద నున్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేయగా వివాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలు హోరా హోరిగా నినాదాలు చేసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్క దిద్దారు. 

 

21:59 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతలకు సూచించారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలన్న నేతల సూచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న ఆయన... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించాలని చెప్పారు. మరోవైపు కార్యకర్తలు తనకు  ఫిర్యాదు చేసే పరిస్థితులు తెచ్చుకోరాదని ఘాటుగా నేతలను హెచ్చరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం, టీటీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ అయిన ఆయన.. తాజా రాజకీయ పరిణామాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు విస్తృతంగా కొనసాగించాలని బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర నాయకత్వం స్వయంగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తలో ధైర్యం వస్తుందని... త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభకు తాను హాజరవుతానని బాబు చెప్పారు. మహానాడులోపు మూడు బహిరంగసభలు నిర్వహించాలని నేతల సూచనకు బాబు అంగీకారం తెలిపారు. 

పొత్తుల అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామన్న చంద్రబాబు... ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే నేతలంతా దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 

రెండు రాష్ట్రాల్లో పార్టీకి అండగా ఉంటానన్న చంద్రబాబు... కొందరు నాయకులు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మే నెలాఖరు నాటికి నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

16:28 - March 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశంను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ తెగతెంపులు చేసుకుంటే.. తాము స్వతంత్రంగానే ఉంటామని ఆపార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇవాళ రెండోరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ పొత్తు వద్దనుకుంటే... స్వతంత్రంగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తుపై ఎలక్షన్ సమయంలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు రావుల తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - tdp party