Telakapalli Ravi

09:33 - June 12, 2017

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయత, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి మృతి పట్ల ప్రముఖ విశ్లేసకులు తెలకపల్లి రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యాన్ని ప్రజుల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి సినారె అని, సినీ ప్రరిశ్రమ గొప్ప వ్యక్తి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినారె వందల, వేల మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని తెలకపల్లి కొనియడారు. ఒక మహా శిఖరం కోల్పోయినందుకు బాధగా ఉందని తెలిపారు. నిలకడ ఉన్న నీటిలో కమలు కాదు క్రిములు కూడా పుడతాయని సమాజానికి దారి చూపాడని ఆయన అన్నారు.

 

21:30 - April 30, 2017

అనంతపురం : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన చైతన్య స్వరూపి వేమనపై అనంతపురంలో సాహిత్య సమాలోచన కార్యక్రమం ఘనంగా జరిగింది. 250 సంస్థల ఆధ్వర్యంలో మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ వేత్తలు, కవులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కుల వ్యవస్థ, అవినీతి అక్రమాలు, శ్రమదోపిడీ చెలరేగిపోతున్న నేటి సమయంలో వేమన సందేశం మనకు ఎంతో అవసరమని సాహితీ ప్రియులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సి గేయానంద్, పలువురు రచయితలు, మేధావులు పాల్గొన్నారు.

09:43 - March 13, 2017

నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి బాధాకరమని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దినకర్, టీఆర్ ఎస్ నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నేత కొనకళ్ల నాగేష్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:38 - January 26, 2017
18:29 - January 26, 2017

హైదరాబాద్: ఏపీ కి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో యువత ముందుకు వచ్చి విశాఖ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, వామపక్షాలు, వైసీపీ పార్టీ లు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసి, విశాఖ లో ఎమర్జెన్సీని తలపించేవిధంగా పోలీసులను మోహరించారు. ఇది ఎంత వరకు కరెక్టు. ఇదే అంశంపై 'టెన్ టివి'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, టిడిపి నేత మాల్యాద్రి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

22:11 - December 31, 2016

బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇంకా బారులు తీరుతున్న జనం..ఏటీఎంల ముందు ఇంకా నో క్యాష్‌ బోర్డులే..అన్ని రంగాల్లోనూ నెగిటివ్ గ్రోత్ ..వృద్ధి అంచనాలను తగ్గించేసిన రేటింగ్‌ సంస్థలు..డిజిటల్‌ పేమెంట్ వ్యవస్థలకు పెరిగిన గిరాకీ.. దేశ జీడీపీలో పనికి రాకుండా పోయిన 12 శాతం నగదు ..పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్‌ వంటి మొబైల్‌ వాలెట్లు ముప్పేట పబ్లిసిటీ..నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగంలోని కార్మికులకు తీవ్ర ఇబ్బందులు..ఈ క్రమంలో నోట్ల రద్దు ప్రకటించిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో మోదీ వరాల  ప్రకటన వుండబోతోందా? అసలు ప్రధాని ప్రసంగంలో ఎటువంటి విశేషాలుంటాయి అనే అంశంపై దేశమంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది ఈ చర్చలో ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ నేత ),తెలకపల్లి రవి(రాజకీయ విశ్లేషకులు),తులసీరెడ్డి (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో ఎటువంటి విశ్లేషణలు సాగాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

20:09 - September 6, 2016

తిరుపతి : పుస్తకాలు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లిరవి. తెలుగుభాష, సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే... యువత పుస్తకాలు చదవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతిలో సీకే నారాయణరెడ్డి స్మారక గ్రంథాలయాన్ని తెలకపల్లి రవి ప్రారంభించారు.

21:39 - August 12, 2016

తూర్పుగోదావరి : ప్రముఖ అభ్యుదయ కవి అవంత్స సోమసుందర్ మృతిచెందారు. వజ్రాయుధం, సుబ్రహ్మణ్య భారతి, ముత్యాల సరాలు, చంద్రభాగ, అమ్మ, యుగపురుషుని ప్రహసనాలు, హెన్రిక్‌ హెయినీ, కాళిదాసు రామకథ, రామ్‌ రాజ్యమ్‌, నాడూ నేడూ శకుంతల ఆడదే, కాజీ నస్రుల్‌ ఇస్లూమ్‌ వంటి గొప్పు పుస్తకాలను ఆయన రచించారు. అవంత్స మృతి సాహితీ లోకానికి తీరనిలోటని పలువురు రచయితలు పేర్కొన్నారు. రేపు రంగరాయ మెడికల్ కాలేజీకి అవయవదానం చేసి సోమసుందర్ మృతిదేహాన్ని సందర్శనార్ధం పిఠాపురానికి తరలించనున్నారు.

అవంత్స సోమసుందర్‌ రచనలు..
అవంత్స సోమసుందర్‌ ఎన్నో గొప్ప రచనలు చేశారు. వజ్రాయుధం, సుబ్రహ్మణ్య భారతి, ముత్యాల సరాలు, చంద్రభాగ, అమ్మ, యుగపురుషుని ప్రహసనాలు, హెన్రిక్‌ హెయినీ, కాళిదాసు రామకథ, రామ్‌ రాజ్యమ్‌, నాడూ నేడూ శకుంతల ఆడదే, కాజీ నస్రుల్‌ ఇస్లూమ్‌ వంటి గొప్పు పుస్తకాలను రచించారు. అవంత్స మృతి సాహితీ లోకానికి తీరనిలోటని పలువురు రచయితలు అన్నారు. 

15:00 - August 12, 2016

తూర్పుగోదావరి : ప్రముఖ కవి అవంత్స సోమసుందర్ కన్నుమూశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారంనాడు మృతి చెందారు. సోమసుందరం స్వస్థలం జిల్లాలోని పిఠాపురం. వజ్రాయుధం పుస్తకంతో ఆయన భావ కవిత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. మేఘరంజని, అక్షయ తరంగిణి, రక్తాక్షి, కాహళి పుస్తకాలతో ఆయన సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందారు. సోమసుందర్ మృతిపట్ల దేవిప్రియ,తెలకపల్లి రవి, ఖాదర్‌ మొహియుద్దీన్‌, వోల్గా, శిఖామణి, పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.అభ్యుదర సాహిత్యంలో ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Telakapalli Ravi