telangana assembly

16:33 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అపద్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దుపై ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ వేసిన పిటిషన్‌తోపాటు అసెంబ్లీ రద్దుపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో అసెంబ్లీ రద్దుపై అడ్డంకులు తొలగిపోయాయి. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దైన సంగతి తెలిసిందే.

 

13:52 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో గులాబీ దళం దూసుకపోతోంది. 119 స్థానాలకు గాను 105 మంది అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్‌లో ఉంచారు. దీనితో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని స్థానాల్లో అసమ్మతి రాజుకొంటోందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలు మొత్తం కీలకమైన స్థానాలు కావడం విశేషం. 

తాజాగా రెండో జాబితాను టీఆర్ఎస్ అధిష్టానం సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక్కడ కూడా సిట్టింగ్ వారిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు గుండెకాయగా ఉన్న ఖైరతాబాద్‌కు దానం నాగేందర్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన దానం గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ముషీరాబాద్‌కు ఎం.గోపాల్, గోషామహల్‌కు ప్రేమ్ సింగ్ రాథోడ్, అంబర్ పేట ఎడ్ల సుధాకర్ రెడ్డి, మల్కాజ్ గిరి మైనంపల్లి హన్మంతరావు, వరంగల్ ఈస్ట్-నన్నపనేని నరేందర్, మేడ్చల్ సీహెచ్, కోదాడ-చంద్రరావు, హుజూర్‌నగర్-సైదిరెడ్డి, చొప్పదండి రవిశంకర్, జహీరాబాద్-ఎర్రోళ్ల శ్రీనివాస్, వికారాబాద్-రాంచందర్ లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ మరో రెండు నియోజకవర్గాలకు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటిస్తే గాని అభ్యర్థులను ఎవరనేది తెలియదు. 

15:08 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా సమయం ఉంది...ఈసీ కూడా అప్పుడే ఎన్నికలు కూడా ప్రకటించలేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించేసింది. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

13:38 - September 6, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠకు కాసేపట్లో తెరపడబోతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు గురువారం ముహుర్తం నిర్ణయించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్, తన మంత్రివర్గ సహచర బృందంతో బయలుదేరారు. అక్కడ ఆయన శాసనసభ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్న లేఖను గవర్నర్ కు అందచేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే నిజాం కాలేజీకి చెందిన నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

13:35 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. రద్దు సిఫార్సును సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ కు అందచేశారు. రద్దు సిఫార్సును లేఖ ద్వారా గవర్నర్ కు అందజేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై వివరణ ఇచ్చారు. ప్రత్యేకబస్సులో సీఎం కేసీఆర్, మంత్రులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఉదయం నుంచి కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగిన సంగతి తెలిసిందే.
9నెలల ముందే అసెంబ్లీ రద్దు 
9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ రద్దుపై అధికార ప్రకటన చేయాల్సివుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి మెజారిటీ ఉండడంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించలేరు. కేసీఆర్ కు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి. 

06:46 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుకు నేడు ముహూర్తం ఖరారు అయింది. అసెంబ్లీ రద్దు సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. హైదరాబాద్ లో మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రగతి భవన్ పిలుపు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నేడు కేబినెట్ కీలక భేటీ కానుంది. అయితే కేబినెట్ సమయం తెలియక మంత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు.
మూడు సమయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయం 6.30, ఉదయం 11.30, మధ్యాహ్నం 1.30 సమయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. కేబినెట్ తీర్మానం ప్రతిని కేసీఆర్ గవర్నర్ కు అందజేయయనున్నారు. 

 

19:35 - August 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 'ముందస్తు' వేడి మరింత రాజుకుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. దీనితో కాంగ్రెస్ మేల్కొంది. గాంధీ భవన్ లో టిపిసిసి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో కో ఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని...అలాగే టీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఇప్పటికే అధ్యయనం చేసిన కాంగ్రెస్ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. పలు కమిటీలు నియమించి విస్తతంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ నిర్వహించే 'ప్రగతి నివేదన' సభకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని టిపిసిసి యోచిస్తోంది. ఒక బహిరంగ లేఖను విడుదల చేయాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణాది తెలంగాణ ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించి ప్రగతి నివేదన సభ కాదని..ప్రజల ఆవేదన అని పేర్కొంటామని తెలియచేస్తున్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:29 - August 15, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు కోర్టు తీర్పును అమలు పర్చని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను కేటాయించమని హైకోర్టు చెప్పినా కోర్టు తీర్పును పట్టించుకోని డీజీపీ, నల్లగొండ ఎస్పీ, జోగుళాంబ ఎస్పీకీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం మంచిదికాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే హైకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ వ్యవహారంలో ప్రతిఅంశంలో కోర్టు తీర్పుకు ఎదురెళ్లిన ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. అంతేకాదు... ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పును పట్టించుకోని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి ఫారం-1 నోటీసులు పంపింది. కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కపడింది.

శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కోర్టు కెళ్లిన కోమటిరెడ్డి, సంపత్‌
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత కోర్టు తీర్పు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వ తీరు మారుతుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శి కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలిద్దరూ వారిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుతో తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలని, తమకు గన్‌మెన్‌లను కేటాయించాలని రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో మరోమారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆరు వారాలపాటు ఇరువురి వాదనలు విన్నది. కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి ఫారం 1 నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో సెప్టెంబర్‌ 17న న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావ్‌తోపాటు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు ఇద్దరూ నేరుగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

కోర్టు తీర్పు వెలువడినా ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం
హైకోర్టు ఇచ్చిన తీర్పులో మరో సంచలన అంశం అసెంబ్లీ స్పీకర్‌కే నోటీసులు ఇవ్వడం. గన్‌మెన్‌లను ఇవ్వడానికి స్పీకర్‌ నుంచి మాకు వాళ్లను శాసనసభ్యులుగా పరిగణించే అనుమతి రాలేదని జోగులాంబ, నల్లగొండ జిల్లా ఎస్పీలు గతంలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కోర్టు చెప్పిన తర్వాత కూడా ధిక్కారానికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ స్పీకర్‌కు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌కు షోకాజ్‌ నోటీసులిచ్చి కోర్టుకు హాజరుకావాలని చెప్పడం చాలా అరుదు. మరి కోర్టు ఇచ్చిన నోటీసులను స్పీకర్‌ పరిగణిస్తారా లేదా చూడాలి.

ఏ అకౌంట్‌లో జమచేశారో చెప్పాలన్న న్యాయస్థానం
జనవరి 2018 నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎంత ఇచ్చారని నిలదీసింది. ఏ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారో పూర్తి వివరాలు అసెంబ్లీ రిజిస్టర్‌ తెలుపాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఎంతటివారైనా శిక్షార్హులే అని హైకోర్టువ్యాఖ్యానించడం కొసమెరుపు.

21:30 - August 14, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు ఫారమ్..01 నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలు నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు అసెంబ్లీ రిజిస్ట్రర్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

 

16:17 - May 7, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దుపై టి.కాంగ్రెస్ ఇంకా పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలు కలిశారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఆదేశం ప్రభుత్వం అమలు చేసేలా చూడాలని కోరారు. కోర్టు ఆదేశాల కాపీలను గవర్నర్ కు అందచేయడం జరిగిందన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana assembly