telangana cm

06:47 - February 14, 2018

హైదరాబాద్ : జనాభాలో 50శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వీహెచ్‌. ప్రస్తుతం 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నా..వాటిలో బీసీలకు చేరేది మాత్రం 9శాతంగా మాత్రమే ఉందన్నారు. అత్యంత వెనుకపడిన కులాలు అంటూ బీసీలకు సీఎం కేసీఆర్‌ మరింత అన్యాయం చేస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. క్రీమిలేయర్‌ నిబంధనలతో బీసీల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ప్రధాని మోదీ బీసీలపై ఉన్న క్రీమిలేయర్‌ నిబంధనలు ఎత్తివేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

 

07:56 - February 13, 2018

దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజ్ మోహన్ (టీఆర్ఎస్), నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:37 - February 13, 2018

హైదరాబాద్ : దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్‌ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్‌ సర్కార్‌ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.

దేశంలోని ముఖ్యమంత్రులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడని ప్రభుత్వేతర సంస్థ అయిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌-ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించింది. రాజకీయ నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక సిద్దం చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని సీఎంల వివరాలపై ఈ సంస్థలు నివేదికలు రూపొందించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఈ సందర్బంగా పరిశీలించారు. 100 కోట్లకు పైగా ఆస్తులున్నవారిలో ఇద్దరు,.. 10 నుంచి 50 కోట్ల మధ్య ఆరుగురు,.. 10 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన సీఎంలు 17 మంది ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తులున్న సీఎంలుగా ఆరుగురు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.

అత్యంత ధనికుడైన సీఎంగా చంద్రబాబు రికార్డ్‌ సృష్టించారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 177 కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ 129 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ 48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 15 కోట్ల 15 లక్షల 82 వేల ఆస్తులు తన పేరున ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఇక అతి తక్కువ ఆదాయం గల సీఎంగా త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రికార్డ్‌ సాధించారు. సీపీఎం పార్టీకి చెందిన మాణిక్‌సర్కార్‌ పేరుపై కేవలం 26 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 30 లక్షలతో రెండో స్థానంలో, జమ్మూకాశ్మీర్‌ సీఎం మెహబుబా ముఫ్తీ 50 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్‌ 22 కేసులతో మొదటి స్థానంలో నిలిచారు.

21:56 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మిర్చి రైతులు  నిండా మునుగుతున్నారు. అప్పుచేసి సాగుచేసిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో దిగాలు చెందుతున్నారు. అప్పులు తీర్చే దారి తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర కల్పించి వారిని ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు, సీపీఎం నాయకులు  ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మిర్చికి రైతుకు లభించని మద్దతు ధర
తెలంగాణలో మిర్చి రైతు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆశలేపెట్టుబడిగా సాగుచేసిన మిర్చి వారి కంట్లో కన్నీరు తెప్పిస్తోంది. పగలురాత్రి కష్టపడి సాగుచేసిన మిర్చీని... తీరా మార్కెట్‌కు తరలిస్తే  అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. గత సంవత్సరం క్వింటాల్‌కు  10వేలకు పైగా పలికిన మిర్చి ధర ఇప్పుడు 3 నుంచి 6వేలకు మించకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వేలకు వేలు అప్పుచేసి మరీ సాగుచేసిన మిర్చికీ కనీస ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 
ఎనుమాముల మార్కెట్‌కు భారీగా మిర్చి
వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌ అతిపెద్దది.  ఇక్కడికి రోజుల వేల క్వింటాళ్ల మిర్చి వస్తోంది. ఈ మార్కెట్‌లో క్వింటాల్‌ మిర్చిని 4500 నుంచి  5000 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆవేదన చెందిన కొందరు రైతులు తాము తీసుకొచ్చిన  మిర్చిని అందరూ చూస్తుండగానే దగ్దం చేశారు. పక్క రాష్ట్రాల్లో 10వేలకుపైగా మద్దతు ధర లభిస్తోంటే ఇక్కడెందుకు తగ్గిందని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. వీరికి రైతు సంఘాల నేతలు కూడా అండగా నిలిచారు. క్వింటాల్‌ మిర్చికి 10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మార్కెట్‌ను సందర్శించిన తమ్మినేని వీరభద్రం
ఎనుమాముల మిర్చి మార్కెట్‌ యార్డును సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు.  రైతులు తమ కష్టాలను తమ్మినేనితో మొరపెట్టుకున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై స్పందించాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులే ప్రభుత్వం తిరగబడతారని హెచ్చరించారు. 
మిర్చి రైతులకు మద్దతుగా సీపీఎం ర్యాలీ
మిర్చి రైతులకు మద్దతుగా ఖమ్మంలో సీపీఎం నాయకులు ర్యాలీ  నిర్వహించారు. వర్తక సంఘం భవనం నుంచి గ్రైన్‌ మార్కెట్‌ వరకు  ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు.  క్వింటాకు పదివేల రూపాయాలు ఇచ్చి మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. 
 

17:41 - January 16, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ సాధనకు ప్రజలు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రకు తమపార్టీ మద్దతిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను గాలికొదిలారని తమ్మినేని విమర్శించారు.

22:04 - November 27, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మౌనప్రేక్షకుడిలా ఉండిపోదని ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నగదు రహిత లావాదేవీలకు అవసరమై ఈ పేమెంట్స్‌ వ్యవస్థను  బలోపేతం చేస్తామన్నారు. ఈ-పేమెంట్స్‌వ్యవస్థ ను పెంచేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు సీఎం. కరెన్సీ నోట్లతో పనిలేకుండానే  ప్రజలు లావాదేవీలు జరిపేలా బ్యాంకర్లతో  కలెక్టర్లు  చర్చించాలని కేసీఆర్‌  సూచించారు. 

 

16:01 - November 24, 2016
16:36 - July 7, 2016

హైదరాబాద్ : సెంటిమెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..మరో యాగానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో యాగం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి యాగాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై పౌరోహితులతో సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
మరో యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం  
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా..వ్యక్తిగత సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్‌..మరోసారి అదే బాటను ఎంచుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం ఆయుత ఛంఢీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌..మరో యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఆయుత చండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌..త్వరలో నిర్ణయించే యాగాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సుదర్శన యాగం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సుదర్శన యాగం పేరుతో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో యాగాన్ని చేయబోతున్నట్లు నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాగాన్ని ఒక రోజు నుంచి   మూడు లేదా ఐదు రోజులు కూడా యాగాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  కనీసం మూడు రోజుల పాటు సుదర్శన యాగాన్ని సీఎం నిర్వహించే అవకాశం ఉందని ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం
లోక కళ్యాణం కోసం ఆయుత చండీయాగం నిర్వహించానని చెప్పుకున్న కేసీఆర్‌..యాగం తర్వాత అన్ని అనుకూల ఫలితాలే అందాయని పార్టీ నేతలు అంటున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా పార్టీ  ఊహించని మెజార్టీని దక్కించుకుంది. మరో వైపు ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బందులు ఎదురు కాలేదన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహించే యాగంతో కూడా తెలంగాణాతో పాటు..ముఖ్యమంత్రికి అన్ని రకాలుగా కలిసి వస్తుందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా పుష్కరాలు తర్వాత
యాగానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి తేదీలు ఖరారు కాలేదు. అయితే ఆగస్టు నెలలో కృష్ణా పుష్కరాలు ఉన్న నేపథ్యంలో పుష్కరాల తర్వాతే సుదర్శన యాగం తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

10:36 - June 11, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ చూపు ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై పడింది. తెలుగుదేశం,వైసీపీ లను ఖాళీ చేసిన గులాబి దళం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. సిట్టింగ్ అయినా ఓకే.. మాజీలయినా బే ఫర్వా అంటూ గులాబి దళపతి వలసలను ప్రోత్సహిస్తున్నారు.

టీఆర్ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు...
తెలంగాణాలో బలమైన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందేందుకు గులాబీ దళపతి వ్యూహాత్మకంగా సాగుతున్నారు. అన్ని పార్టీల నేతలను కారెక్కించుకుంటూ.... ఆ పార్టీలను మానసికంగా బలహీన పరుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అప్రతిహత విజయమే లక్ష్యంగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణాలో రాజకీయ పునరేకీకరణ అంటూ.. గులాబీ బాస్ ఇతర పార్టీలను నేతలను పెద్ద ఎత్తున కారెక్కించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎందరో శాసనసభ్యులు కారెక్కేశారు. త్వరలోనే మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు.. పార్టీ సీనియర్లకూ గులాబీ తీర్థం ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ అధినేత సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యం..
తెలంగాణలో టీడీపీ, వైసీపీలను దాదాపుగా ఖాళీ చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని ఆకర్షాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ కు పట్టున్న జిల్లాలతో పాటు నామమాత్రపు బలం ఉన్న జిల్లాల్లోని కాంగ్రెస్‌ నేతలను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు.

కేసీఆర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందిన వివేక్‌ బ్రదర్స్‌?...
తెలంగాణా సాధన కోసమంటూ.. హస్తం పార్టీని వీడి కారెక్కి, ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరిన వివేక్ బ్రదర్స్‌ను మళ్లీ గులాబీ గూటికి రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ఈమధ్యనే కేసీఆర్‌ను కలిసి కారెక్కేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ పొందినట్లు సమాచారం. మరో సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటే వీరంతా గులాబీ గూటికి చేరతారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

కీలక నేతలతో టీఆర్ఎస్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలో పాటు.. మరికొంత మంది సిట్టింగ్ శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్ కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావ్‌కు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబి దళంలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా........ వారి డిమాండ్లపై అధికార పార్టీ అంతగా సానుకూలంగా లేదని సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఎప్పుడైనా అధికార పార్టీ గూటికి చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుండి భారీగా వలసలు...
పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ నేతల దరఖాస్తులను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని ఓ మంత్రే వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. త్వరలోనే కాంగ్రెస్‌ నుంచి భారీ వలసలు ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది.

 

06:51 - May 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు టీఎస్ సర్కారు చర్యలు చేపట్టింది. ఆరోజున పరేడ్‌ మైదానంలో ఉత్సవాలు, సాయంత్రం ఉద్యమ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక వేడుకలు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ఉత్సవాలు హోరెత్తిపోయేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది..

జూన్‌ 2 వచ్చిందంటే చాలు..

జూన్‌ 2 వచ్చిందంటే చాలు.. తెలంగాణలో ఎక్కడచూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది.. రాష్ట్ర అవతరణ వేడుకలతో హోరెత్తిపోతుంది.. ఈసారికూడా ఆ స్థాయిలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది... ఈ ఏర్పాట్లలోభాగంగా ఉత్సవాల నిర్వహణ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌ నాయిని నర్సింహ్మరెడ్డి, మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎస్‌ రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.. ఉత్సవాలను ఎక్కడ ఎలా జరపాలన్న అంశంపై మంత్రులకు పలు సూచనలు చేశారు..

అందరూ పాల్గొనాలని సీఎం ఆదేశం....

జూన్‌ 2 వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అందరూ పాల్గొనాలని సీఎం ఆదేశించారు.. అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాల్లో సన్మానించాలని సూచించారు.. జీవిత సాఫల్య పురస్కారంతోపాటు... వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 50మందికి రాష్ట్ర స్థాయిలో... 25మందికి జిల్లా స్థాయిలో అవార్డులు అందించాలని ఆదేశించారు.. ట్యాంక్‌ బండ్‌పై బాణ సంచా పేల్చి సంబరాలు జరపాలని సీఎం ఆదేశించారు..

ప్రతి జిల్లాకు 30లక్షల రూపాయలు...

అటు ఉత్సవాల నిర్వహణకోసం ప్రతి జిల్లాకు 30లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.. అవతరణ దినోత్సవం రోజున సాంస్కృతిక శాఖ కార్యక్రమాలపై మంత్రి చందూలాల్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.. అవతరణ దినోత్సవంరోజు 14 కేటగిరిల్లో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అర్హుల ఎంపికకోసం మంత్రి చందులాల్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.. మరోవైపు అవతరణ వేడుకలపై బుదవారం కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం కాబోతోంది.. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana cm