telangana congress

12:56 - October 7, 2018

హైద‌రాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో 119 స్థానాల‌కు ఒకే ద‌శ‌లో పోలింగ్ నిర్వ‌హించున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల తేదీని అనౌన్స్ చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రక‌ట‌న రావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించింది. అంద‌రూ ఒకే చోట కాకుండా విడివిడిగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. రోడ్డు షోలు, స‌భ‌లు, పాద‌యాత్ర‌లతో జ‌నంలోకి వెళుతున్నారు. 

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా పాద‌యాత్ర చేస్తుండ‌గా, కోదాడ‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రైతు గ‌ర్జ‌న స‌భ‌లో పాల్గొంటారు. ఇక కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ష‌బ్బీర్ అలీ, పొన్నం ప్ర‌భాక‌ర్  రోడ్ షోల పాల్గొంటారు. అన‌త‌రం మైనార్టీ స‌భ‌ల్లో పాల్గొంటారు. మైనార్టీల‌కు కాంగ్రెస్ ఏం చేసింది అనేది వారు తెలియ‌జేస్తారు. అలాగే మైనార్టీల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎలా మోసం చేసిందో చెప్ప‌బోతున్నారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార జోరును పెంచింది. వ్యూహాత్మంగా, ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతోంది. ఎవ‌రు ఎక్క‌డ ప్ర‌చారం చేయాల‌నే దానిపై ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. పార్టీలోని ప్ర‌ముఖ నాయ‌కులు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేయ‌బోతున్నారు. మ‌రోవైపు తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీలో పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటుపైనా మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

17:41 - October 3, 2018

నిజామాబాద్ :  టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ తట్టుకోలేని ప్రభుత్వంపై కేసులు పెడుతోందనీ..కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసుల పార్టీ అని ఉ అంటే కేసు..ఆ అంటే కేసులు..కూర్చుంటే నిల్చుంటే..బాత్రూమ్ కెల్లినా కేసులు పెట్టేలా కాంగ్రెస్ తయారయ్యిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీ విషయానికి పొద్దున్న లేచినకాడ్నుండి కాంగ్రెస్ లొల్లి లొల్లి చేయటమే కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసులు.. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసులు వేస్తారని ఎద్దెవా చేశారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇస్తామని చెప్పినం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసు వేశారు. వాళ్ల బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసు. సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 

 

12:32 - September 27, 2018

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐటీ దాడులపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తఃమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి ఇంటిపై ప్రభుత్వం.. ఐటీ దాడులు చేయిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ ఆరోపించారు. పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్‌ నాయకులను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న జగ్గారెడ్డిపై కేసు, నేడు రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ఇవన్నీ టీఆర్‌ఎస్‌ చేతకాని తనానికి నిదర్శనమని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోందని అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్, కొడంగల్‌లోని రేవంత్ నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారు. రేవంత్ బంధువుల ఇళ్లలోను ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలకు షాకులు తగులుతున్నాయి.

తన కుటుంబ సభ్యులతో బుధవారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శించుకున్న రేవంత్ రెడ్డి గురువారం ఉదయం కొడంగల్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది.

17:55 - September 26, 2018

ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్లు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో చేరి భంగపడ్డ వారు మళ్లీ కాంగ్రెస్‌లోకే వస్తున్నారు. ఇప్పటికే కొండా దంపతులు, రమేష్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎష్ ఎంపీ డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అక్టోబర్‌లో   ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఏఐసీసీ వర్గాలు ధృవీకరించాయి.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో తనపై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంపై డీఎస్ తీవ్ర అసంతృప్తిని కూడ వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని చూశారని టీఆర్ఎస్ అధిష్టానంపై ఆయన అసహనంగా ఉన్నారు. పైగా టీఆర్ఎస్‌‌లో తనకు సరైన గుర్తింపు లేదని ఆయన ఆవేదనగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథత్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని డీఎస్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దేవీనవరాత్రుల సందర్భంగా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని,ఏఐసీసీ వర్గాలు సైతం ధృవీకరించాయి.

13:49 - September 26, 2018

కొండా దంపతులతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆయన సతీమణి సుమన్ తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం ఆనందంగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొండా సురేఖ, కొండా మురళి బేషరతుగానే కాంగ్రెస్‌లోకి వచ్చారని ఆయన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద టికెట్ల ప్రస్తావన రాలేదన్నారు. రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులతో చర్చించి తామే సీట్లు కేటాయిస్తామని ఉత్తమ్ చెప్పారు.  కొండా దంపతులు, రాథోడ్ దంపతులు మర్యాదపూర్వకంగా రాహుల్‌ను కలిశారని తెలిపారు. కొండా దంపతుల రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే విశ్వాసాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేసినట్టు ఉత్తమ్ తెలిపారు. వారి చేరికతో నాలుగైదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపుతుందని, కచ్చితంగా గెలుస్తామని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసినట్టు ఉత్తమ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు అంతా మంచి కాలమే అని, కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

09:20 - September 21, 2018

హైదరాబాద్ : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెఢీ అవుతున్నతెలంగాణ‌ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త కుంప‌ట్లు రాజుకున్నాయి. ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎన్నో రకాల వ్యూహాలను రచిస్తోంది. తెలంగాణలో పార్టీలో దూకుడు పెంచేందుకు కమిటీలను ప్రకటించింది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ప్రచార, మేనిఫెస్టో, కో ఆర్డినేషన్, స్ట్రాటజీ  కమిటీతో పాటు మొత్తం 10 కమిటీలను నియమించింది. పార్టీకు మేలు చేస్తాయనుకున్న ఈ కమిటీలే ఇప్పుడు కుమ్ములాటకు తెరలేపాయి. 

ఎన్నిక‌ల ప్రచార క‌మిటికి భట్టి విక్రమార్కను నియమించడంపై ఆగర్హం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వి హ‌నుమంతరావు. పార్టీలో కోవర్టులున్నారంటూ బహిరంగంగా విమర్శలు చేశారు. తనకు ప్రచాట కమిటీ పదవి దక్కకుండా చేశారంటూ మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వడంపై పొంగులేటి రుసరుసలాడారు. కొత్తగా వచ్చిన రేవంత్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఒకేమాటపై ఉండే కోమటిరెడ్డి బ్రదర్స్‌.. ఈ సారి మాత్రం చెరో మాటా మాట్లాడారు. కమిటీలో తనకు స్థానం కల్పించనందుకు అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాజగోపాలరెడ్డి. కుంతియాను శకునితో పోల్చారు. బ్రోకర్లు, పైరవీకార్లకే కమిటీల్లో పదవులు దక్కాయంటూ మండిపడ్డారు.

అయితే మేనిఫెస్టో కమిటీలో వైస్‌ ఛైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీలో ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రజా మేనిఫెస్టోను తయారు చేస్తామంటూ ప్రకటించారు. ఢిల్లీలో ఇటీవలే తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అయిన రాహుల్.. బహిరంగంగా ఎవరూ విమర్శలు చేసుకోవద్దంటూ ఆదేశించారు. అప్పుడు సరేనంటూ తల ఊపిన నేతలు.. ఇప్పుడు ఇలా పార్టీపైనే తిరగబడడం కలకలం రేపుతోంది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తిని రేపుతోంది. 

18:07 - August 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ గూబ గుయ్యిమనేటట్లు ప్రజలు తీర్పునిస్తారని, నల్గొండ జిల్లాలో 12 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, మరి కాంగ్రెస్ ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల పదవులు..ఆస్తులు..పాపాలు పెరిగాయో..అలానే ఫ్లోరైడ్ భూతం పెరిగిందని అభివర్ణించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఏం చేశారని, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పై ఏనాడు కృషి చేయలేదన్నారు. ఒక్క పైసా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొంటే జానా, ఉత్తమ్ లు ముసిముసి నవ్వులు నవ్వారని, ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఫ్లోరైడ్ భూతాన్ని పారదాలుతోమని, నాలుగేళ్లలో ఎన్నో పనులు చేసిన కేసీఆర్ దించేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

08:43 - August 22, 2018

నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత రామచంద్రమూర్తి, బీజేపీ నేత ఎస్.కుమార్, టీఆర్ ఎస్ నేత పీఎల్ శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వమే తెరతీసిందన్నారు. కేరళకు ఆర్ధికసాయంపై రాజకీయాలు చేయడం తగదని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:57 - August 3, 2018

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీపీసీసీ సంప్రదింపుల కమిటీ భేటీ అయింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ్మ, డీ.అరుణ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. పార్టీలో చేరికలపై చర్చించనున్నారు.వీరిని తీసుకుంటే పార్టీకి వచ్చే లాభాలేంటీ? తీసుకోకపోతే పార్టీకి వచ్చే నష్టాలేంటి? అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చేర్చుకోవడానికి పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

16:42 - June 14, 2018

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీతో మాట్లాడి ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదం సాధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. లేకపోతే ఢిల్లీ నుంచి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతిపాదిత బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్రం వెనక్క తగ్గడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధాని మోదీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారేమోన్న అనుమాన్ని పొంగులేటి వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana congress