telangana election

11:14 - September 19, 2018

తనకిష్టం లేని వ్యక్తిని...తన కులం కాని వాడిని..ప్రేమించి..పెళ్లి చేసుకుందని..పరువు తీసిందని భావించిన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య అందరినీ కలిచివేసింది. తన కూతురు గర్భవతి అని తెలిసినా తండ్రి మారుతీరావు ఈ దారుణ హత్యకు పథకం పన్నాడు. హత్య చేసిన వారిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అమృతకు పలువురు నేతలు, ప్రజా సంఘాలు పరామర్శించి సానుభూతిని తెలియచేశారు. కానీ అమృతను అసెంబ్లీకి పంపిద్దామని...సామాజిక న్యాయం బతికేందుకు అందరూ మద్దతు పలకాలని బీఎల్ఎఫ్ కన్వీనర్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపునిచ్చారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు. మంగళవారం అమృతను, ప్రణయ్ కుటుంబ సభ్యులను తమ్మినేని, ఇతర నేతలు పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడుతామని అమృత చెప్పిన వ్యాఖ్యలు యావత్‌ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉందన్నారు. కడుపులోనున్న బిడ్డను ప్రణయ్ ప్రతిరూపంగా చూసుకొని జీవితాంతం కుల రహిత సమాజం కోసం పోరాడుతానని చెప్పిందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో అమృతను అసెంబ్లీకి పంపిస్తే సమాజానికి ఎంతో ఉపయోగం జరుగుతుందని, దీనికి బీఎల్‌ఎఫ్‌, సీపీఐ(ఎం) పూర్తిగా మద్దతిస్తున్నదని..మిగతా పార్టీలూ మద్దతిచ్చి ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అన్నారు. మరి ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

07:06 - September 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎం మిషన్లు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు... ప్రక్రియను కేంద్ర ఎన్నిక కమిషన్‌ వేగవంతం చేసింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 32 వేల 574 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాల పరిశీలనకు ఏర్పాట్లు  చేశామన్నారు. ఓటర్ లిస్ట్‌లతో పోలింగ్ బూత్‌ల వారిగా విభజన జరుగుతోందన్న ఆయన... ఓటర్ జాబితాలోని అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

11:36 - September 14, 2018

హైదరాబాద్ : కాషాయం దళం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పక్కా ప్రణాళిక, వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా అడుగు పెట్టనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఎలా ప్రచారం నిర్వహించాలి ? తదితర వివరాలను ఆయన నేతలకు దిశా..నిర్దేశం చేయనున్నారు. 

మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను...రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని షా నిర్దశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను ఆకర్షించడం...బీజేపీపై అభిమానం ఉన్న వారిని పార్టీలోకి చేరిపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే వారిపై పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు, వారికి టికెట్ కేటాయించనున్నటు్ల సమాచారం. మరి షా పర్యటన తెలంగాణలో బీజేపీ నేతలకు బూస్ట్ ఇస్తుందా లేదా ? అనేది చూడాలి. 

16:35 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలపై జనసేనానీ 'పవన్ కళ్యాణ్' దృష్టి సారించారు. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహార కమిటీతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను పవన్ కు సభ్యులు వివరించారు. తదుపరి చర్చలు పవన్ తో జరపాలని సీపీఎం సభ్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. దీనితో చర్చలకు పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా పవన్ సూచించారు. మంగళ, బుధ వారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 

07:57 - May 7, 2016

హైదరాబాద్ : కొన్ని రోజుల్లో పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక బరిలో సీపీఎం ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ సందర్బంగా ఈ అంశంపై 10టీవీ నిర్వహించిన చర్చా వేదికలో పోతినేని సుదర్శన్ (సీపీఎం అభ్యర్థి) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) బెల్లం నాయక్ (కాంగ్రెస్ ) పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - telangana election