Telangana government Welfare schemes

20:43 - February 11, 2018

ప్రొ.కోదండరాం...తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు. టీజేఏసీగా ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో గులాబీ దళం ఎదురుదాడికి దిగుతోంది. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...కోదండరాం మధ్య రహస్య ఒప్పందం జరిగిందా ? అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..ఇతరత్రా వాటిపై టెన్ టివి 'వన్ టు వన్' కోదండరాంతో ముచ్చటించింది. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

15:17 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలు మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. మండలిలో 11, 6 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:33 - November 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో పది జిల్లా పరిషత్ లు కొనసాగుతున్నాయని, హైదరాబాద్ మినహా 30 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చట్టాల్లో ఉన్న లొసుగుల ఆధారంగా కోర్టులకు వెళుతున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని..కొత్త పంచాయతీ రాజ్ చట్టం..కొత్త మున్సిపాల్టీ చట్టాల రూపకల్పన విషయంలో సభ్యులు అనుభవాలు..క్షుణ్ణంగా అధ్యయనం చేసి సూచనలు.. ఇవ్వాలని సూచించారు. దీనిపై ఇప్పుడు వేసిన కమిటీ వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తోందని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీ మీటింగ్ లో ప్రధానితో ఈ అంశంపై మాట్లాడడం జరిగిందని, తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. దేశ..రాష్ట్రాల బడ్జెట్ రూ. 38 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతోందని కానీ స్థానిక సంస్థలు పనిచేయకపోతే దేశం వికాసం చెందదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. అధికారం..విధులు..డబ్బులు..ఇవ్వాల్సి ఉంటుందని..అందుకే పంచాయతీ రాజ్, మున్సిపాల్టీ చట్టంలో అధికారాలు..విధులు కల్పిస్తామన్నారు. 

14:28 - November 17, 2017

హైదరాబాద్ : తనపై సీఎం కేసీఆర్..కు అందరికీ ఎందుకంత కోపం ఉంటదని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ సభలో ప్రశ్నించారు. జిల్లాల విభజన అంశంపై శుక్రవారం టి. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవాంతరాలు అధిగమించే విధంగా డీ లిమిటైజేషన్ ఉండాలని సూచించారు. కుల్వకుర్తి నియోజవకర్గం మూడు డివిజన్ లలో ఉందని..ఒక సమస్యను పరిష్కరించాల్సి వస్తే ముగ్గురు ఆర్డీవో లతో మాట్లాడాల్సి వస్తోందని..ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు చెబితే తాము ప్రిపేర్ అవుతుండే వారమన్నారు. 

20:19 - November 10, 2017

హైదరాబాద్ : రేషన్‌ షాపుల ద్వారా పేదలకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. బియ్య పంపిణీని రద్దుచేసి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారాన్ని  మంత్రి హరీశ్‌రావు తోసిపుచ్చారు.  నాగార్జునసాగర్‌ ఎడవ కాల్వ కింది ఖమ్మం, నల్గొండ జిల్లాలోని ఆరు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తామని హరీశ్‌రావు సభలో ప్రకటించారు.
వివిధ అంశాలపై నిరసనలు 
తెలంగాణ అసెంబ్లీలో వివిధ అంశాలపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వివిధ పక్షాల సభ్యులు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించారు. రేషన్‌ షాపులను రద్దుచేసి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. దీంతో విపక్ష కాంగ్రెస్‌, అధికార టీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్యవాగ్వాదం జరిగింది. 
వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్ 
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో  రెండో పంటకు సాగునీరు అందించే అంశంపై టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. అయితే ఈ అంశంపై హరీశ్‌ స్పందిస్తూ సాగర్‌ ఎడవ కాల్వతోపాటు సింగూరు ఆయకట్టుకు రెండో పంటకు నీరు ఇస్తామని సభ దృష్టికి తెచ్చారు. భద్రాచలం, ఉట్నూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల ప్రాజెక్టు అధికారులుగా ఐఏఎస్‌లను నియమించే అంశాన్ని చర్చించాలన్న  డిమాండ్‌తో... సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. దీంతో రాజయ్య నిరసన వ్యక్తం చేశారు. 
అసెంబ్లీ సోమవారానికి వాయిదా  
వాయిదా తీర్మానాల ప్రతిపాదన, జీరో అవర్‌ తర్వాత స్పీకర్‌ మధుసూదనాచారి కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అసెంబ్లీ పునఃప్రారంభమైన తర్వాత రైతుల సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రారంభమైన చర్చలో అధికార పక్ష సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అసంపూర్తిగా జరిగిన ఈ చర్చను సోమవారం కొనసాగిస్తామని సభాధ్యక్షస్థానంలో ఉన్న ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు అనంతరం.. అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. 

 

18:38 - November 10, 2017

హైదరాబాద్ : రేషన్‌ షాపుల ద్వారా పేదలకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. బియ్య పంపిణీని రద్దు చేసి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారాన్ని  మంత్రి హరీశ్‌రావు తోసిపుచ్చారు. రూపాయికి కిలో బియ్యం పథకం యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. చౌక బియ్యం స్థానంలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టే యోచన లేదని హరీశ్‌ స్పష్టం చేశరు. 
 

 

18:32 - November 10, 2017

హైదరాబాద్ : ఆహార భద్రత పథకాన్ని టీఆర్‌ఎస్‌ నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆహార భద్రతపై తామిచ్చిన తీర్మానంపై ప్రొటెస్ట్‌ చేసేందుకు స్పీకర్‌ అనుమతిచ్చినా... మంత్రి హరీష్‌రావు అడ్డుకోవడం దారుణమన్నారు. 

 

10:11 - July 13, 2017

అధికార పక్షం..విపక్షం..పాలనలో ఈ రెండూ ఉంటాయి. మంచి జరిగితే మంచి అని..ఆ మంచి పనుల్లో చెడు ఉంటే ఇదిగో ఇది చెడు అని విపక్షాలు చూపుతుంటాయి. చెడు జరిగితే సరిదిద్దుకుంటామని అధికార పక్షం చెప్పడం..కాదు మంచే జరిగింది..ఇలా అని చెప్పడం అధికార పక్షం చేసే పని. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలపై సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది ? విపక్షాలు చేస్తున్న ఆరోపణలు..విమర్శలపై అధికార పక్షం ఎదురు దాడికి దిగుతోంది.

హరితహారం కార్యక్రమంలో...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత హరిత హారం కార్యక్రమంలో పాల్గొని విపక్షాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. గొర్రెల పంపిణీ పథకంలో విపక్షాలు చేసిన విమర్శలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో విపక్షాలు లేకుండా చేయాలని అధికారపక్షం ప్రయత్నిస్తోందని..అందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నం చేయడం వంటివి చేస్తున్నాయని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బహిరంగంగానే విమర్శలు వినిపించాయి. ముసలి గొర్రెలు ఇస్తున్నారంటూ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన వార్తలై వైరల్ అయ్యాయి. గొర్రెల పంపిణీ కోసం ఇంకా సర్వేలతోనే ప్రభుత్వం జాప్యం చేస్తోందని, 80లక్షల గొర్రెలు ఎక్కడ ఉన్నాయని సీపీఎం ప్రశ్నించింది. కానీ ప్రశ్నించినా..విమర్శించినా ప్రభుత్వం తట్టుకోవడం లేదని..విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇతర నేతలతో ప్రతివిమర్శలు చేయిస్తోందని విపక్ష నేతలు పేర్కొంటున్నారు.

విమర్శలకు సమాధానం ఏదీ ?
రాష్ట్రంలో అభివృద్ధి కావాలని ప్రతొక్కరూ కొరుకొనేదే. కానీ ఆ అభివృద్ది మాటున జరుగుతున్న మోసాలు..అక్రమాలు..అవినీతిపై విపక్షాలు ప్రశ్నిస్తాయి. కానీ ప్రశ్నిస్తున్నాయని..విమర్శలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగడం కరెక్టు కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిషన్ కాకతీయ..మిషన్ భగీరథ..భూముల సేకరణ..ధర్నా చౌక్..పోడు భూములు..తదితర విషయాలపై విపక్షాలు గళమెత్తాయి. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాయి. కానీ వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి స్వయంగా గులాబీ బాస్..లేదా ఇతర నేతలతో విపక్ష పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు..అవినీతి..ఇతర అంశాలపై బహిరంగంగా చర్చకు సిద్ధమని పోరాటంలో ముందు వరుసలో ఉండే సీపీఎం సవాల్ కూడా విసిరిన సంగతి తెలిసిందే. సవాల్ ను ప్రభుత్వం..గులాబీ నేతలు స్వీకరించలేదనేది తెలిసిందే.
ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోందని..అందుకే గులాబీ పార్టీలో కలవరం మొదలైందని..కానీ ఇవేమీ లేనట్టు...విపక్షాలను టార్గెట్ చేస్తూ కలరింగ్ ఇస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి...

13:31 - May 19, 2017
21:49 - April 30, 2017

ఖమ్మం : మిర్చి మార్కెట్‌ యార్డు ధ్వంసం ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమందిని పోలీసులు  ఇవాళ  అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో వారికి  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మరిన్ని విరాలను వీడియో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - Telangana government Welfare schemes