telangana movement

13:04 - March 10, 2018

హైదరాబాద్ : మిలియన్‌ మార్చ్‌ స్పూర్తి సభ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ రోడ్‌ బస్టాప్‌ వద్ద ఆస్పత్రికి వెళుతోన్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నేతలు పోలీసులతో వారించారు. దీంతో వారిని పోలీసులు ఆటోలో పంపించారు. 

12:30 - March 10, 2018
11:57 - March 10, 2018

హైదరాబాద్ : కాసేపట్లో ట్యాంక్‌బండ్‌పై టీ-జేఏసీ మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి ప్రారంభం కానుంది. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజాసంఘాలు, విద్యార్ధులు తరలివస్తున్నారు. అయితే... మిలియన్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పలువురిని అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరైనా ట్యాంక్‌బండ్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కోదండరామ్‌ జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహిస్తామని జేఏసీ నేతలంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం : కోదండరాం
ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు కోదండరామ్‌. పోలీసులు అత్యుత్సాహంగా మిలియన్‌ మార్చ్‌కు తరలి వచ్చే వారిని అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. తాము ట్యాంక్‌బండ్‌కు బయల్దేరుతామని... పోలీసులు అరెస్ట్‌ చేసినా లెక్కచేయమన్నారు కోదండరామ్‌. 

08:15 - March 10, 2018

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. శనివారం మిలియన్ మార్చ్ స్పూర్తిని గుర్తుకు తెచ్చుకొనే విధంగా ఆట..పాట.. నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించడం..దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనితో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. కోదండరాంను ముందస్తు అరెస్టు చేస్తారంటూ పుకార్లు షికారు చేశాయి. ట్యాంక్ బండ్ వద్ధ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా టెన్ టివితో కోదండరాం మాట్లాడారు. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇది ఒక్క జేఏసీ కార్యక్రమం కాదన్నారు. ..ఎంతో మంది..ప్రజా సంఘాలు..విద్యార్థి సంఘాలు సమిష్టిగా ఇందులో పాల్గొంటున్నాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:27 - March 1, 2018

హైదరాబాద్ : పార్టీ జెండా..ఏజెండా ఖరారు కాక ముందే.. వెన్నుద‌న్నుగా నిలిచే వారి కోసం టి.జె.ఏ.సి ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమానికి స‌హ‌క‌రించిన ఎన్ ఆర్.ఐల‌ను మ‌రొసారి త‌న‌వైపుకు తిప్పుకునేందుకు జాక్ చైర్మన్ అడుగులు వేస్తున్నారు.ఆయ‌న ఏర్పాటు చేయ‌బోయే పార్టీకి ఇంటా బ‌య‌ట మ‌ద్దతు కూడ‌గ‌ట్టెప్రయ‌త్నం చేస్తున్నారు. కోదండ‌రామ్ అమెరికా ప‌ర్యట‌న హ‌ట్ టాపిక్ గా మారింది.

వారం రోజుల క్రితం స‌తీమ‌ణితో క‌లిసి కొదండ‌రామ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే ఇది కేవలం కోదండరామ్‌ వ్యక్తిగత పర్యటన మాత్రమేనని టీజేఏసీ వర్గీయులు చెబుతున్నా... రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం, మార్చి రెండో వారంలో పార్టీని ప్రారంభించబోతున్న క్రమంలో.. కోదండరాం అమెరికాకు వెళ్లడం రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కించింది. పార్టీని ప్రారంభించబోతున్న రోజే పార్టీ పేరును, గుర్తును, విధివిధానాలను కోదండరామ్ ప్రకటించబోతున్నారు.ఓ వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పొషించి ..తెలంగాణ వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను అందరిని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో వైపు ప్రపంచ నలుదిక్కుల్లో ఉన్న తెలంగాణ వాదులను సైతం ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం ప్రోపెసర్ కొదండరామ్ చేపట్టారు.

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏక తాటిపైకి తెవ‌డంలో కొదండ‌రామ్ ప్రముఖ పాత్ర పొషించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో అమెరికా..ఇత‌ర దేశాల్లో ఉండే ఎన్ .ఆర్ .ఏలు స్వయంగా మ‌ద్దతు ప‌లికారు.టిజాక్ కు తెర వెనుక,ముందు అన్ని విధానాలు స‌హ‌కరాలు అందించారు.తెలంగాణ రాష్ట్రం సిద్దించినా ఇంకా తెలంగాణ యువ‌త ఆంకాక్షలు కా నేర‌వేర‌క పొవ‌డం వంటి అంశాల‌ను ప‌లుమార్లు ఎన్.ఆర్.ఐలు కొదండ‌రామ్ దృష్టికి తీసుకోచ్చారు.అధికార టి.ఆర్.య‌స్ పార్టీని ఎదుర్కోవలంటే.ఒక్క కొదండ‌రామ్ సార్ వ‌ల్లే అవుతుంద‌ని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇపుడు టీజాక్‌ పార్టీ ఏర్పాటు వెనుక వారి సహకారం చాలా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నేతలు, అధికారపార్టీలోని కొంతమంది అసంతృప్త నేతలు కోదండరామ్‌కు టచ్‌లో ఉన్నట్టు తెలిస్తోంది. కోదండరామ్‌ అమెరికాకు వెళ్లడానికి ముందు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 200 మందితో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశారు.వంద మంది టీజేఏసీకి చెందిన వారు కాగా, మరో వందమంది బయటవారిని తీసుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కోదండరామ్‌ వారందరితో సన్నాహాక మీటింగ్‌ను ఏర్పాటు చేయ‌బోతున్నాట్లు తెల‌స్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గులాబీపార్టీకి ఎర్త్‌పెట్టేందుకు కోదండరాం సారు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 

08:09 - February 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగా రాజకీయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ.... కనుమరుగు కానుంది. టీజేఏసీ నూతన పార్టీగా ఆవిర్భవించబోతోంది. ఇందుకోసం తెరవెనుక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులను టీజేఏసీ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. సాధారణంగా పార్టీ ఏర్పాట్లను.. ఎవరైతే పార్టీ పెడతారే వారే నేరుగా చేసుకుంటారు. కానీ టీజేఏసీ మాత్రం .. పార్టీ పనులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. కోదండరామ్‌ నేరుగా పార్టీ ఏర్పాటు పనుల్లో నిమగ్నం అయితే.. అటు అధికార పార్టీ నుంచి.. జాతీయ స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానంతో.. కోదండరామ్‌ అండ్‌ టీమ్‌ పార్టీ ఏర్పాటు పనులను ఏజెన్సీకి అప్పగించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటేషన్‌ పనుల కోసం ఏజెన్సీ ఇప్పటికే పలుమార్లు కోదండరామ్‌ సలహాలు , సూచనలతో ఢిల్లీకి వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి కోదండరామ్‌తో కలిసి మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. కోదండరాం ఏర్పాటు చేయనున్న పార్టీ గుర్తు, జెండాను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ పనులను ప్రైవేట్‌ ఏజెన్సీకి
పార్టీ పనులను ప్రైవేట్‌ ఏజెన్సీ చూసుకుంటుంటే.. కార్యాలయం కోసం టీజేఏసీ నేతలు అన్వేషిస్తున్నారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక భాగాన్ని టీజేఏసీ ఇప్పటికే ఉపయోగించుకుంటోంది. ఈ క్వార్టర్స్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు పనులను నేరుగా కోదండరామ్‌ ఇంట్లోనే నిర్వహించడం సాధ్యంకాకపోవడంతో ఈ క్వార్టర్‌ను ఉపయోగించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ ఏర్పాటు, స్టీరింగ్‌ కమిటీ సమావేశాలు ఇతర పనుల ఏర్పాట్లు సైతం ఈ క్వార్టర్స్‌ నుండే జరుగుతున్నాయి. కోదండరామ్‌ పార్టీ ఏర్పాటు పనులు చక్కబెడుతూనే మరోవైపు ఆవిర్భావ సభకు జాతీయ స్థాయిలో నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో వరంగల్‌లో నిర్వహించే సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను టీజేఏసీలోని కీలక నేతలు అప్పగించారు. మొత్తానికి కోదండరామ్‌ పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

18:33 - February 19, 2018

హైదరాబాద్ :  ప్రతి మనిషికి ఒకే విలువ దక్కినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. హైదరాబాద్‌లో తెలంగాణ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్‌ సామాజిక న్యాయం కోసం అందరం కలిసి సంఘటితంగా ప్రయత్నం చేయాలన్నారు. 

06:55 - January 21, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై టీమాస్ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హామీల అమలు కోసం ఈనెల 22న కలెక్టరేట్ల ముట్టడి చేపడుతున్నట్టు టీమాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ తెలిపారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇళ్లులేని కుటుంబాలు 20 లక్షలకుపైగా ఉంటే... కేవలం 4462 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లే ఇప్పటి వరకు కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజాగాయకుడు, టీమాస్‌ నేత గద్దర్‌తో కలిసి వెస్లీ మాట్లాడారు. కవులు, కళాకారులతో సాంస్కృతిక ఉద్యమం చేపట్టనున్నట్టు గద్దర్ తెలిపారు. 

21:38 - January 9, 2018

శాతావాహన యూనివర్శిటీలో తెంగాణ ఉద్యమం నుంచి పోరాటం చేస్తుందని, అనేక మంది పోరాటలకు తను అండగా నిలుచున్ననాని, ఆ రోజు ఆర్ఎస్ఎస్ వారు భారత్ ఎందుకు తీసుకొచ్చారని, మనస్తృతిని దహనం చేసుటప్పడు తను అక్కడ లేనని ప్రొ. సూరపల్లి సుజాత అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

20:57 - December 13, 2017

పాట కదిలిస్తుంది.. పరుగులు పెట్టిస్తుంది.. ప్రవహించేలా చేస్తుంది...భాషలో మాటకెంత ప్రాధాన్యం ఉందో.. పాటకు అంతకంటే ఎక్కువే ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు గడ్డపై జరిగిన అనేకానేక ఉద్యమాల్లో ప్రజల కోసం గొంతెత్తిన పాట సాధించిన విజయం అసామాన్యం. అది తెలంగాణ సాయుధ పోరాటమైనా, విప్లవోద్యమమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా ఏ సందర్భంలో అయినా తెలుగు పాట దగద్ధగమంటూ వెలిగింది. ఉద్యమ స్ఫూర్తిని రెప రెపలాడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాటకు మనిషికి ఉన్నంత చరిత్ర ఉంది. అందులో తెలుగు ప్రజాపాటది త్యాగపూరితమైన చరిత్ర. వీరోచితమైన చరిత్ర.. అందుకే పాటకు సలాం...చెప్తూ.. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు పోరాట పాటపై ప్రత్యేక కథనం.. తిరుగుబాటు చేయనిదే మార్పు రాదు.. పాలకులతో కొట్లాడందే మార్పు రాదు. మరి ఆ ఉద్యమాలను వెలిగించటానికి నాయకత్వం ఒక్కటే సరిపోదు.. దారి చూపే కళా రూపాలు కావాలి. దానికి పాటను మించింది మరొకటి లేదు. అందుకే తెలుగు ప్రజల ఉద్యమ పాటల చరిత్ర ఎంతో ఘనమైనది..

పోరాటం ఉదయించాలంటే పాట కావాలి..ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నిండాలంటే పాట కావాలి..సమాజాన్ని ఏక తాటిపై నిలబెట్టి ఒకే దిశలో పరిగెత్తించాలంటే పాటను మించిన సాధనం మరొకటి ఉంటుందా? అందుకే తెలుగు నేలపై జరిగిన ప్రతి ఉద్యమంలో పాట ప్రధాన భాగం.. మోగే డప్పు, చిర్రా చిటికెన పుల్లా....ఆకాశాన్ని సవాల్ చేసే స్వరం.. ఇంత కంటే ఉద్యమాన్ని వెలిగించటానికి మరే ఆయుధమైనా బలాదూరే.. తీయనైన తెలుగు భాషలో ఎన్నో సృజన స్వరూపాలు.. కథ, నవల, కవిత ఇలా ఎన్నున్నా.. పాటకున్న ప్రాధాన్యత అంతులేనిది. అందుకే తెలుగు గడ్డమీద పాటలేని ఉద్యమాన్ని, పాట వినిపించని పోరాటాన్ని ఊహించలేం. ప్రతి ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలబడింది.. అవును పాటకు సలాం.. పెను నిద్దుర వదిలించిన పాటకు సలాం.. పాలకులను ప్రశ్నించిన పాటకు సలాం.. ఉద్యమ పతాకను రెపరెపలాండించిన పాటకు సలాం.. తెలుగు పాటకు సలాం. తెలుగు భాషకు సలాం..  

Pages

Don't Miss

Subscribe to RSS - telangana movement