telangana police

06:35 - May 13, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీ చాంద్రాయణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గౌస్‌ నగర్‌, ఇంద్రనగర్‌ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో ఇంటింటికీ వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 41 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఫింగర్‌ ప్రింట్‌ఆధారంగా 30 మంది అనుమానుతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు.. గాజుల పరిశ్రమ యజమానిపై 370, 371 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. రసాయనాలతో అల్లంవెల్లుల్లి తయారు చేస్తునన గోదాంపై దాడిచేసి రెండు క్వింటాళ్ళ నకిలీ అల్లంపేస్టుని సీజ్‌ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న నాలుగుక్వింటాళ్ళ రేషన్ బియ్యం, ఆటో సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సౌత్‌జోన్‌ డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. 

17:40 - May 4, 2018

నాగర్‌కర్నూల్ : రెండు మతాల మధ్య వివాదంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలపై కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో మార్చి 27న జరిగిన ఒక సంఘటన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది. దీనిపై సీఐ, ఎస్‌ఐ మితిమీరి ప్రవర్తించారని, బెయిల్‌ విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులకు, హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంపై సమగ్రంగా విచారించిన ఉన్నతాధికారులు, సీఐ శ్రీనివాసరావును, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.  

07:45 - April 25, 2018

నల్గొండ : జిల్లా మిర్యాలగూడ టూటౌన్‌ పీఎస్‌లో సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌పై కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ అనేక ఆరోపణలు చేశారు. తాను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఇసుక, కిరోసిన్‌ తరలింపును అడ్డుకున్నందుకు సీఐ కక్ష కట్టారని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సీఐకి చెందిన నెలవారీ మమూళ్లు అడ్డుకున్నందుకే తనపై కక్ష కట్టారని... డ్యూటీకి వచ్చినా ఆబ్సెంట్‌ వేసి వేధిస్తున్నారని రాజ్‌కుమార్‌ అంటున్నాడు. వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ రాజ్‌కుమార్‌ సేకరించాడు. అయితే కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ సాయి ఈశ్వర్‌ అన్నారు. ఎక్కడా మామూళ్లు తీసుకోవడం లేదని... అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు సీఐ ఈశ్వర్‌గౌడ్‌పై ఎస్పీ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. తన దగ్గరికి పిలిపించుకుని క్లాస్‌ పీకినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 

09:54 - April 21, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 36 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 22 ద్విచక్ర వాహనాలు, 16 కార్లను సీజ్ చేశారు.

 

20:46 - April 16, 2018

హైదరాబాద్ : మక్కామసీదు కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపారు. 

 

19:11 - April 16, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాల సుధీర్ఘ విచారణ తర్వాత మక్కా మజీద్ బాంబుపేలుళ్ల కేసులో నిందితులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఎన్ఐఏ సరైన ఆధారాలు చూపించక పోవడంవల్లే నిందితులను కోర్డు నిర్ధోషులగా ప్రకటించిందంటున్న సీనియర్ న్యాయవాది అమర్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:55 - April 16, 2018

హైదరాబాద్‌ : మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టినవేసిన నేపథ్యంలో పాతబస్తీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాతబస్తీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటున్న దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:03 - April 10, 2018

హైదరాబాద్ : ఈనెల 5న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌- ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దయాచారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దయాచారి తమ్ముని చెల్లెలు మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్‌తో ఆస్తి-భూ తగాధాలే ఈ హత్యాయత్నానికి కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు మంజుల, కరుణాకర్‌ విజయవాడకు చెందిన సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా 15 వేల రూపాయలు ఇచ్చి హత్యకు స్కెచ్‌ వేశారని పోలీసులు చెప్పారు. సుపారీ గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని... మరో ఇద్దరికోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

 

18:20 - March 12, 2018
11:49 - March 9, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - telangana police