Telangana Polls

15:04 - December 7, 2018

నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్న అతడు గుండెపోటుతో అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడిని నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహగా గుర్తించారు. గుండ్రాంపల్లి గ్రామంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చాడు. క్యూలో నిల్చుని వేచి ఉండగా గుండెపోటు వచ్చి పడిపోయాడు.

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

15:33 - December 6, 2018

రంగారెడ్డి: ఎన్నికల వేళ అధికారులు జరుపుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో నోట్ల కలకలం చెలరేగింది. ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ ఇంట్లో రూ.5.78లక్షలు నగదు లభ్యమైంది. సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. ఈ డబ్బు బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి అనుచరులదిగా పోలీసులు గుర్తించారు.
పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలుంది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకి రేటు కడుతున్నారు. మరోవైపు ప్రలోభాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు నిఘా పెంచారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

08:34 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తి కాబోతోంది..కొద్దిగంటల్లో (డిసెంబర్ 5) సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటరు..ఇప్పుడు..నేతలకు కీలకంగా మారిపోయాడు. వీరిని ఆకట్టుకొనేందుకు నేతలు చెమటోడుస్తున్నారు. అతడిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నగదు..మద్యం ఎరవేసి ఓటును కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. నగదు..మద్యం..చీరలు..క్రికెట్ కిట్..టీషర్ట్స్..ఇలా ఇతరత్రా వస్తువులను పంపిణీ చేస్తున్నారు. కులాల సంఘాలకు పెద్దఎత్తున్న ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రసన్నం చేస్తున్నారు. వారి వారి సంఘాలకు విందులిస్తూ ఓటు తమకే వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
ఓటర్లకు ఆఫర్లు...
వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా గోడ..చేతి గడియాలు పంపిణీ చేసినట్లు టాక్. యువజన సంఘాలకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. బొట్టు పెట్టి మరి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుల నిఘా పెరగడంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గలను అన్వేషిస్తున్నారు. పైపుల్లో నోట్ల కట్టలను కూర్చి ఆటోలో తరలిస్తుండగా సోమవారం మంచిర్యాలలో పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం..ప్రలోభాల పరంపర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా వేములవాడలో క్రికెట్లు కిట్లు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో మండలానికి దాదాపు రూ. అరకోటి నగదును తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసీ ప్రత్యేక దృష్టిని కనబరిచి..ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు కృషి చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తనిఖీలు నిర్వహించి నగదు..మద్యం..ఇతరత్రా స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల నగదు సీజ్ చేసిన 

20:36 - November 11, 2018

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని తాను కోరుకుంటున్నానని మోహన్‌బాబు చెప్పారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో ఆలయ సిబ్బందికి ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్‌బాబు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును.. తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నానని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. 
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలపై మంచు కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మోహన్‌బాబు టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోవడం ఆసక్తికరంగా మారింది.

Don't Miss

Subscribe to RSS - Telangana Polls