telugu latest movies

14:55 - April 7, 2018

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖుల బయోపిక్ లతో వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా 'యాత్ర' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాజశేఖర్ ను మరిపించేలా వున్న ప్రముఖ నటుడు ముమ్ముట్టి పోస్టర్ రిలీజ్ అయ్యింది..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' ..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్ లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్ లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. ' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి అన్ని బయోపిక్స్ లా యాత్ర సినీ అభిమానులను అలరిస్తుందా? లేదా అనే అంశాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

19:11 - March 23, 2018

ఈ మధ్య హీరోగా కొంత గ్యాప్ ఇచ్చి ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన కళ్యాణ్ రామ్ మళ్లీ m.L.A అనే కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాజల్ హీరోయిన్ గా నటించడం, టీజర్, ట్రైలర్స్ లో కామెడీ టచ్ కనిపించడం, సినిమా అంతగా భారీతనం ఉందని కన్వే అవ్వడంతో ఈసినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్ కు ముందే ఇలా అంచనాలు పెంచేసిన m.L.A కి ఆడియన్స్ యునానిమస్ హిట్ ని కట్టబెట్టారా..? లేదా ఓడించారా..? అసలు ప్రేక్షకుల తీర్పు ఏంటీ ?

కథ...
కథ విషయానికొస్తే.. m.L.A మంచి లక్షణాలున్న అబ్బాయిగా అందరి చేత పిలిపించుకునే గుడ్ బిహేవియర్ ఉన్న అబ్బాయి కళ్యాణ్ ఇందుని చూడగానే ఇష్టపడతాడు. అయితే ఆమె తన బాస్ కూతురని తెలిసినా కూడా ఆమెను లవ్ లోకి దింపడానికి తన ట్రయల్స్ ను కంటిన్యూ చేస్తుంటాడు. ఆ ట్రయల్స్ లో భాగంగా కంపెనీ సైట్ ను కబ్జా చేసిన మార్దాలిని కొట్టి సైట్ ని విడిపిస్తాడు. ఆ టైమ్ లో ఇందు అతని బాస్ కూతురు కాదని తెలుస్తుంది. మరి ఇందు ఎవరు..? బాస్ కూతురిగా ఎందుకు నటించింది..? ఆమె కథ విన్న కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు..? అసలు m.L.A టైటిల్ కి జస్టిఫికేషన్ లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటుల యాక్టింగ్...
నటీనటుల విషయానికొస్తే... చాలా కాలం తర్వాత హీరోగా కనిపించిన కళ్యాణ్ m.L.A క్యారెక్టరైజేషన్ కోసం మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా మారాడు. లుక్స్ పరంగా ఎనర్జీ పరంగా సూపర్ అనిపించుకున్న కళ్యాణ్ రామ్ కామెడీ టైమింగ్ పరంగా మాత్రం తన వీక్ నెస్ ని కవర్ చెయ్యలేకపోయాడు. డాన్స్ పరంగా అలరించడానికి ట్రై చేశాడు. ఇక ఒక సగటు సినిమాలో హీరోయిన్ ఎలా బిహేవ్ చేస్తుందో... అదే లైన్ ని ఫాలో అయ్యింది కాజల్. తన యాక్టింగ్ స్కిల్స్ కి టెస్ట్ పెట్టేంత సీన్స్ ఈ సినిమాలో లేవు. గ్లామర్ పరంగా కాస్త కో ఆపరేట్ చేసింది. ఇక విలన్స్ గా రవి కిషన్, అజయ్ లుక్స్ తో, డైలాగ్స్ తో ఎఫెక్టివ్ నెస్ తీసుకురాగలిగారు. ఇక పోసాని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పృద్వి, ప్రభాస్ శ్రీను ఇలా టాప్ అరడజను మంది కమెడియన్స్ తమ శక్తిమేర కామెడీ పండించి m.L.A కి సపోర్ట్ అందించారు. లాస్యకి లెన్తీ రోల్ దక్కలేదు. మిగతా నటీనటులందరూ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే.. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాదవ్ ఎలాంటి రిస్క్ లేకుండా పక్కా ఫార్ములా సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఫస్ట్ సినిమానే అయినా.. విజువలేషన్ పరంగా మెచ్యూరిటీ చూపించాడు. అయితే కథలో కానీ, కథనంలో గానీ పెద్దగా మెరుపులు కనిపించలేదు. అలా అని ఇరిటేటింగ్ అవుట్ పుట్ కూడా లేదు. తన వరకూ తాను ఓ మోస్తరు మార్కులు వేయించుకున్నాడు ఉపేంద్ర మాధవ్. మణిశర్మ తన స్తాయికి తగ్గ సంగీతాన్ని అందించలేదు. ఆర్.ఆర్ కు మాత్రం న్యాయం చేశాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే మొదటి నుంచి ఇది కమర్షియల్ సబ్జెక్ట్ అంటూ హింట్స్ ఇచ్చిన టీమ్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ను అందించింది. కథా పరంగా వీక్ గా ఉన్న m.L.A కామెడీ పండడం వల్ల, ఫైట్స్ బావుండడం వల్ల, బీ, సీ సెంటర్స్ లో కాస్త్ స్ట్రాంగ్ గా నిలబడే చాన్సులున్నాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రం ఒక రెగ్యులర్ సినిమాగానే అనిపిస్తుంది.

ప్లస్...
స్టైలిష్ అవుట్ పుట్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు

మైనస్..
రొటీన్ కథా,కథనాలు
పెద్దగా పేలని కామెడీ
పాటలు

18:11 - February 2, 2018

హైదరాబాద్ : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ మూవీ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో వరుణ్‌ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో... వరుణ్‌ లవర్‌ బ్యాయ్‌గా నటిస్తున్నాడు.ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

19:26 - December 1, 2017

మొదట హిట్స్ మీద హిట్స్ కొట్టి తరువాత స్క్రిప్ట్స్ ఎంపికలో కన్ ఫ్యూజ్ అయిన సాయిధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకుని కమర్షియాలిటీ తో పాటు దేశభక్తి కూడా మిక్స్ చేస్తూ జవాన్ అనే సినిమా చేసాడు.రైటర్ BVS రవి డైరెక్షన్ లో ప్రెసెంట్ టైం లో లక్కీ గర్ల్ గా పేరుతెచ్చుకున్న మెహ్రీన్
హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ?

సినిమా కథ...
ఈ సినిమా కథ విషయానికి వస్తే.....చిన్నపటినుండి క్రమశిక్షణ అంటూ పెరిగిన జై.. DRDO లో జాబ్ సంపాదించడమే టార్గెట్ గా ఫిక్స్ అవుతాడు.చిన్నతనం నుండి వైల్డ్ నేచర్ అలవాటయిన కేశవ్ ఎలాగయినా ఎదగాలని అడ్డదాదారులు తొక్కి క్రిమినల్ గా మారతాడు.అయితే DRDO రూపొందించిన ఆక్టోపస్ అనే మిస్సైల్ లాంచర్ కోసం 5oo కోట్ల భారీ డీల్ ఒప్పుకుంటాడు కేశవ.అయితే ఆక్టోపస్ ని ఎవరో దొంగిలించబోతున్నారు అని తెలుసుకుని వాళ్ళ నుండి ఆక్టోపస్ ని రక్షించి DRDO లో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు జై.దాంతో జై పై పగబట్టి అతనితోనే ఆక్టోపస్ ని తెప్పించడానికి అతని ఫామిలీ ని టార్గెట్ చేస్తాడు కేశవ్. ఈ విషయం తెలుసుకున్న జై కేశవ నుండి ఎలా తన ఫ్యామిలీ ని రక్షించుకున్నాడు, ఆక్టోపస్ కేశవ్ కి దక్కకుండా ఎలా అడ్డుకున్నాడు అన్నది మిగతా కథ.

నటీ నటుల ప్రతిభ...
నటీనటుల విషయానికి వస్తే.... ఈ సినిమా విజయం తన కెరీర్ కి కీలకంగా మారడంతో లుక్ నుండి యాక్టింగ్ వరకు చాలా కేర్ తీసుకున్నాడు తేజు.చాలా స్టైలిష్ గా కనిపించిన తేజు నటనపరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.జై క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు.ఎమోషన్స్ పండించడంలో,డైలాగ్స్ చెప్పేటప్పడు డిక్షన్ లో గాని చాలా మెచ్యూరిటీ చూపించాడు.ఇక విలన్ గా తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కూడా స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అతనికి హేమ చంద్ర చెప్ప్పిన డబ్బింగ్ బాగా హెల్ప్ అయింది. ప్రసన్న రూపంలో టాలీవుడ్ కి మరో విలన్ దొరికాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేనంత గ్లామరస్ గా కనిపించింది. ముఖ్యంగా పాటల్లో ఆమె లుక్స్ యూత్ ని, మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు,ఉన్నంతలో కూడా ఆమె పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు. మిగతా నటీనటులంతా తమ పరిధిమేర పరవాలేదనిపించారు.

టెక్నిషీయన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.... మొదటి సినిమా వాంటెడ్ తో దారుణమయిన డిజాస్టర్ అందుకున్న BVS రవి ఈ సారి పేట్రియాటిక్ టచ్ తో ఉండే యాక్షన్ కథ రాసుకున్నాడు. అయితే సినిమాలో చాలా సన్ని వేశాలు మాత్రం రొటీన్ గా ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా చాలా లైటర్ గా ఉండడంతో అస్సలు ఫీల్ లేదు. హీరో, విలన్ లింక్ అప్, ఆక్టోపస్ సేవింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్స్ లో తన రైటర్ గా తన ప్రతిభ చూపించాడు రవి. క్లయిమాక్స్ కూడా బాగానే డీల్ చేసాడు. కానీ హడావిడిగా ముగించినట్టు అనిపించింది. పేట్రియాటిక్ టచ్ తో ఉండే డైలాగ్స్ బాగున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా ఎఫర్ట్ పెట్టి మ్యూజిక్ చేసాడు. పాటలు పరవాలేదనిపించేలా ఉన్నాయి. ఆర్.ఆర్ మాత్రం సీన్స్ ఎలివేషన్ లో బాగా ఉపయోగపడింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. గ్రాఫిక్స్ క్వాలిటీ వల్ల విజువల్స్ కి రిచ్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.... హీరో, విలన్ బ్రెయిన్ గేమ్ హైలైట్ గా తెరకెక్కిన జవాన్ అన్ని వర్గాలకు రీచ్ అయ్యే కంటెంట్ తో వచ్చింది. అయితే అక్కడక్కడా రొటీన్ టచెస్ ఉండడంవల్ల కొంచెం డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులు వేయించుకునే లక్షణాలున్న, ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోచూడాలి.

ప్లస్ పాయింట్స్:
సాయిధరమ్ తేజ్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫైట్స్,కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
కధలో రొటీన్ టచెస్
ఫార్ములా స్క్రీన్ ప్లే
వీక్ గా ఉన్న ఎమోషన్స్
నాటకీయత ఎక్కువైన బ్రెయిన్ గేమ్
రేటింగ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.....

21:02 - November 11, 2017

కొరియోగ్రాఫర్ భానుతో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన డ్యాన్స్ కెరీర్ గురించి వివరించారు. పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే  2004లో డ్యాన్సర్ అయ్యాను. రేయ్ సినిమాతో కొరియోగ్రాఫర్ అయ్యాను అని తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్  ప్రాంక్ కాల్ చేసి, ఆటపట్టించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:01 - November 10, 2017

'దొంగోడొచ్చాడు' సినిమా టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అమలాపాల్, హీరో ప్రసన్న, సింగర్ హేమచంద్ర పాల్గొని, మాట్లాడారు. ఈ సినిమా గురించి సంభాషించారు. తమ తమ సినిమా అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:38 - November 3, 2017

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా 'ఏంజిల్' సినిమా రూపొందింది. 'బాహుబలి' పళని దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమన్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి నాగ అన్వేష్..హెబ్బా పటేల్ సినిమాను వీక్షించారు. అనంతరం టెన్ టివితో వారు ముచ్చటించారు. చిత్రానికి సంబంధించిన విశేషాలు వారు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:42 - October 20, 2017

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. అనేక టైటిల్స్ వినిపించినప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దీపావళికి వస్తుందని అభిమానులు భావించారు. కాని అభిమానుల ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ యూనిట్ ఓన్లీ శుభాకాంక్షలతో సరిపెడుతున్నట్లుగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది . దీంతో అభిమానులకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే చిత్ర టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. పవన్ 25 చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఇందులో పవన్ స్టార్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

12:49 - August 18, 2017

అజిత్ చిత్రం వివేగం రిలీజ్ కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్ర ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు ట్రైలర్‌ సాగింది. 
నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది.. అంటూ అజిత్‌ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ట్రైలర్ లో రోమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. అజిత్ సరసన కాజల్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించడం విశేషం. 24వ తేదీన విడుదలవుతున్న సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా 

Don't Miss

Subscribe to RSS - telugu latest movies