Telugu Mahasabhalu

07:39 - January 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు విద్యాశాఖ, తెలుగుభాష అమలు సబ్‌కమిటీతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఫస్ట్‌క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్నారు. తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాలలో మాతృభాషను తప్పనిసరిగా అమలు చేస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా చర్చించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి తమ ప్రతిపాదనలను కడియం శ్రీహరికి అందజేసింది.

ఐదో తరగతి వరకు తెలుగు భాష
ఐదో తరగతి వరకు తెలుగు భాషను చదువుకోని విద్యార్థులకు ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్దతిలో తెలుగు నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్టు సమావేశంలో చర్చించారు. ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి ఎనిమిదో తరగతిలో... పది వరకు తెలుగురాని వారికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సులభంగా నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందించడంపై సమావేశంలో చర్చ జరిగింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని సబ్‌కమిటీ కడియంకు వివరించింది. తెలుగు భాష అమలులో వారికెలాంటి అభ్యంతరం తేదని చెప్పినట్టు కడియం దృష్టికి తీసుకొచ్చింది. తెలుగు భాష అమలుకు కావాల్సిన సిలబస్‌, పుస్తకాలను వెంటనే తయారు చేయాలని కడియం ఆదేశించారు.భాషా పండితుల అప్‌ గ్రెడేషన్‌పై అధికారులతో కడియం శ్రీహరి చర్చించారు. భాషా పండితులకు తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం న్యాయ సలహా తీసుకుని.. అప్‌గ్రెడేషన్‌ జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలన్నారు.

14:52 - January 29, 2018

హైదరాబాద్ : సభలుపెట్టి మరీ తెలుగు ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు. భాషాభివృద్ధికి కృషి చేస్తామంటూ సంబురాలు జరిపారు. కొత్త ఏడాదిలో కొంగొత్తగా తెలుగు భాషకు పట్టంకడతామని ప్రకటనలు గుప్పించారు. నెల రోజులు గడిచింది. భాషాభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. భాషాభివృద్ధికి పాటుపడతామని ఘనంగా చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసి నెలరోజులైనా... కార్యరూపం దాల్చని తెలుగు భాషాభివృద్ధిపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. ప్రపంచంలోని తెలుగు భాషాభిమానులంతా ఒకచోటచేరి తెలుగు భాష అభివృద్దిపై చర్చలు జరిపారు. సభలు, సమావేశాలు, చర్చాగోష్టులు, అవధానాలు... ఇలా ఒకటేమిని అన్నిరకాలుగా తెలుగు భాషగొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సభల నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే తెలుగుభాషకు పట్టంగడతామంటూ ప్రకటనలు గుప్పించారు. కొత్త ఏడాదిలో సరికొత్తగా భాష అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నెలరోజులు దాటింది. మహాసభల ముగింపు సభల్లో గొప్ప వాగ్దానాలు చేసిన సీఎం... వాటి ఆచరణకు పూనుకోలేదు. అమ్మభాషకు పట్టం కడతామన్న నేతలు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. జనవరి మాసంలో తెలుగు భాషాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్పారు. కానీ నేటికి ప్రభుత్వం ఎజెండానే రూపొందించలేదు. అసలు సాహితీ ప్రియుల నుంచి ప్రతిపాదనలు, ఆలోచనలు పంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడటం లేదని తెలుస్తోంది. దీంతో సాహితీ అభిమానులు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సిలబస్‌ రూపకల్పన కోసం తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. మరోవైపు ఈ నెలలో ప్రభుత్వం భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అడుగుపడలేదు. తెలుగు భాషాభివృద్ధిపై కృషిని తెలుగు సాహిత్య అకాడమీ కొనసాగిస్తుందని కేసీఆర్‌ చెప్పారు. అయితే సాహిత్య అకాడమీ నుంచిగానీ... సాంస్కృతిక శాఖ నుంచిగానీ ఎలాంటి ప్రయత్నమే లేదు. దీంతో సీఎం ప్రకటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు భాషాభివృద్దిపై వందల, వేల సూచనలు వచ్చాయని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. అర్థాంతరంగా ప్రకటన సరికాదనీ.. మరిన్ని సూచనలు అందరి నుంచి స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసి నెల కావొస్తున్నా... నేటికీ కార్యాచరణ ముందుకు పడలేదు. దీంతో అసలు సూచనలు స్వీకరిస్తారా.. అనే అనుమానాలు మొదలయ్యాయి. సాహితీవేత్తలకు సమాచారం ఇచ్చి.. సమావేశం నిర్వహించాలన్నా కనీసం వారం , పదిరోజులు పట్టే అవకాశముంది. జనవరి మొదటి వారంలో ఆ ప్రయత్నాలు ప్రభుత్వం ప్రారంభిస్తుందని అందరూ ఆశించారు. కానీ నెలరోజులైనా ఆదిశగా ప్రయత్నాలే మొదలుకాలేదు. దీనిపై ఎవ్వరూ నోరు మెదపకపోవడం.. అసలు సదస్సు జరుగుతుందా అన్న సందేహాల వ్యక్తమవుతున్నాయి.

తెలుగు భాషాభివృద్ధి అంటే గొప్పగొప్ప ప్రకటనలు చేయడంకాదని.. ఆ ప్రకటనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సాహితీవేత్తలంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సాహితీవేత్తలతో సదస్సు నిర్వహించి తెలుగు భాషాభివృద్దికి బాటలు వేయాలని కోరుతున్నారు.

20:26 - January 4, 2018

అనంతపురం : తెలుగు భాషను ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండా చేస్తున్నారని.. మొదట తెలుగు భాషను కాపాడితేనే సంసృతి సాహిత్యం నిలబడుతుందని ప్రముఖ సినీ డైరెక్టర్‌ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మంచి సినిమాలు తీస్తే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ వారసత్వాన్ని ప్రజలే మద్దతు ఇస్తున్నారన్నారు. వారుసులు కానీ వారు కూడా ఎంతో మంది సినీ రంగంలో ప్రజాధారణ పొందారన్నారు. ఎంత పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసినా.. ప్రేక్షకులకు నచ్చిన సినిమాలను మాత్రమే ఆదరిస్తారని తెలిపారు.

20:21 - December 28, 2017

ఆకాశాన్నంటుతున్న ధరలు.. భారమైపోయిన సామాన్యుడి బతుకు... హక్కుల కోసం ఉద్యమాలు.. అస్థిత్వం కాపాడుకునే ఆరాటం.. ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు.. పైపై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసే విధానాలు..దళితులపై పెరుగుతున్న దాడులు.. పరువు కోసం హత్యలు...విదేశీ సదస్సుల ఆడంబరాలు... పరిమళించిన తెలుగు ఉత్సవాలు.. పరుగులెత్తుతున్న మెట్రో రైలు, రికార్డుల బాహుబలి2 ఇవీ 2017లో తెలుగు ప్రజలు చూసిన అనుభవాలు.. ఇలాంటి ఘటనల సమాహారంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్యాంశాలపై ప్రత్యేక కథనం..

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు..దుమ్మురేపిన రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం అంతులేని ఆరాటం.. సెమీఫైనల్ గా భావించిన నంద్యాల ఉపఎన్నిక ఏపీలో హడావుడి చేసింది. ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూసిన మెట్రో రైలు నగరంలో పరుగులు తీస్తోంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో టికెట్టు ధరలపై మాత్రం విమర్శలు ఎక్కువవుతున్నాయి..పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర నడుస్తోంది.. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్ప సాధన కోసం జగన్ ప్రయత్నాలు 45 రోజులుగా సాగు

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు.. మొత్తం ఉత్సవాలకు 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారయ్యారు. పవిత్ర సంగమం కాస్తా విషాద సంగమమయింది. గతేడాది గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ లోగా కృష్ణా నదిలో ఈ ప్రమాదం జరిగింది.. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా యంత్రాంగం అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో బినమా పేర్లతో అక్రమ అనుమతులతో బోట్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నేతల తీరు కూడా తెరపైకి వచ్చింది.

నగరవాసులంతా ఇవాంకా రావా మా వంక అని పిలిచారు. ఇవాంక వస్తే చాలు.. తమ ప్రాంత చిత్రంలో కాస్తయినా మార్పు వస్తుందని భావించారు. ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నం.. అప్పుడెప్పుడో బిల్ క్లింటన్ వస్తున్నాడని చంద్రబాబు హడావుడి చేసిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు కెసీఆర్ హయాంలో ఈ హడావుడి కనిపిస్తున్నదని చెవులు కొరుక్కుంటున్నారు నగర వాసులు.. జీఈఎస్ ఘనంగా నిర్వహించారని తెలంగాణ సర్కారు క్రెడిట్ పొందినా, నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో మామూలు సమయంలో చూపే నిర్లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది.

ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆవిష్కృతమైన భారీ చిత్రం.. కనీవినీ ఎరుగనంత భారీ బడ్జెట్.. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో ఉత్కంఠను రేకెత్తించి, లక్షలాది ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఈగ బాటలోనే బాహుబలి వన్ బాటలోనే బాహుబలి2 కూడా సత్తా చాటింది. 2017 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు దాటుతోంది. టార్గెట్ సమయం దాటుతోంది..నిధుల కొరత వేధిస్తోంది..పనులు ఆగిన పరిస్థితి కనిపిస్తోంది.. మొత్తానికి 2017లో పోలవరం పరిస్థితి అంతంత మాత్రంగానే సాగిందని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై, బహుజనులపై దాడులు మరింత పెరిగాయి.. కులం దన్ను, రాజకీయ బలం, ఆర్ధిక బలాన్ని చూసుకుని కొందరు పేట్రేగి పోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. 2017లో నరేశ్, మధుకర్ ల హత్యలతో పాటు, గరగపర్రు ఘటన సంచలనం కలిగించాయి..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే పనికి 2017లో ఏపీ సర్కారు దిగింది.
ఇవీ 2017లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య ఘటనల వివరాలు. గుర్తు చేసుకోవలసిన అంశాలు.. అనంత కాల గమనంలో మరో వసంతం గడిచిపోతోంది. 2018 రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యాలు నెలకొని, ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:10 - December 19, 2017
20:06 - December 19, 2017

ఢిల్లీ : తెలుగు ప్రపంచ భాష అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, తెలుగులో తన ప్రసంగాన్ని  ప్రారంభించారు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని అభివర్ణించారు. తెలుగు మహాసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష తెలుగు అని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలుగు భాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉందనన్నారు. ముగ్గురు తెలుగువారు రాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య అన్నారు. ఎన్నో దేశాల్లో తెలుగువారు ఖ్యాతి పొందారని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. రాయప్రోలు సుబ్బారావు రచించిన గేయం 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనినా...పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపురా నీజాతి నిండు గౌరవం'... వాక్యాలను పాడి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

18:55 - December 19, 2017
17:13 - December 19, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ వస్తున్న సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముగింపు సభలకు ఎల్బీస్టేడియం సిద్ధమైంది. ముగింపు వేడుకలను ఎల్బీస్టేడియంలోనే దాదాపు 35వేల మంది వీక్షిస్తారని సాంస్కృతిశాఖ డైరెక్టర్‌ బుర్ర వెంకటేశం అంటున్నారు. మరిన్ని వివరాలను 

 

16:37 - December 19, 2017

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనం జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన తెలుగు మహాసభలు నేటి సాయంత్రంతో ముగుస్తున్నాయి. మొదటిసారి 1975 సం.లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏప్రిల్ 12 నుంచి 19 వరకు జరిగాయి. మలేషియాలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు, మారిషస్ లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు, 2012సం.లో తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. హైదరాబాద్ లో జరుగుతున్న తెలుగు మహాసభలపై మానవి స్పెషల్ ఫోకస్ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:15 - December 19, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, టీఅసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు రాష్ట్రపతి రామ్ నాత్ కు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Telugu Mahasabhalu