telugu movie

18:39 - October 25, 2018

బిచ్చగాడు సినిమా విజయం తర్వాత తమిళ్ నటుడు విజయ్ అంటోనీ నటించిన అన్ని చిత్రాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా రోషగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నివేదిత థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. పోలీసులు సామాన్యులు కాదు పుడింగులే అంటూ  విజయ్ ఆంటోనీ టీజర్‌లో కనిపించాడు. గత సినిమాలతో పోల్చితే డైలాగ్ డెలివరీలో  రోషగాడులో ప్రత్యేకత కనిపిస్తోంది. ఇదుగో టీజర్ మీకోసం..
 

11:32 - September 21, 2018

ఆర్.ఎక్స్.100...చిన్నసినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది...హీరోగా కార్తికేయకి మంచి గుర్తింపు లభించింది..ప్రస్తుతం కార్తికేయ హీరోగా హిప్పీ అనే చిత్రం రూపొందుతోంది.. టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో, తమిళ్ లో..తుపాకీ, కబాలి, స్కెచ్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి.యస్.థాను. నిర్మాణంలో, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా హిప్పీ చిత్రం తెరకెక్కుతోంది.. ఈ రోజు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమా విశేషాలను తెలియచేసారు..

కార్తికేయ తన తొలి చిత్రం కంటే డిఫరెంట్ గా హిప్పీ లో కనిపిస్తాడని దర్శకుడు చెప్పారు. 1985 నుండి తమిళ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ, ఎప్పటి నుండో డైరెక్ట్ గా తెలుగులో సినిమా చెయ్యాలి అనుకోవడం జరిగిందని ఈ సమయంలో తమ చిత్రానికి కార్తికేయ కరెక్టుగా సరిపోతాడని భావించడం జరిగిందని...ఈ విషయానికి కార్తికేయకు చెప్పగా వెంటనే అంగీకరించడం జరిగిందని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ హిప్పీ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, కార్తికేయ పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించడం జరుగుతుందని తెలిపారు. వాళ్లెవరనేది త్వరలో తెలియచేస్తామని నిర్మాత వెల్లడించారు. ఆర్.ఎక్స్.100 తర్వాత పెద్ద బ్యానర్లో పనిచేసే అవకాశం రావడం అదృష్టమని, సక్సెస్ ని కంటిన్యూ చేసే సినిమా ఇది అని హీరో కార్తికేయ తెలియచేసారు.. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.డి.రాజశేఖర్, సంగీతం:నివాస్.కె.ప్రసన్న,ఎడిటింగ్:ప్రవీణ్.కె.ఎల్.    

12:04 - August 17, 2018

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా పేరు తెచ్చుకున్న వినాయక్..ఇటీవల మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమాకు డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లలో వినాయక్ ను చిరు ఎంచుకోవటంతో ఆయనపై వున్న నమ్మకమేనన్నారు మెగాస్టార్. మరి మెగాస్టార్ నమ్మకాన్ని పొందిన వినాయక్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అటువంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించేందుకు మంచువారబ్బాయి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మంచు విష్ణు ప్రస్తుతం 'ఓటర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పరశురామ్ వేరే నిర్మాతల దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వలన, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేం. అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నా..'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి కావటానికి చాలా సమయం పట్టే అవకాశాలుండటంతో ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

19:52 - August 11, 2018

'మారుతి' స‌మ‌ర్పణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై 'ప్రభాక‌ర్.పి' ద‌ర్శక‌త్వంలో 'బ్రాండ్ బాబు' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించారు. డైరెక్టర్ 'మారుతి' కథ అందించారు. ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా విడుదలైన సందర్భంగ టెన్ టివి 'ప్రభాకర్ పి'తో ముచ్చటించింది. ఆయన చిత్ర విశేషాలతో మరిన్ని ముచ్చట్లు తెలియచేశారు. ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

18:57 - August 10, 2018

2013లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ పలు కారణాల వల్ల ఐదేళ్ల తరవాత ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్ర రివ్యూ...రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

16:33 - August 2, 2018

'శివకాశీపురం' మూవీ టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:09 - July 27, 2018

హాయ్ ఆల్ ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల . రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఈరోజు కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ '''సాక్ష్యం'' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బెల్ల కొండ సాయి శ్రీనివాస్ మూడు సినిమాల అనుభవంతో నాలుగోవ సినిమాతో ఈ రోజు థియోటర్ లోకి వచ్చాడు. భారీ బడ్జెట్‌తో టెర్రిఫిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా విడుదలవుతుంది... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముందు సినిమా 'జయ జానకి నాయక' బాక్సాఫీసు వద్ద ఫర్వలేదనిపించింది. అదే హొప్ తో హీరోగ తనలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బెల్లంకొండ..

మూడే మూడు సినిమాలు అన్ని సినిమాలకు భారీగానే బడ్జెట్ పెట్టారు.. స్టార్ హీరోయిన్లతో పాటు, స్టార్ యాక్టర్స్ అందరూ ఆ మూడు సినిమాల్లో ఉన్నారు.. దాంతో బెల్లంకొండ మూడు సినిమాలు యావరేజ్ టాక్ సాధించుకున్నాయి.. అయితే ఇప్పుడు ముందు సినిమాలనుమించిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించారు.

లక్ష్యం, లౌక్యం.. రామరామ కృష్ణ కృష్ణ, డిక్టెటర్ లాంటి వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ ను డైరక్ట్ చేసిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకుడు.. అంతే కాదు బలయ్యసినిమాను డైరక్ట్ చేసిన బోయపాటి సాయి శ్రీనివాస్ తో జయజానకీ నాయకా తీస్తే.. అదే బాలయ్యతో డిక్టేటర్ చేసిన శ్రీవాస్ ఇప్పుడు సాక్ష్యంతో మన ముందకు వచ్చాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్స్, అండ్ ప్రమోషనల్ వీడియోస్ అన్ని ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుందన్న సిగ్నెల్స్ ఇచ్చాయి..

బెల్లంకోండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గావచ్చిన ఈ మూవీలో శరత్ కుమార్ జగపతిబాబు, మీన, రావు రమేజ్, అషితోష్ రాణ, వెన్నెల కిశోర్, రవికిషన్.. బ్రహ్మాజీ, జయప్రకాశ్, సమీర్, పవిత్ర లోకేష్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు వర్క్ చేశారు.

అర్జున్ రెడ్డి మూవీకి అద్భతమైన బాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. చిరంజీవి చిన్నల్లుడు హీరోగా పరిచయం అయిన విజేత చిత్రానికి కూడా సంగీతం అందించాడు రామేశ్వర్..

మరి ఈ మూవీ ఆ టీమ్ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.. అంతే కాదు ఈ వీక్ ఎండ్ లో ఈ మూవీతో పాటు మెగా హీరోయిన్ హ్యాపి వెడ్డింగ్ కూడా లైన్ లో ఉంది.. ఇటు సాక్ష్యం.. అటు హ్యాపీ వెడ్డింగ్ రెండు సినిమాలు మంచి బ్యాగ్రౌండ్ తోనే వస్తున్నాయి.. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది.

ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత "" సాక్ష్యం’ " సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ ఇది....రేటింగ్..

20:51 - June 30, 2018
16:22 - June 27, 2018
21:15 - March 16, 2018

స్వామి రారా నుంచి కంటెంట్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటు.. ప్రామిసింగ్ హీరోగా మారిన నిఖిల్.. కిరిక్ పార్టీ అనే కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీని కిరాక్ పార్టీ అనే పేరుతో రిమేక్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆల్ రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాకు సుథీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మెండేటి డైలాగ్స్ అందించడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.. అలా భారీ అంచనాలు పెంచిన కిరాక్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ విషయానికి వస్తే..   
కథ విషయానికి వస్తే హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇజనీరింగ్ కాలేజిలో ఎంజాయిబుల్ స్టూడెంట్ గా లైఫ్ ను గడిపేస్తుంటాడు కృష్ట. అతను సీనియర్ అయిన మీరాను చూసి, ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా కృష్టను ఇష్టపడుతుంది.. అనుకోని ఇన్సిడెంట్ వలన మీరా చనిపోతుంది.. ఆ తరువాత రెబంల్ గా మారిన కృష్ణ.. కాలేజి పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రెసిడెంట్ అవుతాడు.. అక్కడ నుండి అతను ఆటిట్యూడ్ ఎలా టర్న్ అయ్యింది.. ఎలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు లాంటి ఇన్సిడెంట్స్ తో కథ ముగుస్తుంది..
నటీనటుల విషయానికి వస్తే..  
నటీనటుల విషయానికి వస్తే..  తన ప్రతి సినిమా లాగే ఈ సినిమాకు కూడా నటన పరంగా పూర్తి న్యాయం చేశాడు నిఖిల్..ఇంజనీరింగ్ లోని వివిధ దశల్లో ఉన్న స్టూడెంట్ లా కనిపించడానికి, బాడీ పరంగా మెకోవర్ కూడా అయ్యాడు.. ఫీల్ పరంగా, అల్లరి పరంగా కృష్ణ పాత్రలోని వేరియేషన్స్ బాగా ప్రసెంట్ చేశాడు.. కాకపోతే అక్కడక్కడ కథ పక్కదారి పట్టడంతో చేసేది ఎం లేక నిఖిల్ కూడా చూస్తూ ఉండిపోయాడు.. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. మీరా పాత్ర చేసిన సిమ్రాన్ పరింజ లుక్స్ పరంగా మెప్పించింది.. యాంక్టింగ్ పరంగా ఓకే అనిపించింది.. ఇక కన్నడ కిరీక్ పార్టీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డే.. తెలుగు వర్షన్ లో సత్య పాత్రలో కనిపించింది.. ఆమె లుక్స్ పరంగా యావరేజ్ గా ఉన్నప్పటికి ఎనర్జీలెవల్స్ బాగున్నాయి.. కొన్ని చోట్ల మాత్రం ఆమె నటన అతిగా అనిపించింది.. ఇక నిఖిల్ ఫ్రెండ్స్ గా కనిపించిన యూత్ బ్యాచ్.. చాలా వరకు మెప్పించారు.. మిగతా నటీనటులు పాత్రల పరిది మేర పర్వాలేదు అనిపించారు.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే..   
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం అయిన చందు మొండేటి అసోసియోట్ శరణ్ కొప్పిశెట్టి బెస్ట్ అవుట్ పుట్ అవ్వడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పాలి. యూత్ ఫుల్ కంటెంట్ ను, ఎమోషనల్ ట్రాక్ ను, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను బాలన్స్  చేయడంలో పూర్తిగా తడబడ్డాడు.. దానివలన సినిమా ప్లో అర్ధరహితంగా తయారుఅయ్యింది.. అయితే దీనికి పూర్తిగా అతన్ని బాధ్యున్ని చేయలేం.. సుధీర్ వర్మ లాంటి టాలేంటెడ్ అండ్ ఎక్స్ పీరియన్సడ్ స్క్రీన్ ప్లే రైటర్ పేపర్ మీద రాసిన దాన్ని అతను స్క్రీన్ పై ప్రజంట్ చేయడానికి ట్రై చేశాడు.. ఇక చందూ మొండేటి డైలాగ్స్ కూడా చెప్పుకోనేంత గొప్పగా లేవు... కాలేజీ బ్యాగ్ డ్రాప్ ఎపిసోడ్ లో వాట్సప్ జోకులను.. అలాగే పాత జోకులను కొత్త పేపర్ లో చూట్టి అందించడానికి ట్రై చేశాడు.ఇక కన్నడ కిరీక్ పార్టీకి బ్యాక్ బోన్ గా నిలిచిన అజనీష్ లోక్ నాథ్ సంగీతం, ఈ కిరాక్ పార్టీకి కొంత వరకు హెల్ప్ అయ్యింది. మిగతా వాటిల్లో నెటివిటీ అని పాకులాడిన మేకర్స్, మ్యూజిక్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పాలి...  కెమెరా మెన్ అద్వైత గురుమూర్తి పనితనం మెప్పిస్తుంది.. లిమిటెడ్ లొకేషన్స్ లో తక్కువ ఖర్చులో కలర్ఫుల్ విజ్యూవల్స్ అందించడంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడు.. ఎడిటర్ ఎమ్మార్ వర్మ ఇకాస్త కేర్ తీసుకుని సినిమాను ట్రిమ్ చేయాల్సి ఉంది.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే..   
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే,, కన్నడలో అక్కడ నెగిటివిటీతో కాలేజ్ ఇన్సిడెన్స్ ఒక ఫ్రెష్ పాకేజ్ లా తెరకెక్కిన కిరీక్ పార్టీనీ ఇక్కడ ఇంకా గొప్పగా తీయాలి అన్న ఉద్దేశ్యంతో చిన్న చిన్న మార్పులు చేశారు.. దాంతో సినమాలో ఉన్న ఫీల్ మిస్ అయ్యి ఫన్ పలుచబడిపోయింది.. కిరాక్ పార్టీ కాస్త, ఆర్డినరీ పార్టీ అయిపోయింది.. అయితే మేకర్స్ అనుకున్నట్టు స్టుడెట్స్ కి, మిగత టార్గెటెడ్ ఆడియన్స్ కి ఈవారం రోజుల పాటు కాలక్షేపంగా అనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావం చూపించగలుగుతుంది కిరాక్ పార్టీ.. లేదంటే మాత్రం, డిస్స్పాయింటెడ్ మూవీగా మిగులుతుంది..   
    
ప్లస్ పాయింట్స్
నిఖిల్ మేకోవర్ 
సినిమాటోగ్రఫీ
రెండు పాటలు
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
డైలాగ్స్ 
ఓల్డ్  కామెడీ..
ఫీల్ లేని లవ్ ట్రాక్స్

రేటింగ్
1.5 / 5

Pages

Don't Miss

Subscribe to RSS - telugu movie