telugu movies

16:29 - September 13, 2017

నెల్లూరు : అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే స్వల్ప అస్వస్థతకు గురైంది. నెల్లూరులో ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరైన షాలిని అస్వస్థతకు గురవడంతో బోలినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

 

13:15 - September 9, 2017

సినిమాల్లో రాణించాలని చాలామంది కళలుకంటారు. సినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లకు ప్లేస్ రావడం చాల కష్టం ..వారసత్వం ఉన్న ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కొంచం కష్టమైన పనే. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడ ఒక హిట్ సినిమా కోసం తెగ తాపత్రేయ పడుతున్నాడు ఈ యంగ్ హీరో. 'నాగార్జున' వారసుడు 'అఖిల్' .అక్కినేని వారి ఫామిలీ లో ఫస్ట్ సినిమా ఘోరంగా ప్లాప్ చేసుకున్నాడు అని అఖిల్ గురించి అనుకుంటున్నారట. ఎన్నో ఎక్సపెక్టషన్స్ తో వచ్చిన 'అఖిల్' సినిమా ఆశించిన విజయం సాధించలేదు అని ఫిలిం నగర్ టాక్. ఎంత స్టార్ హీరో కొడుకు అయితే మాత్రం ఎలా తీసిన సినిమాలు చూస్తారా అనేది ప్రేక్షకుల ప్రశ్న. సినిమాలో కంటెంట్ ఉండాలి హీరోలో దమ్ము ఉండాలి అని ఫిక్స్ ఐన ఆడియన్స్ కి నిరాశ మిగిల్చిన సినిమా అఖిల్ అని అనుకుంటున్నరు.

'24' సినిమా తో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ విక్రమ్ కుమార్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. ఇక తాజాగా అఖిల్ రెండో సినిమాకు సంబంధించి మరో స్టిల్ బయటికి వచ్చింది. అందులో వెనుక విలన్లు తరుముతుంటే అఖిల్ గోడమీదుగా గాల్లోకి ఎగురుతూ కనిపిస్తున్నాడు. వరుసగా ఈ పోస్టర్లు చూసిన జనాలు.. అఖిల్ బాబు అసలు నేల మీద నడవడా.. అతనేమైనా స్పైడర్ మ్యానా.. సూపర్ మ్యానా.. అని చర్చించుకుంటున్నారంట. మరి ప్రేక్షకులందరూ సెన్సిబుల్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ రోజుల్లో అఖిల్-విక్రమ్ పక్కా యాక్షన్ సినిమా చేయడంలో ఆంతర్యమేంటో.. ఇందులో అంత విశేషం ఏముందో చూడాలి

15:02 - September 6, 2017

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ కొడుకు మహధాన్ వెండి తెరపై కనిపించనున్నాడు. మహధాన్ రాజాది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ధ్రువీకరించారు. ‘‘మాస్ మహరాజ్ రవితేజ కుమారుడు మహధాన్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ రవితేజ కుమారుడితో కలసి సెట్స్‌లో దిగిన ఫొటోను దిల్‌రాజు పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్నారు. తన సినీ జీవితంలో తొలిసారి అంధుడి పాత్ర పోషిస్తున్న రవితేజ తన కుమారుడిని కూడా అంధుడి పాత్రతోనే సినీరంగానికి పరిచయం చేయబోతున్నారు. దిల్‌రాజు పోస్ట్ చేసిన ఫొటోలో రవితేజ కుమారుడి చేతిలో ఉన్న స్టిక్‌ను గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

12:18 - August 31, 2017
12:11 - August 31, 2017

ఖద్దరు దుస్తులు అనగానే మనకు నేతలు ముందుగా గుర్తుకొస్తారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటుంటారు. రాజకీయ నేపథ్యంలో సినిమాలు కూడా రూపొందుతుంటాయి. అందులో హీరోలు కూడా ఖద్దరు దుస్తులు వేసుకుని షూటింగ్ చేస్తుంటారు. తాజాగా ప్రిన్స్ 'మహేష్ బాబు' కూడా ఖద్దరు దుస్తులు వేసుకుని షూటింగ్ లో పాల్గొన బోతున్నారంట.

'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం' అంతగా ఆడలేదు. మురుగదాస్ కాంబినేషన్ లో 'స్పైడర్' సినిమాలో నటిస్తున్న 'మహేష్' కొరటాల శివ చిత్రానికి కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను' పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో 'మహేష్' ఏకంగా రాజకీయ నాయకుడిగా..ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. రాజకీయ చిత్రంలో మహేష్ నటిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సెట్ ను భారీగా నిర్మించారని అందులో మహేష్ పాల్గొంటారని తెలుస్తోంది. వచ్చే నెల నుండి 'మహేష్' ఖద్దరు దుస్తులతో చిత్రీకరణకు హాజరు కానున్నాడు. 'మహేష్' సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. సమాజానికి ఏదో ఒక మెసెజ్ ఇచ్చే విధంగా కొరటాల సినిమాలు రూపొందిస్తాడనే సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు ? అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

12:03 - August 31, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' అభిమానులకు చేదు వార్త. 'ఎన్టీఆర్' తాజా చిత్రంపై ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్  శరవేగంగా కొనసాగుతోంది. చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా పాత్రలకు సంబంధించిన ఫొటోలు..టీజర్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు టీజర్స్ విడుదలయ్యాయి కూడా.

ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదా థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను సెప్టెంబర్ 3వ తేదీన అట్టహాసంగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా వేడుకను వాయిదా వేసుకున్నట్లు..ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా మార్కెట్ లోకి ఆడియోను విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ వర్షాలు..వినాయక నిమజ్జనోత్సవంలాంటివి ఉండడం..పోలీసు శాఖ ఇందులో నిమగ్నం అవుతుండడంతో వేడుకను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. కానీ అభిమానుల మధ్య చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:47 - August 31, 2017

ప్రిన్స్ 'మహేష్ బాబు' న్యూ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సినిమా మొదలై రోజులు గడుస్తున్నా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంటుండడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ కూడా ఆలస్యంగానే విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

గ్రామం, కుటుంబ విలువలతో ముడిపడి ఉన్న లవ్ స్టోరీ తో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ హిట్ తో 'మహేష్' నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద హోప్స్ బాగా పెరిగాయి. అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ మూటగట్టుకుంది. 'మహేష్ బాబు', 'రకూల్ ప్రీత్ సింగ్' జంటగా 'మురుగదాస్' దర్శకత్వంలో 'స్పైడర్' సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. రా ఏజెంట్ గా కనిపించనున్న 'మహేష్' నటన ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

పెండింగ్ లో ఉన్న ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్టేనని ప్రచారం జరుగుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

13:53 - August 22, 2017

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. చిరు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ మెగా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా.. సైరా నరసింహారెడ్డి గా మార్పు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు నటిస్తున్నారు. 

13:00 - August 22, 2017

హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 151 సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ 'సై రా' అని పెట్టారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. సై రా.. మెగా లుక్ వచ్చేసింది..! ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

11:53 - August 22, 2017

అమరావతి: ఏపీ సర్కార్‌కి ఎంపీ చిరంజీవి లేఖ రాశారు. తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్‌ కాలనీని ఖాళీ చేయించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన అందులో ప్రస్తావించారు. తిరుపతి పట్టణం నడిబొడ్డున ఆ కాలనీ ఉండటం ఇష్టంలేకే ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే ఈ పనిచేస్తోందని చిరంజీవి ఆరోపించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - telugu movies