ten tv breaking
పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని జీవీకే ఇంక్లైన్ 1లోని 33వ డీప్‌లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గని అధికారులు..కార్మికులను బయటకు పంపుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. అశ్వాపురం మండలం బి.జి.కొత్తూరు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. బీఎస్ఎన్ఎల్ పైపులైన్ పని చేస్తున్న కూలీలపైకి లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ : కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌పై మండిపడ్డారు. పాక్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన కుల్ భూషణ్ జాదవ్ తల్లి అవంతికా జాదవ్‌కు వీసా ఇప్పించాలని స్వయంగా అభ్యర్థించినా సర్తాజ్ స్పందించడం లేదని సుష్మా ఆరోపించారు. తన కుమారుడిని కలవాలన్న జాదవ్ తల్లికి పాకిస్తాన్ వీసా ఇవ్వకపోవడాన్ని సుష్మా తప్పు పట్టారు. మెడికల్ వీసా కోరుకుంటున్న పాకిస్తానీల పట్ల తనకు సానుభూతి ఉందని సుష్మా వరుస ట్వీట్లు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఫైజా తన్వీర్ మెడికల్ వీసా కోరగా తాను సానుకూలంగా స్పందించిన విషయాన్ని సుష్మా గుర్తు చేశారు. ప్రతి ఏడాది దాదాపు 500 మంది పాకిస్తానీలు వైద్యం కోసం భారత్ వస్తున్నారు.
కడప : కడప జిల్లాలో ప్రతిభ శిబిరాలు నిర్వహిస్తోంది జనసేన పార్టీ. వైఎస్ఆర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన యువతీ, యువకులు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి టిటిడి మాజీ బోర్డు మెంబర్ హరిప్రసాద్, జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్‌లు హాజరయ్యారు.
హైదరాబాద్: జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, సాహితీవేత్త సినారే ఆత్మకు శాంతి కలగాలి, పరిపాలన నచ్చలేదంటున్న జేఏసీ... తెలంగాణ అవినీతి మయం అయ్యిందట, చంద్రబాబు రాష్ట్రపతి పదవి చేపట్టాలి...వెన్నుపోట్లు లేని భారతం నిర్మించాలి, ముసలామె ఫించను మింగిన పోస్టాఫీసోడు...గుండ్ల పోచం కాడా ఆసరా పంచాంగులు, చెత్తేరుకునేటేళ్లే అని విడిచిపెట్టకండి... సిసి కెమెరాల సిన్మా మొత్తం చూడుండ్రి, లండన్ లో ప్రశాంతత కోల్పోయిన మాల్యా...దొంగా దొంగాఅంటున్న అభిమానులు, మాటమీద నిలబడ్డ ప్రొఫెసర్ సార్...ఓడిపోయినంక బుక్ నమిలేసిండు.. ఇలాంటి అంశాలపై నేటి మల్లన్న ముచ్చట్లతో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...
చిత్తూరు : వెంకన్న భక్తులను వసతి సదుపాయాలు వెంటాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో... కొండపై వసతి కష్టంగా మారుతోంది. రద్దీరోజుల్లో తిరుమలలో ఉన్న వసతి గదులు భక్తులకు ఏమాత్రం సరిపోవండం లేదు. గదులు దొరకని భక్తులు ఆరుబైటే పడిగాపులు కాయాల్సివస్తోంది. అటు టిటిడి ఏర్పాటు చేసిన యాత్రికుల వసతి సముదాయాలపై సరైన సమాచారం లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం కన్నా మొదటి సమస్య వసతి గదులు పొందటమే. ఒక్కోసారి స్వామివారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. సాధారణంగా రోజుకు 70 నుంచి 80 వేల మంది, వారాంతంలో ఇతర రద్దీ సమయాల్లో రోజుకు లక్షమందికి పైనే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు. అయితే రోజుకు లక్షమంది భక్తులకు సులభంగా దర్శనం చేయిస్తున్న టీటీడీ అంతమందికి వసతి కల్పించడంలో మాత్రం విఫలం అవుతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమల వచ్చిన భక్కులకు వెంటనే అద్దె గదులు దొరక్కపోతే ఆరుబయటే నానాపాట్లు పడుతున్నారు. టిటిడి యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసినా వాటిపై సరైన సమాచారం తెలియక వెంకన్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.
7 కౌంటర్లు..
తిరుమలలో మొత్తం 7 కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు మంజూరు చేస్తారు. విఐపీలకు గదులు కేటాయించడానికి శ్రీపద్మావతి నగర్, అడ్వాన్స్ రిజర్వేషన్ గదులు పొందడానికి ఏఆర్పీ కౌంటర్, సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ జనరల్, సిఫార్సు ఉత్తరాలు తెచ్చేవారికోసం టీబి కౌంటర్...ఇలా మొత్తంగా 7 కౌంటర్లు ద్వారా గదులు కేటాయిస్తున్నారు. కొండపై మొత్తం 7 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గదుల్లో కేవలం 35 నుండి 40 వేల మంది భక్తులు మాత్రమే బస చేయడానికి వీలుంది. రద్దీరోజుల్లో గదులు దొరకని భక్తుల కోసం టిటిడి వివిధ ప్రాంతాల్లో నాలుగు భారీ వసతి సముదాయాలు ఏర్పాటు చేసింది. వీటిలోనే లాకర్ సదుపాయం, తలనీలాల సమర్పణకు కళ్యాణకట్ట, స్నానం చేయడానికి సదుపాయాలు కల్పించారు. ఒక్కో వసతి సముదాయంలో సుమారు రెండు వేల మంది భక్తులు బస చేయడానికి సౌకర్యలు ఉన్నాయి.
ఇబ్బందులు తొలగిస్తారా ?
గదులు దొరకని వారి కోసం యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసిన విషయం భక్తులకు తెలియడంలేదు. ఇందులో బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్ సదుపాయం ఉండటంతో.. శ్రీవారి దర్శనానికి వసతి సముదాయం నుంచే వెళ్లే అవకాశముంది. భక్తుల వసతి కోసం తిరుపతిలోకూడా విష్ణునివాసం, శ్రీనివాసం, మాదవం, గోవిందరాజ సత్రాలు ఉన్నాయి. వసతి గదుల సంఖ్యను పెంచి భక్తుల కష్టాలు తీర్చడానికి టిటిడి తిరుమలలో వకులమాతా భవన్ పేరిట భారీ అతిథిగృహాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి యాత్రికుల వసతి సముదాయాలపై భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వసతి గదుల ఇబ్బందులు తొలగించి సంతృప్తికర దర్శనం అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
ఢిల్లీ : పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కోర్టు స్టే విధించింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సిన అసవరం లేదని తేల్చి చెప్పింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తేజ దర్శకత్వంలో రానా, కాజల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రాన్ని సురేశ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. దివంగత నిర్మాత డి.రామానాయుడు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన కథానాయకుడు రానా ట్విట్టర్ ద్వారా సినిమా టీజర్‌ని విడుదల చేస్తారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘నాన్నగారి జయంతి కానుకగా ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ని విడుదల చేయనుండడం ఆనందంగా ఉంది. రానా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిద’’న్నారు. రానా మాట్లాడుతూ ‘‘సినిమాలో నేను పోషించిన జోగేంద్ర పాత్ర స్వభావాన్ని టీజర్ ద్వారా పరిచయం చేయబోతున్నామ’’న్నారు. రానాలోని వైవిధ్యమైన నటుడిని ఈ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు దర్శకుడు. దీనికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ సమకూర్చుతున్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం షెడ్యూల్ జరుగుతోంది. మరోవైపు నిర్మాణానంతన పనులు కూడా సాగుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో సినిమాను విడుదల చేస్తాం. ‘టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్‌ను త్వరలో ఆవిష్కరిస్తాం’’ అని అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం. ఎవరి ఆక్రందనలూ మరొకరికి వినిపించవు. ఎవరి అవమానాలు మరొకరికి కనిపించవు. పోతేపోనీ అనుకుంటూ కాలం గడిపేస్తుంటాం. దశాబ్దాలుగా మనం ఇలాగే బతికేస్తున్నాం. ఈ దృక్పథాన్ని మార్చే సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా పాత్ర సరికొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. సమాజంలో మార్పు తెస్తుంది. అదెలాగో చిత్రంలో చూడాల్సిందే’’ అని చెప్పారు. ‘‘తేజగారిని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఆయన ఆకలి మాత్రమే కాదు.. మనందరి ఆకలిని తీర్చే చిత్రమిది’’ అని రానా అన్నారు . కాజల్ ఇందులో నాయిక. అశుతోష్ రాణా, కేథరిన ట్రెస్సా, నవదీప్, పోసాని, జేపీ, రఘు కారుమంచి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.
Pages
Don't Miss
