ten tv breaking news

21:23 - April 27, 2017

వరంగల్ : టీఆర్ఎస్ ప్రగతి నివేదన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నీళ్లులేక ఎండిపోయిన పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్‌ దద్దమ్మలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ట్రిబ్యునల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకొని తీరని ద్రోహం చేశారని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్‌ నేతలను తరిమికొట్టాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

 


 

21:11 - April 27, 2017

వచ్చేస్తోంది.. మరికొద్ది గంటల్లో.. బాహుబలి-2.. అన్ని థియేటర్ల లోకి వచ్చేస్తోంది. ఆన్ లైన్ టిక్కెట్లు జోరుగా అమ్ముడుపోయాయి.... భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూలు కట్టారు... దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్ష్ గా మిగిలిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు విడుదల అవుతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్ట్ వన్ వస్తున్నప్పుడే అంచనాలు ఆకాశాన్నంటాయి. కథనంలో కొనసాగించిన బిగువుతో.. పార్ట్ టూ పై అంతులేని ఉత్కంఠ. అసలు కథంతా పార్ట్ టూలో ఉందని ఎదురు చూశారు ప్రేక్షకులు.. ఈ ఎదురు చూపులకు ముంగింపు పడి.. ఇండస్ట్రీకి వసూళ్ల వర్షం కురిపించే సినిమాగా బాహుబలి ఉండబోతోందా? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలే ఈ సినిమాకున్న క్రేజ్ కున్న నిదర్శనం. ఐమాక్స్ ఎదురుగా కట్టిన కిలోమీటర్ పొడవు క్యూలే ప్రేక్షకుల ఉత్కంఠకు ఉదాహరణగా నిలుస్తోంది. టికెట్ బుకింగ్ కోసం ఉధృతంగా సాగుతున్న ఆన్ లైన్ ట్రాఫిక్కే.. బాహుబలి బలం ఎంతో చెప్పే కొలత. వెరసి బాహుబలి ఓపెనింగ్స్ తోనే భారీ రికార్డు నెలకొల్పే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీజర్ మరిన్ని బాహుబలి విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత కేవలం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటమే ఆలస్యం బిజినెస్ అలా అలా జరిగిపోయింది. కేవలం పదినిమిషాల వీడియో చూసి ఫస్ట్ పార్ట్ వసూలు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే ఎక్కువ చెల్లించి మరీ కొనేశారు. ఇదీ బాహుబలి సత్తా.. ఇదీ రాజమౌళి క్రియేటివిటీ సృష్టిస్తున్న సినిమా సునామీ.. ఈ సునామీ తీరాన్ని తాకే సమయం ఆసన్నమైంది..

20:54 - April 27, 2017

వరంగల్ : 31 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో ప్రొ.జయశంకర్ సార్ లేకపోవడం బాధగా ఉందని, స్వర్గం నుంచి సార్ తమను అశీర్వదిస్తారని కేసీఆర్ అన్నారు. 16ఏళ్లు పార్టీని నడిపించిన ఘనత కార్యకర్తలదే అని పేర్కొన్నారు. 31 జిల్లా నుంచి వచ్చిన రైతులకు కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ఎంతోమ పోరాడి తెలంగాణ సాధంచుకున్నాం. 2014 జూన్ 2 తెలంగాణ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు వాటిని అధికమిస్తూ బంగారు తెలంగాణ దశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. మఖ్యంగా కరెంటు సమస్య లేకుండా చేసి రైతులకు, కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. ఆసుపత్రుల్లో చనిపోయి శవాన్ని తీసుకెళ్లాడానికి డబ్బులేక బాధపడుతున్న వారిని చూసి పరమ పథం పేరిట ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రూ.40,000కోట్లుమ కేటాయించామని తెలిపారు. 40 లక్షల మందికి పిఛన్లు ఇస్తున్నామని, యావదవులకు గొర్రెలు, నాయబ్రహ్మలకు అధనిక క్షౌర శాలలు 100 శాతం సబ్సిడీ పై కట్టిస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేలు ఇస్తామని, ప్రతి గ్రామంలో గ్రామరైతు సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ సన్నాసులు, దద్ధమ్మలు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో పదవుల కోసం తెలంగాణను తాకట్లు పెట్టారని విమర్శించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేయాలేదని ఆరోపించారు.

19:52 - April 27, 2017

వరంగల్ : పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన మహా నేత కేసీఆర్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో 100 శాతం అమలు చేస్తున్నామని తెలిపారు. 4లక్షల మందికి పింఛన్లు ఇస్తూ టీఆర్ఎస్ దేశానికి ఆదర్శంగా నిలిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడుగా అన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ లేదు, వైసీపీకి ఆధారణ లేదు, బీజేపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్ కు నాకులు లేరని ఆయన అన్నారు. కేసీఆర్ ను మంచి మనస్సుతో అశీర్వదించండని కోరారు.

18:09 - April 27, 2017
18:04 - April 27, 2017

అనంతపురం :  క్రమశిక్షణకు మారుపేరు ఆయన టీడీపీలో రోజురోజుకు కుమ్మూలటాలు పెరగుతున్నాయి. తాజాగా జిల్లాలో తెలుగుతమ్ముళ్లు బాహబాహికీ దిగారు. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు మస్తానయ్య, రామాంజనేయులు చెప్పులతో కొట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సమక్షంలోనే గొడవ జరిగింది. 

18:00 - April 27, 2017

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రూ. 10 రూపాయల కాయిన్స్‌పై వస్తున్న వదంతులను నమ్మవద్దని బ్యాంక్‌ అధికారులు అంటున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కాయిన్స్‌ను రద్దు చేస్తే ఆర్బీఐ ప్రకటిస్తుందంటున్నారు. మరోవైపు ఇదే అదనుగా కొంతమంది 10 రూపాయల నకిలీ కాయిన్స్‌ సృష్టిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో వ్యాపారులు 10 రూపాయల కాయిన్స్‌ తీసుకునేందుకు వెనకాడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తమ వద్ద కాయిన్స్‌ బ్యాంక్‌లో జమ చేయవచ్చంటున్న విద్యానగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌ గణేష్‌తో టెన్ టివితో మాట్లాడుతూ ఆర్బీఐ రూ.10 కాయిన్స్ రద్దు చేస్తే పేపర్ ప్రకట ఇస్తుందని తెలిపారు.

 

17:53 - April 27, 2017

జగిత్యాల : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభతో కార్యకర్తలకు పండుగ వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు ట్రాక్టర్లు, బండ్లపై వరంగల్‌కు తరలి వెళ్తున్నారు. అయితే ఈ మధ్యలో కొన్నిచోట్ల కార్యకర్తలు రోడ్లపైనే మందుతాగి చిందులేస్తున్నారు. జగిత్యాల నుంచి ట్రాక్టర్‌లో బయల్దేరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే గొడవపడి కొండగట్టు దగ్గర రోడ్డుపై కాసేపు హంగామా చేశారు. మందుబాబుల తీరును చూసి ప్రజలు ఇదేంటి అని నవ్వుకుంటున్నారు. మందుబాబుల హంగామాను కొంతమంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. 

17:25 - April 27, 2017
17:11 - April 27, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ten tv breaking news