thammineni

17:33 - October 17, 2017

సంగారెడ్డి : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేముల ఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కోదండరాంలు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, మల్లన్నల సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఇస్తామంటే అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కోదండరాం విమర్శించారు. వాస్తవానికి నీళ్లు ఎవరూ వద్దనడం లేదని..సరియైన పద్ధతిలో నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

13:45 - October 17, 2017

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. 

 

10:48 - September 23, 2017

రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ లో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మను కార్పొరేట్ బతుకమ్మగా మారుస్తున్నారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు హక్కులను కాపాడుకోవాలని విమలక్క అన్నారు. తెలంగాణ వనరులను కబ్జాదారుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

 

16:31 - September 19, 2017

హైదరాబాద్: కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు చావు ప్రభుత్వం కారణమని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. బతుకమ్మ చీరల పేరిట మహిళలకు రూ.50 పంచుతున్నట్టు మహిళలు చెబుతున్నారని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:42 - September 10, 2017

మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు ఇల్లు దాటడం లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం. మేడ్చల్‌జిల్లా టీమాస్‌ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో మార్పుకోసమే టీమాస్‌ ఆవిర్భవించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్‌ కంచె ఐలయ్య, కాకిమాధవరావు, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

13:05 - September 4, 2017

కరీంనగర్ : మానకొండూరు ఘటనపై కరీంనగర్‌ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని.. సీఎం నెరవేర్చడం లేదని ఆరోపించారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి... రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో వరంగల్‌-హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. 

 

12:59 - September 4, 2017

హైదరాబాద్ : దళితులకు ఇచ్చే మూడెకరాల భూపంపిణీ జాబితాలో తమ పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసి.. తీవ్రగాయాలై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానకొండూరుకు చెందిన ఇద్దరు యువకులను టీ-మాస్‌ ఫోరం నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్లే దళితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు నేతలు ఆరోపించారు. మూడెకరాల భూమి ఇవ్వకపోవడంతో నిన్న కరీంనగర్‌లో పరశురాములు, శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. యువకులను టీ-మాస్‌ ఫోరం నేతలు తమ్మినేని వీరభద్రం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు పలువురు నేతలు పరామర్శించారు. ఆస్పత్రి ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:39 - August 29, 2017

యాదాద్రి : భువనగిరిలోని ఏఆర్ గార్డెన్స్‌లో టీ.మాస్‌ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకుడు గద్దర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏ లక్ష్యంతో తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని పాలకులు మరిచిపోయారని నేతలన్నారు. ఈ కార్యక్రమానికి 72 సామాజిక, ప్రజా సంఘాల నేతలతో పాటు.. నాలుగు వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. 

 

15:59 - August 24, 2017

ఆదిలాబాద్ : సామాజిక అసమానతలు, మతోన్మాదంతో దేశంలో అణగారిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని... టీ మాస్‌ ఫోరం రాష్ట్ర నేత జాన్‌ వెస్లీ అన్నారు. పూలే, అంబేద్కర్‌ ఆశయాల సాధనకోసం దళితులు, బహుజనులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని చెప్పారు. ఆదిలాబాద్‌లో టీ మాస్‌ ఫోరం జిల్లా సమావేశానికి వెస్లీతోపాటు... ఫోరం జిల్లా నేత మల్లేశ్, సీపీఎం నేతలు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.

15:32 - August 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలు గతంలో నిర్ణయించుకున్న నీటి వాటాలను సక్రమంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భూముల సర్వేను.. పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని భూముల కబ్జాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - thammineni