Thammineni veerabhadram

19:53 - June 28, 2017

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నాకు దిగింది. రంగాపూర్‌ గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేలా వ్యవసాయరంగంలో పరిష్కారం జరగాలన్నారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుజరిగేందుకు అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఎగ్గొట్టేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. 

 

20:45 - June 24, 2017

హైదరాబాద్ : పోడు వ్యవసాయదారులకు ఎర్రజెండా అండగా ఉంటుందని... వారి జోలికొస్తే ఊరుకునేది లేదని వామపక్ష నేతలు హెచ్చరించారు. అడవినే నమ్ముకుని బతుకుతున్న పోడు సాగుదారులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని... అటవీ హక్కుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
పోడు వ్యవసాయదారుల సమస్యలపై రాష్ట్ర సదస్సు 
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోడు వ్యవసాయదారుల సమస్యలపై రాష్ట్ర సదస్సు జరిగింది. తెలంగాణ వచ్చాక పోడు భూముల సమస్య, గిరిజనులపై దాడులు ఎక్కువయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని హరితహారం పేరుతో లాక్కుంటున్నారన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కాపాడవలసిన సీఎం.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. పోడు వ్యవసాయదారులపై దాడులు చేస్తే సహించమని హెచ్చరించారు. 
గిరిజనుల హక్కులను కాలరాస్తోన్న ప్రభుత్వం : చాడా 
పోడు సాగుదారులకు న్యాయం చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ రాష్ట కార్యదర్శి చాడ అన్నారు. ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఫారెస్ట్‌, పోలీస్ అధికారులు, ప్రభుత్వం మధ్య గిరిజనులు నలిగిపోతున్నారని చాడ అన్నారు. హరిత హారం పేరిట లక్షలాది ఎకరాలు లాక్కుంటున్నారు. 
పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు : సున్నం రాజయ్య  
అలాగే ప్రతిఘటన చేయకపోతే గిరిజనులకు భూములు దక్కే పరిస్థితి లేదని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. భూపాల్‌పల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనుల భూములపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని.. పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.  
ఆదివాసీ ఉద్యమానికి శ్రీకారం : పోటు రంగారావు 
అలాగే ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆదివాసీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు అన్నారు. ఆదివాసీలను అడవి నుంచి గెంటి వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.  పోడుదారులపై దాడులు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఈ  సదస్సులో వామపక్ష నేతలతో పాటు, గిరిజన, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్భందంపై పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

 

18:07 - June 24, 2017

హైదరాబాద్ : గిరిజనులపై పోలీసుల దాడులు ఆపాలని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో రాజయ్య మాట్లాడారు. భూపాల్‌పల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనుల భూములపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని.. పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిఘటన చేయకపోతే గిరిజనులకు భూములు దక్కే పరిస్థితి లేదన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. సదస్సులో వామపక్షాల నేతలు, రైతు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు. 

 

14:18 - May 28, 2017
14:52 - May 19, 2017

హైదరాబాద్: ఆదర్శ లక్షణాలు మూర్తీభవించిన నేత సుందరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సైద్ధాంతిక క్రమశిక్షణ గల నేత సుందరయ్య అని తమ్మినేని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో సుందరయ్య ఒకరని, నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో ప్రజారాజ్య స్థాపనకు కృషి చేస్తామన్నారు. 

10:48 - May 15, 2017
10:47 - May 15, 2017
10:44 - May 15, 2017
10:41 - May 15, 2017

 హైదరాబాద్ : ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ధర్నా చౌక్‌ తరలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని సీపీఎంనేతలు విమర్శిస్తున్నారు.

09:01 - May 15, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Thammineni veerabhadram