theft

08:00 - August 12, 2017

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు వీడియోలో సూడుండ్రి..

20:35 - August 11, 2017

మన నిజాంబాదు పోలీసోళ్లు ఎంత తెల్వికల్లోళ్లమ్మా..? అడ్డంబడెటోన్ని ఇడ్సిపెట్టి.. ఆపదలున్నోన్ని అరెస్టు జేశిండ్రంటే.. వాళ్ల ప్రతిభా పాఠవాలు మామూల్యేంగాదు.. తెలంగాణ జేఏసోళ్లు స్పూర్తి యాత్ర పేరు మీద నిజాంబాదుకు వోతుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు నడ్మిట్ల అడ్డం బడి ఆగమాగం జేయవోయిండ్రు.. మరి ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే.. అడ్డంబడెటోన్ని అరెస్టు జేయాల్నా..? జేఏసోళ్లను అరెస్టు జెయ్యాల్నా మీరే జెప్పుండ్రి..

ఆ నంద్యాల ఉపఎన్నికలళ్ల గెల్చెటోళ్లు ఎవ్వలో పొయ్యెటోళ్లు ఎవ్వలోగని.. రామచంద్రా.. తెల్గుదేశమోళ్లు అట్లనే మోపైండ్రు.. అటు జగన్ పార్టోళ్లు అట్లనే మోపైండ్రు.. ఎల్లిమీద మల్లి మల్లి మీద ఎల్లి.. వీళ్లు వాళ్లను తిట్ట వాళ్లు వీళ్లను తిట్ట.. నంద్యాల ఓటర్లే నోరెళ్ల వెట్టె పరిస్థితొచ్చింది.. అటు ఎన్నికల సంఘమోళ్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు దీస్కుంటున్నరు..

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పంచాదిల కొండను దొవ్వి ఎల్కను వట్టిండ్రుగదా ప్రభుత్వమోళ్లు.. మోకాళ్లు వల్గెతట్టు.. సంసారానికి పన్కిరానట్టు దళితులను గొట్టిన కేసుల తప్పంత ఎస్ఐ రవీందరుదేనటనుల్లా.. ఆ ఒక్కడు గొడ్తెనే ఎన్మిది మంది ఎందుకు పన్కిరాకుంటైండ్రట.. మరి అంత ధమ్మున్న ఎస్ఐని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పొంట నిలవడ్తె ఒక్కడన్న బత్కుతడా పాకిస్తాన్ ఉగ్రవాది..? ఏం తమాషనో పోండ్రి..

హురక మనం చాల మిస్సైపోయినయ్ నిన్నటి శ్రీరాంసాగర్ నీళ్ల సభకాడి ముచ్చట్లు.. అంటే ఇవ్వి సర్కారు కెమేరాల గనిపియ్యయ్ గదా..? ఏదో ప్రైవేటు కెమేరాలకే దొర్కుతయ్ గావట్టి ఆల్చంగొస్తున్నట్టున్నయ్.. అయితే నిన్న ఓదిక్కు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. సభ సంతోషంగున్నదనుకున్నంగని.. లోపటతం గంద్రగోళమే అయ్యిందట.. సూడుండ్రి..

ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. ఎంత మందున్నరు మీ కులపోళ్లు తెలంగాణల..? అంత తింపికొడ్తె.. అరశాతానికి ఎక్వలేరు.. మీరు గంత మంది ఎమ్మెల్యేలా..? గజ్వెల్లి కెళ్లి మొదలు వెడ్తె.. సిద్దిపేట మీరేనాయే.. సిరిసిల్ల మీరేనాయే.. వేములవాడ మీరేనాయే.. కోరుట్ల మీరేనాయే.? ఏంది తమాష మరి మా బీసీలంత ఎటువోవాలె అంటున్నడు అంబర్ పేట అన్మంతన్న... ఏందో మళ్లొకపారి జెప్పు..?

మహాత్మా జ్యోతి బాపూలే బడుల పొంట సద్వుతున్న పోరగాళ్లు సద్వుళ్ల సారం నేర్చుకోని ఎట్ల బత్కాలె అని నేర్చుకునుడు కంటే.. మన్షి అనెటోడు ఏ విధంగ బత్కొద్దు అనేదే నేర్చుకుంటున్నట్టున్నరు ఎక్వ.. ఎందుకంటె హాస్టళ్లు గట్టిండ్రు పయ్యాకన బాతురూములు మర్శిండ్రు.. రూములు నిర్మించిండ్రు.. కిటికీలు మర్శిండ్రు.. ఇన్ని అవస్థల నడ్మ వాడు వ్యవస్థ మీద ఏడపట్టుసాధిస్తడు చెప్పుండ్రి..

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు సూడుండ్రి..

కాలే ధన్ వాపస్ లాయెంగే.. యా నహి లాయెంగే... చేతులు ఇంత పొడ్గువెట్టి చెప్పిండు అప్పటి అభ్యర్థి.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ.. నల్లధనం వాపసు దెస్తాన్న మొనగాడు.. ఉన్నధనం విదేశాల పాలు జేశే పనిజేస్తున్నడట.. ఇన్నొద్దులు సర్కారు చేతులున్న రైల్వే సంస్థ.. ఇప్పుడు విదేశాలోళ్లకు అప్పజెప్పె కుట్రలు జేస్తున్నడట.. ఇగ రైల్వే కార్మికులు.. కండ్లెర్ర జేయవట్టిరి..

 

19:27 - August 8, 2017

మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి ఊరి జనం.. ఇయ్యాళ బువ్వదింటరో.. లేకపోతె అట్లనే నిద్రవోతరో.. ఎందుకంటె ముఖ్యమంత్రి కేసీఆరొచ్చిండు వాళ్ల ఊరికి.. మామూల్గ ప్రజలు కోరిక కోరితె నాయకుడు నెరవేరుస్తడు.. కని మన ముఖ్యమంత్రి ప్రజలకు ఆ ఛాన్సు ఇయ్యడు.. ఆయనకే కోరుతడు.. ఆయనే మంజూరు జేస్తరు జనం సప్పట్లు గొట్టాలే.. వీలైతె పోట్వమీద పాలు వొయ్యాలె గంతే..

నరరూప రాక్షసుడు నయింగానితోని ఏఏ రాజకీయ నాయకుడు సోపతి గట్టిండో.. వాడు ఎన్ని వందల వేల కోట్లు కూడవెట్టిండో.. వాని ఎన్క ఎవ్వలెవ్వలున్నరో.. వాని భూములు ఏడేడున్నయో.. ఇండ్లు ఏడున్నయ్ ఇవ్వన్ని తెల్సుకోవాలన్న ఆసక్తి ఉన్నదా..? ఎవ్వలికన్నా..? ఉంటే అవ్విటిని మర్శిపోండ్రి.. ఆ ముచ్చటనే మీకు తెల్వదని సప్పుడు జేక ఊకోండ్రి.. ఎందుకంటె సారు సచ్చి యాడాదైంది.. ఇంత మాస్కం బెట్టుకోని ఉండుండ్రి..

నేరెళ్ల దళితులను చావగొట్టి నెలనర్దమైంది.. ఇప్పటికి తీరిందమ్మా.. ఎంపీ వినోద్ కుమార్కు.. ఇగ కేటీఆర్కైతె మొఖమే లేదు అటెంకళ్ల వొయ్యెతందుకు.. ముఖ్యమంత్రి సంగతి మీకు ఎర్కున్నదేనాయే.. జనం ఏడ గెదుముతరో అని ఆ ముచ్చటనే ఎత్తుతలేడు.. ఇగ ప్రతిపక్షాలోళ్లకు పండుగైంది ఈ యవ్వారం.. ఎవ్వలొచ్చినా ఎవ్వలు వొయ్యినా.. రాజకీయ నాయకులకే లాభమున్నదిగని.. దళిత బహుజనులకు ఒర్గింది ఏం లేదు..

కరీంనగర్ కాడ మెడికల్ కాలేజీ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారు జేస్తున్న దీక్షను ఆగం జేశిండ్రు పోలీసోళ్లు.. ఆయన ఆరోగ్యం కరావైతున్నదటాని.. రాత్రి పూట ఒక్కటేపారి ఆయన టెంట్లకు జొర్రి అవుతలికి ఎత్తుకొచ్చి.. సక్కగ అంబులెన్సు ఎక్కిచ్చిండ్రు.. పాపం గాడ నిద్రలున్నడో.. నీరసంగున్నదో.. ఇది అంత అయితుంటే పొన్నం సారు నిద్రవొయ్యే ఉన్నడు..

తెలంగాణ ప్రజలారా.. మళ్లొక కుందనం సుర్వైతున్నది మీ ఊర్లపొంటి.. ఇన్నొద్దులు పడావు వడ్డట్టున్న మీ భూముల లెక్కలు అన్ని పక్కాగ దీస్తరట ప్రభుత్వమోళ్లు.. ఎవ్వలి భూమి ఎంత..? ఏడేడున్నది..? అది ఎవ్వలి పేరు మీదున్నది అంత లెక్కలు బైటికి దీస్తరట.. మళ్ల అవ్విటికి కొత్త పాస్ బుక్కులు ఇస్తరట.. భూములకు మళ్ల కొత్త నెంబర్లు ఇస్తరట..

ఆకలైతున్నది అన్నం బెట్టుండ్రి సారూ అని బుడ్డ బుడ్డ పోరగాళ్లకు ఫ్లకార్డులు వట్కోని కడప కలెక్టరేట్ ముంగట ధర్నాకు దిగిండ్రు.. మా ఒంట్లె రక్తం లేదు.. మాకు పౌష్టికాహారం లేదు.. మాకు ఆటబొమ్మలు గావాలె.. మేమేం పాపం జేశ్నమని..? పోరగాళ్లు జేశ్న ధర్నా అందర్ని ఆకర్శించింది జర్రశేపట్ల.. మరి ఆ పోరగాళ్ల ఆకలికి కలెక్టర్ ఏమన్న కదిలిండా ఏమైంది పాండ్రి సూద్దాం..

తేలు గరిస్తె ఎట్లుంటది కథ.. మంటో మంటని ఉర్కం దావఖాండ్ల పొంట.. అయితే ఒకతాన తేళ్లు మన్సులను గార్సుడుగాదు.. మన్సులే తేళ్లను గరుస్తున్నరు.. మామూల్గనైతె తెళ్లను జూశి మన్సులు భయపడ్తె.. ఆడ మట్టుకు మన్సులను జూశి తేల్లు భయపడ్తున్నయ్.. శ్రావనమాసంలొచ్చె మూడు సోమారం నాడు ఒక గుడికాడ అయ్యే ఈ పండుగ గమ్మతనిపిస్తున్నది..

నోట్లు రద్దుగాకముందుకు పిల్లికి గూడ బిచ్చమెయ్యలే ఒకడొకడు.. ఇగ రద్దైపోయి ఎక్కడ చెల్లువాటు కాకుంట అయ్యెవర్కళ్ల.. ఒకడు పెంటకుప్పల వడేస్తున్నడు.. ఒకడు ఏడదాయాల్నో తెల్వక దొర్కిపోతున్నడు.. పైకం లేకగాదు.. ఉండిపరేషాన్ అయితున్నరు చాలమంది.. అవ్వి చలామణిలున్నప్పుడు పేదోళ్లకో రూపాయి దాణం జేయలనిపియ్యలే.. సూడుండ్రి విశాఖపట్నంల ఎంత పైకం దొర్కిందో..

 

11:06 - July 30, 2017

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో ఆకతాయి వీరంగం సృష్టించాడు.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించిన దుండగుడు... మద్యంమత్తులో విద్యార్థులపై దాడి చేశాడు.. విద్యార్థులు కేకలువేయడంతో దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు.

 

19:37 - July 24, 2017

కృష్ణా : విజయవాడలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న 50 లక్షల నగదుతో కూడిన బ్యాగ్‌ను పోలీసులు రెండు గంటల్లోనే కనిపెట్టారు.  ఓ జ్యువెలరీ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న రామకృష్ణ.... గవర్నర్‌పేటలో 50 లక్షల నగదు కలిగిన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక అది గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 2 గంటల్లోనే కేసును ఛేదించారు. రామకృష్ణ పోగొట్టుకున్న బ్యాగు  దారినపోయే ఓ వ్యక్తికి కనిపించింది. దీంతో అతడు  ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్యాగ్‌ను తీసుకున్న వ్యక్తిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు గంటల్లోనే కేసు చేదించిన పోలీసులను సీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. 

 

08:08 - July 17, 2017

విజయవాడ : జులై 11... రాత్రి 9గంటల సమయం.. బెజవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు సమీపానికి కూతవేటు దూరంలోనే దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. మారణాయుధాలతో ప్రజలను, నగల వ్యాపారులను హడలెత్తించి భారీ మొత్తంలో నగలు దోచుకుపోయారు. అయితే నగర పరిధిలో దోపిడీ దొంగల స్వైర విహారం వెనుక ఉన్న మూలాలు ఛేదించడం ఖాకీలకు సవాల్‌గా మారింది. ఈ భారీ దొంగతనం ఫ్రీ ప్లాన్డ్‌ స్కెచ్చేనని పోలీసులు తెలపడం..నిఘా వ్యవస్తలోని లోపాల్ని బయటపడేలా చేశాయి. సుమారు పది మందికి పైగా దొంగలు ఈ భారీ చోరికి పాల్పడ్డారు. ఈ దొంగతనం చేసేముందు వారు సిసి కెమెరాలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీ చేసిన వెంటనే దొంగలు మాస్క్‌ లేకుండానే ఉడాయించిన విజువల్స్ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయినప్పటికీ నిందితుల వివరాలు పూర్తిగా లభ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే సిసి కెమెరాల పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిసి ఫుటేజి కేసుల పరిష్కరం
సుమారు పది నెలల నుండి సిసి ఫుటేజి దృష్యాల ఆధారంగానే బెజవాడ పోలీసులు కేసులను పరిష్కరిస్తున్నారు. కేసుల పురోగతిలో సిసి కెమెరాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అలాగే ఎక్కడా సాక్ష్యాలు దొరక్క సవాల్‌గా మారిన కేసులను సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగానే పోలీసులు ఛేదించారు. కాని భారీ దోపిడి జరిగిన రోజు మాత్రం నగర పరిధిలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న సిసి కెమెరాలు పని చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బంగారం తయారీ కేంద్రంలో ఉన్న 8 సిసి కెమెరాలు కూడా రెండు నెలలుగా పనిచేయడంలేదని పోలీస్‌కమీషనర్‌ తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న సిసి కెమెరాలు ఏమాత్రం పనిచేసినా కేసులో పురోగతి చాలా సులభంగా లభించి ఉండేదని పలువురు చర్చిస్తున్నారు. టెక్నాలజీ పరంగా కేసును పరిష్కరించాలనుకున్న పోలీసులకు నిందుతులు దొరకడం సవాల్‌గా మారింది. నిందితుల కోసం ప్రత్యేక టీంలు రాష్ట్రాల్లో వేట ప్రారంభించాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. దీంతో డీజీపీ సాంబశివరావు రంగంలోకి దిగారు. త్వరితగతిన కేసును పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ దొంగలను పట్టుకుంటామని విజయవాడ సిపి గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. అయితే ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తే ఘటనకు ముందే దొంగలు సిసి కెమెరాలను పసిగట్టారని, అవి పనిచేయడంలేదని తెలుసుకున్నాకే రాబరీకి పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలు
ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికితోడు అదనంగా మరో 1200 కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర, బంగారు, షాపింగ్‌ మాల్స్‌, భవన సముదాయాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరుని నిరంతరం తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.మొత్తానికి బెజవాడలో జరిగిన భారీ దోపిడి పట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానం ఉండే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.

08:35 - July 14, 2017

కృష్టా : ఏపీలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోతున్నారు. బెజవాడనగరం నడిబొడ్డున భారీ దోపిడీకి పాల్పడ్డం సంచలనంగా మారింది. వరుస చోరీలతో వణికిపోతుంటే.. పోలీసులు మాత్రం దొంగలను వదిలే ప్రసక్తేలేదంటూ పాతడైలాగులే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. 
మారణాయుధాలతో దొంగల హల్‌చల్‌ 
దొంగల భయంతో విజయవాడ జనం వణికిపోతున్నారు. నరగం నడిబొడ్డున ప్రీప్లాన్డ్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఏ అర్థరాత్రో అపరాత్రో  తమపని కానిచ్చే చోరులు.. రాత్రి 9గంటలకే  రెచ్చిపోయారు. విజయవాడ నగరం నడిబొడ్డున మారణాయుధాలు చేతపట్టిన దొంగలు స్వైరవిహారం చేశారు.  పోలీసులకు సవాల్ విసిరారు.  
బెజవాడ చోరీలో ఇంటిదొంగల హస్తం..!
జులై 11వ తేదీ రాత్రి 9గంటలకు  బీసెంట్‌రోడ్‌లో జరిగిన దొంగతనంతో బెజవాడ హడలిపోయింది. నగలతయారీ కేంద్రంలో ఏకంగా 2.5కోట్ల రూపాయల విలువైన  7కిలోల బంగారాన్ని దోపిడీ చేయడం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ  భారీ చోరీపై పోలీలు పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ చోరీలో ఇంటిదొంగల హస్తం కూడా ఉండొచ్చంటున్నారు.  పైగా ఇక్కడ పనిచేసే కార్మికుల్లో చాలా మంది బీహార్‌, బెంగాల్‌ ప్రాంతాలకు చెందినవారు కావడంతో.. ఈపనిచేసింది కచ్చితంగా బీహార్‌ దొంగల గ్యాంగులే అంటున్నారు పోలీసులు. 
రోబరీపై సీఎం చంద్రబాబు ఆరా
మరోవైపు  చోరీ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబుకూడా ఆరాతీశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ డీజీపీ సాంబశివరావు  కేసును  సీరియస్‌గా తీసుకున్నారు.  ఒకేసారి విశాఖపట్నం, కర్నూలు, విజయవాడలో చోరీలు జరగడంపై పోలీసులను అప్రమత్తం చేశారు.  అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్‌కమిషనర్‌ సూచిస్తున్నారు. బంగారం వ్యాపారులు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. 
ఇంటిదొంగలు లేకుండా ఇంత పెద్ద చోరీ ఎలా ..? 
మొత్తానికి ఇంటిదొంగల ప్రమేయం లేకుండా ఇంత పెద్దమొత్తంలో రాబరీ జరగడం అసాధ్యమని నమ్ముతున్న పోలీసులు..
ఆదిశగా విచాఱణ చేపట్టారు. ఇప్పటికే స్పెష్‌టీమ్‌లను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇతరరాష్ట్రాలకు కూడా పోలీస్‌ బృందాలను పంపి దొంగల ఆచూకీ కోసం ప్రత్నిస్తున్నారు. అటు వరుసగా జరుగుతున్న దొంగతనాలతో కంటిమీద కనుకులేకుండా పోయిందని.. నగరంలో నిఘాను మరింత పెంచాలని పోలీసులను కోరుతున్నారు జనం.  

 

20:28 - July 12, 2017

విజయవాడ : ఏపీలో దోపిడి దొంగలు బరితెగించారు. రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖల్లో భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన రెండు దొంగతనాలు.. ప్రజలను ఉలికిపడేలా చేశాయి. మహారాష్ట్రకు చెందిన ముఠాలే ఈ దొంగతనాలు చేసి ఉండొచ్చని.. పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. దుండగులు చేతిలో ఆయుధాలు పట్టుకొని వచ్చి.. నిలువు దోపిడీ చేశారు. జరిగిన హఠాత్పరిణామంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంగారం, డబ్బు దొరికినంతా దోచుకెళ్లడంతో.. దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. 
7 కిలోల నగలను దోచుకెళ్లిన దుండగులు 
విజయవాడలో బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. గవర్నరుపేట, గోపాలరెడ్డి వీధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గోపాలరెడ్డి వీధిలోని ఓ భవనంలో నగలు తయారు చేసే కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇందులో 30 మంది దాకా పని చేస్తుంటారు. వీళ్లంతా బెంగాల్‌కు చెందినవారే. రాత్రి పదిగంటల సమయంలో కార్మికులు నగలు తయారు చేస్తుండగా.. దాదాపు 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో వచ్చి బెదిరించారు. కార్మికులను ఒక చోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు. అక్కడ ఉన్న 7 కిలోల నగలను బ్యాగులోకి సర్ధి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్‌ మన్నా, మరో వర్కర్‌ తేరుకొని వారిని వెంబడించారు. ఇది గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయినా వారు దొరకలేదు. ఈ తతంగాన్ని గమనించిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ బైక్‌పై కారును వెంబడించినా.. ఫలితం లేకుండా పోయింది. 
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు 
సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో.. ఎనిమిది పోలీసు బృందాలు వాహనాలను తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం పోలీసులు  గాలింపు ముమ్మరం చేశారు.  క్లూస్‌, డాగ్‌  స్క్వాడ్లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు హిందీలో మాట్లాడుతుండటంతో.. వాళ్లు మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో వారిని గుర్తు పట్టేలా లేకపోవడంతో.. గుంటూరు ఖాజా వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాడి చేసిన వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల లోపు యువకులేనని కార్ఖానా కార్మికులు చెబుతున్నారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. 
మొత్తం 8 మంది దుండగులు 
విశాఖ నగరం.. దారపాలెంలోనూ సినీఫక్కీలో చోరీ జరిగింది. సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడి ఇంట్లోకి ముఖానికి ముసుగులు వేసుకున్న దుండగులు ప్రవేశించారు. కత్తులు, తుపాకులు చూపించి ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఉన్నదంతా దోచుకెళ్లారు. 20 తులాల బంగారు వస్తువులు పట్టుకుపోయారు. కాళ్లుపట్టుకున్నా దుండగులు వినిపించుకోలేదని సత్యనారాయణ తెలిపాడు.  బాధితుడి ఫిర్యాదుతో అరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కారులో ఎనిమిది మంది దుండగులు వచ్చారని.. వారిలో ఇద్దరు ఇంటి బయట ఉండగా.. ఆరుగురు లోపలకు ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రెండు దొంగతనాలు జనాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన దొంగల ముఠాల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  

 

19:36 - July 12, 2017

కృష్ణా : విజయవాడ దోపిడి ఘటనలో దుండగులు వినియోగించిన... మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును గుంటూరు శివారులో పోలీసులు గుర్తించారు. స్థానిక ఓబులు నాయుడు పాలెం సమీపంలోని కొండల వద్ద దుండగుల ఆనవాళ్లపై సమాచారం రావడంతో... ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. 

 

09:37 - July 12, 2017

విశాఖ : జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారపాలెంలోని ఓ టీచర్‌ ఇంట్లో కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ముసుగులు వేసుకుని వచ్చిన వ్యక్తులు మెడపై కత్తులు పెట్టి బెదిరించి.. బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇంట్లో ఆడవారు ఉండడంతో వారు ఏం చేయాలపోయారు. దీని పై పోలీలసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - theft