TJS

16:37 - November 18, 2018
హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు పేర్లను ప్రకటించారు. సోమవారం నామినేషన్ లకు చివరి రోజు కావడంతో చివరి జాబితాను ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. కానీ కోదండరాం ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. శనివారం ఉదయం పార్టీ కోర్‌ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిన జాబితాను విడుదల చేశారు. వారిలో దిలీప్‌ కుమార్‌ కపిలవాయి (మల్కాజ్‌గిరి), జనార్ధన్‌రెడ్డి (మెదక్‌), చిందం రాజ్‌కుమార్‌ (దుబ్బాక), భవానీరెడ్డి (సిద్దిపేట) ఉన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌ 94, తెదేపా 14, తెజస 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
09:55 - November 17, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలంగాణ జనసమితి నేడు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎనిమిది స్థానాల్లో ఆరు స్థానాలపై క్లారిటీ వచ్చింది. అయితే వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ స్థానాలపై సందిగ్థత కొనసాగుతోంది. మధ్యాహ్నంలోగా ఈ రెండు సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కోదండరాం ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ప్రచారంలో వెనుకబడ్డామని అనేక సార్లు చెప్పిన కోదండారం... టీఆర్ఎస్‌కు ధీటుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

 

14:52 - November 16, 2018

ఢిల్లీ: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో రాహుల్ గాంధీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కోదండరాం జనగాం నుంచి పోటీ నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్  అయ్యింది. ఇక తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేసే కాంగ్రెస్పార్టీ అభ్యర్ధుల 3వ జాబితాను రేపు విడుదల చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా చెప్పారు. మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లు రేపు ప్రకటించనున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సీట్ల సర్దుబాటు విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం జనగామలో పోటీ నుంచి తప్పుకున్నారు. టీజెఎస్కు ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లోని  సనత్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది. ఇంతకు ముందు విడుదల  చేసిన రెండు లిస్టులలో సనత్ నగర్ పేరు ప్రకటించలేదు, ఆనియోజక వర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ  ఆ సీటు చివరకి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలు దేరారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులకు బీఫారంలు పంపిణీ చేస్తుంది.

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

18:38 - November 14, 2018

హైదరాబాద్: మహాకూటమిలో మళ్లీ ముసలం మొదలైంది. తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8 స్థానాల్లో కాకుండా 12స్థానాల్లో తాము పోటీ చేస్తామని కోదండరామ్ ప్రకటించారు. అంతేకాదు ఆయా స్థానాలను కూడా ప్రకటించడంతో.. తాము ప్రకటించిన స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకోవాలని కోదండరామ్ అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. అంతేకాదు జనగామ నుంచి బరిలోకి దిగాలని కోదండరామ్ నిర్ణయించినట్టు సమాచారం. 

టీజేఎస్ ప్రకటించిన 12 స్థానాలు..
నెంబర్ నియోజకవర్గం
1 వర్ధన్నపేట
2 దుబ్బాక
3 మెదక్
4 మల్కాజ్‌గిరి
5 అంబర్‌పేట
6 వరంగల్‌ఈస్ట్
7 సిద్ధిపేట
8 జనగామ
9 మిర్యాలగూడ
10 ఆసిఫాబాద్
11 స్టేషన్‌ఘన్‌పూర్
12 మహబూబ్‌నగర్

 

కాగా ఆసిఫాబాద్ స్థానానికి ఆత్రం సక్కు, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానానికి ఇందిరను తమ అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. అటు మహబూబ్‌నగర్ స్థానానికి తమ అభ్యర్థిగా ఎర్రశేఖర్‌ను టీడీపీ కూడా ప్రకటించింది.

సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటివరకు అంతా సవ్యంగా సాగుతుంది అని అనుకుంటున్న సమయంలో కోదండరామ్ తీసుకున్న నిర్ణయంతో మహాకూటమిలో ఒక్కసారిగా కలకలం రేపింది. అనూహ్యంగా తెలంగాణ జనసమితి రూటు మార్చడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8సీట్లకు టీజేఎస్ అంగీకారం తెలిపింది. అయితే ఆ 8 స్థానాలు ఏవేవి అన్నది ఇంతవరకు కాంగ్రెస్ తేల్చలేదు.

Image result for mahakutami telangana కాంగ్రెస్ చేస్తున్న తీవ్ర జాప్యంతో విసిగిపోయిన టీజేఎస్ ఎదురుతిరిగినట్టు కనిపిస్తోంది. 8 కాదు మొత్తం 12 స్థానాల్లో మేము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించింది. పొత్తులో భాగంగా వర్ధన్నపేట, దుబ్బాక, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, వరంగల్‌ఈస్ట్, సిద్ధిపేట, జనగామ స్థానాలకు టీజేఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగానే ఉంది. అయితే 9వ స్థానంగా మిర్యాలగూడ తమకు కేటాయించాలని టీజేఎస్ ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ స్థానాలు కూడా అదనంగా ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబ్‌నగర్ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం మహాకూటమిలో కలకలం రేపింది. ఈ మూడు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించినా.. ఆ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా టీజేఎస్ చూసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. మహాకూటమి నుంచి జనసమితి బయటకు వస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

15:44 - November 14, 2018

హైదరాబాద్ : జనగామ సీటుపై తేలుస్తారా ? లేదా ? నవంబర్ 14 (బుధవారం) సాయంత్రం నాటికి తేల్చాలంటూ టీజేఎస్...కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు..నామినేషన్ దాఖలు కూడా ప్రారంభమైనా మహాకూటమి సీట్ల విషయంలో సర్దుబాటు కావడం లేదు. కాంగ్రెస్ 75 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్, టీటీడీపీ, సీపీఐ అడుగుతున్న సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ వైఖరిపై ప్రధానంగా టీజేఎస్ గుర్రుగా ఉంటోంది. జనగామ సీటుపై కాంగ్రెస్ ఎటూ తేల్చడం లేదు. ఇక్కడి నుండి బరిలో నిలవలాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల యోచిస్తుండగా ఈ సీటును తమకే కేటాయించాలని టీజేఎస్ పట్టుబడుతోంది. ఏమి చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. 
దీనిపై టీజేఎస్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. మూడు స్థానాల విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ సూచించింది. వరంగల్ తూర్పు విషయంలో ఎలాంటి మార్పు ఉండవద్దని కాంగ్రెస్‌ని కోరింది. టీజేఎస్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ స్పందిస్తుందా ? తలగ్గొతుందా ? లేదా ? అనేది చూడాలి. 

21:11 - November 13, 2018

హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు(టీజేఎస్) కోదండరామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ఆయన విరమించుకున్నారు. బీసీలకు అన్యాయం చేయకూడదని భావించి జనగామ స్థానం నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య సీటును తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని టీజేఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో కోదండరామ్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 12వ తేదీన కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. అధిష్టానంతో చర్చలకు పొన్నాల సైతం ఢిల్లీ వెళ్లారు.
టీజేఎస్‌కు 11 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నామని, ఇప్పటికైతే తమకు 6 స్థానాలపై స్పష్టత ఉందని కోదండరామ్ చెప్పారు. మల్కాజ్‌గిరి, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్‌పేట స్థానాలపై స్పష్టత వచ్చిందన్నారు. మరికొన్ని స్థానాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని, తాము పోటీ చేసే అన్ని స్థానాలపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తానని కోదండరామ్ పేర్కొన్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సీటు తమ పార్టీకి కేటాయించాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇక జనగామ బదులు మేడ్చల్ లేదా మిర్యాలగూడ ఇవ్వాలని టీజేఎస్ అడుగుతోంది.

17:24 - November 12, 2018

హైదరాబాద్ : కోదండరాం కాంగ్రెస్,  చంద్రబాబు మాయలో పడిపోయారని..ఉద్యమ సమయంలో కోదండరాంను తాము కంటికి రెప్పలా కాపాడుకున్నామనీ..కాంగ్రెస్ నుండి కాపాడుకున్నామని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ సాధించేంత వరకు కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, చంద్రబాబు ఎంత అవమానపరిచాడో ఆయన మరిచిపోయిన ప్రజలు మరిచిపోరు. వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్ అంటూ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లను టీజేఎస్‌కు అంటకడుతోందన్నారు. కోదండరాం నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించుకుంటామని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 

ఆనాడు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు చేసింది. కాంగ్రెస్ నాయకులు నాడు చెరుకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. కూటమి ఏ ఉద్దేశంతో ఏర్పాటైందో స్పష్టత ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు టీఆర్‌ఎస్ అండగా నిలిచింది. ఆనాడు ఉస్మానియా విద్యార్థులపై కేసులు పెట్టింది కాంగ్రెస్ అయితే.. బెయిల్ ఇప్పించింది టీఆర్‌ఎస్ అని గుర్తు చేశారు.

16:55 - November 12, 2018

హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్‌పై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. నాడు తెలంగాణ ఉద్యోగులను, ఉద్యమకారులను రాచి రంపానపెట్టిన కాంగ్రెస్, తెలంగాణ ద్రోహి అయిన టీడీపీలతో కోదండరామ్ ఎలా పొత్తుపెట్టుకుంటారని హరీష్ ప్రశ్నించారు. ఆ సమయంలో కోదండరామ్‌కు రక్షణ కవచంలా నిలిచింది టీఆర్ఎస్సేనని గుర్తు చేశారు.  నాడు ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే, ఆ విద్యార్థులకు బెయిల్ ఇప్పించింది టీఆర్ఎస్ అని గుర్తుచేశారు. ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర టీఆర్ఎస్‌దేనని హరీష్ వ్యాఖ్యానించారు. పలువురు టీజేఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. సార్‌పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీలతో టీజేఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ సమాజం హర్షించడం లేదన్నారు. అమరావతి, ఢిల్లీకి కోదండరామ్ గులాంగిరి చేస్తున్నారని హరీష్‌ మండిపడ్డారు. గాంధీభవన్ ముందు నాలుగు సీట్ల కోసం పొర్లు దండాలు పెట్టారని విమర్శించారు. కోదండరామ్‌ను గతంలో కాంగ్రెస్ విమర్శించిందని, తెలంగాణ కోసం పోరాడితే టీడీపీ వాళ్లు దాడుల చేశారని హరీష్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కలిసినందుకు కోదండరామ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అసలు కూటమి లక్ష్యం ఏమిటో కోదండరామ్ ప్రజలకు చెప్పాలన్నారు. 2014లో కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిన కోదండరామ్.. ఇప్పుడు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు.
టీజేఎస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న నేతలు మంచి పని చేస్తున్నారని, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని హరీష్ అన్నారు. టీఆర్ఎస్ విజయానికి అందరం కష్టపడి పనిచేద్దామని, వంద సీట్లు సాధించి మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

08:55 - November 10, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో సర్వేల హడావిడి పెరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధించి మరోసారి సీఎం అవుతారని పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (పీఎస్‌ఈ)’ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో సర్వే వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో మహాకూటమి గెలుపు ఖాయమని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసి వచ్చిందని సర్వే అభిప్రాయపడింది. విజయంపై ఆశలు పెట్టుకున్న కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఈసారి పరాజయం తప్పదని పేర్కొంది.

సంబంధిత చిత్రంకాగా టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న్ మహాకూటమి సెప్టెంబరులో ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జనసమితి(టీజేఎస్)తో పాటు మరో చిన్న పార్టీ అయిన ఇంటిపార్టీ కూడా వచ్చి చేరింది. కూటమి ఏర్పడడానికి ముందు విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం కూటమితో ఆ ధీమా కనుమరుగైపోయిందనీ ఈ సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ టీవీ కోసం నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్-టీడీపీ కూటమి 64 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీఆర్ఎస్ 42 స్థానాలకే పరిమితమవుతుందని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేలింది. బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. 

కాగా గత ఎన్నికలు అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పడిపోతుందని సర్వే స్పష్టం చేసింది. మహాకూటమికి 33.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, టీఆర్ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో జానారెడ్డి ఉన్నారు. ఆయన సీఎం కావాలని 22.6 శాతం మంది కోరుకున్నారు. మరి ఈ సర్వేలలో ఏది వాస్తవం? ఏది అవాస్తవం అనే విషయం ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తేలనుంది.
తెలంగాణ, ఎన్నికలు, టీఆర్ఎస్, కేసీఆర్, మహాకూటమి, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, గెలుపు, ఏబీపీ-సి ఓటర్ సర్వే , 

Pages

Don't Miss

Subscribe to RSS - TJS