tollywood

09:53 - June 24, 2017

చెన్నై : నటుడు భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్ సినిమా 2004లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రంలో నటించిన ఓ నటుడు ఎప్పుడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాదల్ సినిమాలో చిన్న వేషం వేసిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేసుకుంటూ జీవవనం గడుపుతున్నాడు. ఆ సినిమాలో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్సన్ లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు. అందులో విరుచ్చికాంత్ అనే పేరను పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే మాటలు బాగా ప్రచుర్యం అయ్యాయి. కానీ అతను మాత్రం పపులర్ కాలేపోయాడు. కాదల్ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికి కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. 

08:44 - June 24, 2017

సినిమా : రాజకీయాల తర్వాత తిరిగి సినిమాలో వచ్చి ఖైదీ నంబర్ 150తో దుమ్మురేపారు. తెలుగు సినిమా కలెక్షన్లను 100 కోట్ల మార్క్ దాటించడం సాధ్యమే అని చాటారు మెగా స్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన 151 చిత్రం మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుడంగా...త్వరలో గ్రాండ్ గా మూవీ లాంఛింగ్ చేసుకునేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంబంధంచి క్యాస్టింగ్ ను దాదాపు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథనాయకుని పాత్రకు ఇద్దరు భార్యలు ఉంటారని...మరో మహిళతో సన్నిహిత సంబంధాలు ఉంటాయని సమాచారం. ఈ పాత్రల కోసం ముగ్గురు భామలను ఎంచుకున్నారట వారు బాలివుడ్ నటి ఐశ్వర్యా రాయ్...మరో భామ టాలీవుడ్ స్వీటీ అనుష్కతో పాటు దక్షణాదిలో మంచి పేరున్న నయన తార. ఇప్పటికే వీరితో చర్చోపర్చలు జరుగుతున్నట్టు సినీ వర్గాల సమాచారం. మూవీ లాంఛింగ్ టైంలోనే వీరి పేర్లు అనౌన్స్ చేస్తారట. 

13:28 - June 19, 2017

కాజల్ అగర్వాల్...తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ప్రధాన స్టార్స్ తో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన నటన..అభినయం..ఆకట్టుకొనే అందంతో మెప్పిస్తోంది. జులై 19వ తేదీ ఆమె పుట్టిన రోజు.. తనకు స్పెషల్ డే అంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు చలన చిత్ర సీమకు ఈమెను పరిచయం చేసింది 'తేజ'.. ‘లక్ష్మీ కళ్యాణం' చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. మళ్లీ ఈ అమ్ముడు 'తేజ' దర్శకత్వంలోనే సినిమా చేస్తోంది. దాదాపు పదేళ్ల తరువాత 'తేజ' దర్శకత్వంలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని..అంతేగాకుండా తనకు ఈ చిత్రం 50వది కావడం విశేషమని 'కాజల్' పేర్కొంటోంది. ‘రానా' హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' 'తేజ' దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ఇందులో 'రానా' సరసన 'కాజల్' నటిస్తోంది. ఈ చిత్రంలో తాను రాధ అనే పాత్ర పోషిస్తున్నట్లు, తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని ‘కాజల్’ పేర్కొన్నారు. ‘రానా’ తో కలిసి పనిచేయడం సరదాగా ఉంటుందని, తన పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అని 'కాజల్' పేర్కొన్నారు.

13:18 - June 19, 2017

64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ కు నటీనటులు రావడంతో సెంటర్ సందడిగా మారిపోయింది. ఇక అవార్డుల విషయానికి వస్తే...
టాలీవుడ్‌ నుంచి ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్‌ (నాన్నకు ప్రేమతో), ఉత్తమ నటిగా సమంత (అ..ఆ)లు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
ఉత్తమ చిత్రం- పెళ్లి చూపులు, ఉత్తమ దర్శకుడు, వంశీ పైడిపల్లి (ఊపిరి), ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (నాన్నకు ప్రేమతో), ఉత్తమ సహాయ నటి- నందితా శ్వేతా (ఎక్కడికి పోతావు చిన్నవాడా), ఉత్తమ నేపథ్య గాయకుడు - కార్తిక్‌ (అ..ఆ-వెల్లిపోకే శ్యామల..), ఉత్తమ నేపథ్య గాయని - చిత్ర (నేను శైలజ-ఈ ప్రేమకీ..), ఉత్తమ గేయ రచయిత - రామజోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్‌), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ : దేవిశ్రీ ప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో) , ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ అవార్డు (నటుడు) - అల్లు అర్జున్‌ (సరైనోడు), ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ అవార్డు (నటి) - రీతూ వర్మ (పెళ్లి చూపులు), బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌(ఉపిరి), జీవిత కాల సాఫల్య పురస్కారం-విజయనిర్మల అవార్డులను తీసుకున్నారు.

10:39 - June 17, 2017

 

            మీరు విన్నది నిజమే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని రెండో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమయ్యింది. సాధారణంగా హీరో హీరోయిన్ మూవీ కాస్టింగ్ ను ముందే అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా హీరోయిన్ పేరును ఇప్పటి వరకు వెల్లడించలేదు. మొదట్లో మేఘా ఆకాష్, అనుపమా పరమేశ్వరన్ ల పేర్లు వినిపించినప్పటికీ వారు ఈ సినిమాలో లేరని స్వయంగా అక్కినేని నాగార్జున చెప్పేశారు. దీంతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమయ్యింది కానీ హీరోయిన్ ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. 
           యితే ఈ సినిమా హైప్ పెంచేందుకోసమే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల ఒక సినిమాకి చివరి క్షణం వరకు హీరో ఫేస్ చూపించకుండా ప్రచారం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ పేరు కూడా చివరి వరకూ ప్రకటించరా అనే అనుమానం రాకమానదు. అయితే హీరోయిన్ ను ఇప్పుడే చూపించకుండా.. ఆమె షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటినుంచి ప్రచారంలోకి తేవాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ అనౌన్స్ మెంట్ కోసం ఇంత హంగామా చేస్తున్నారంటే ఓ పేరుమోసిన స్టార్ కూతురును ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

11:51 - June 15, 2017

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోల కుమారులు..కుమార్తెలు వెండి తెరకు పరిచయం అయ్యేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తల్లిదండ్రుల గ్రీన్ సిగ్నల్ తో వారు పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుండి పలువురు అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ పోలీసు ఆఫీసర్ పాత్రకు జీవం పోసే నటుడు అనిపించుకున్న 'రాజశేఖర్' కుమార్తెలు వెండి తెరకు పరిచయ్యేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. రాజశేకర్..జీవిత దంపతులు తెలుగు..తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరికి శివాని..శివాత్మిక కూతుర్లున్నారు. వీరిలో 'శివాని' తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా వివరాలను శివాని మీడియాకు వెల్లడించనున్నట్లు టాక్. సినిమాల కోసం భరత నాట్యం..కూచిపూడి..గిటార్, వీణలను నేర్చుకున్నట్లు సమాచారం. ఇక శివాని సోదరి శివాత్మిక కూడా సినిమాల్లో రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

10:57 - June 15, 2017

అల్లు అర్జున్..కొత్త సినిమా స్టార్ట్ చేశాడో లేదో..అప్పుడే సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర అంశాలతో పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘బన్నీ' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ నెలలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదిలా ఉంటే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు 'బన్నీ' ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ షూటింగ్ ప్రారంభోత్స కార్యక్రమంలో 'అల్లు' కుటంబం..నాగబాబు తదితరులు హాజరయ్యారు. అనంతరం చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. 'నా పేరు సూర్య' టైటిల్ నిర్ణయించగా 'నా ఇల్లు ఇండియా' అనేది ట్యాగ్ లైన్ నిర్ణయించారు. ఇక ఇందులో తమిళ నటుడు 'శరత్ కుమార్' కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు. అదే నిజమైతే చాలాకాలం తరువాత ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయకపోయినా కథానాయికగా 'రష్మిక మందన'ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. జులై మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగనుంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

16:23 - June 14, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్ తేజ' తన తాజా చిత్రం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘రంగస్థలం 1985’ అంటూ ఇటీవలే ప్రకటించారు. షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని 'చెర్రీ' భావిస్తున్నాడు. అందుకనుగుణంగా ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందుకని పెళ్లి రోజుకు కూడా బ్రేక్ తీసుకోలేదు. దీనితో ఆయన సతీమణి 'ఉపాసన' రాజమండ్రికి వెళ్లారు. 'మిస్టర్ అండ్ మిసెస్ సి'కి ఐదేళ్లు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్, ప్రేమ కారణంగా ఇన్ని రోజులు ఇంత అద్భుతంగా గడిచాయి.' అంటూ తమ శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసింది ఉపాసన.

15:23 - June 14, 2017

తాను సినిమాల నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించిన 'మంచు మనోజ్' ఇండస్ట్రీకి..అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈయన చేసిన పోస్టు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోయింది. త్వరలోనే 'మంచు మనోజ్' రాజకీయాల్లో వస్తాడని..ఇతరత్రా వాటిపై చర్చ జరిగిపోయింది. వీటన్నింటికీ కాసేపటి క్రితం 'మంచు మనోజ్' తెరదించాడు. పోస్టు డిలీట్ చేసి మరో పోస్టు పెట్టారు. తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించాలని పోస్టులో పేర్కొన్నారు. మీడియా డార్లింగ్స్ నుండి ఇంత అనూహ్యంగా స్పందన వస్తుందని అనుకోలేదని, తన పోస్టును రకరకాలుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. చేయబోయే కొత్త సినిమా గురించి తన స్టైల్ లో ప్రకటించాలని అనుకున్నట్లు, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని తెలిపారు. కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలి..ఓం శాంతి అంటూ పోస్టులో 'మంచు మనోజ్' పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో కథ సాగనుందని..'మనోజ్' ఎల్టీటీఈ కమాండర్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. 'మ‌నోజ్' ఈ మూవీలో స్టూడెంట్ గా కూడా క‌నిపించ‌నున్నారు. సినిమా టీజ‌ర్ ను సాయంత్రం 4.15కి చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుంది.

 

14:53 - June 13, 2017

హైదరాబాద్: దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాపై సినిమాపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు, పాటలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అధికారులను కలిసి బ్రాహ్మన్‌ యూనిటి ఫర్‌ ఎవర్‌ సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దర్శకుడు, నిర్మాత దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సినిమాలో అభ్యంతరకర పదాలు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - tollywood