Tollywood Hero

16:30 - May 17, 2018

ప్రస్తుతం సినిమా పరిశ్రమ బయోపిక్ లతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి బయోపిక్ లు. ప్రస్తుతం 'మహానటి' కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇంకా బైటకు రాకపోయినా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆన్ ద వే లో వుంది. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇపుపడు తాజాగా మరో నటుడి బయోపిక్ తెరమీదకు రాబోతోందంటు సిని పరిశ్రమలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మిల్క్ బోయ్ గా పేరొందిని యువ నటుడు,అంచెలంచెలుగా ఎదిగి..యూత్ లోమంచి క్రేజ్ సంపాదించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆత్మహత్య చేసుకుని మరణించిన ఉదయ్ కిరణ్
తెలుగు తెరపై హీరోగా ఉదయ్ కిరణ్ అంచెలంచలుగా ఎదిగాడు. యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురుకావడం .. అవకాశాలు తగ్గడం జరిగాయి. కారణమేదైనా కొంతకాలం క్రితం ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ ను రూపొందించే దిశగా దర్శకుడు తేజ ప్రయత్నాలు మొదలెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

తేజా దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ సినిమా..
ఉదయ్ కిరణ్ ను 'చిత్రం' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసింది తేజానే. అందువలన ఈ బయోపిక్ విషయంలో నిజం వుండే అవకాశమే ఎక్కువని చెప్పుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత 'మస్కట్' లో వుండే ఆయన సోదరి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆయనకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ కొన్ని విషయాలు ప్రస్తావించింది. అవన్నీ కూడా ఈ బయోపిక్ లో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రముఖ నటుడు, మాజీ సీఎం అయిన ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వ బాధ్యతలు ఒప్పుకుని కొన్ని కారణాలతో ఆ సినిమా నుండి తప్పుకున్న తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తాడనే వార్తల్లో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే. 

18:47 - February 9, 2018

మెగా స్టార్ మేనాల్లుడు సాయి ధరంతేజ్ హీరోగా వీ.వీ. వినాయక్ దర్శకత్వంలో వచ్చి మూవీ ఇంటలిజెంట్ ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి చేశారు. ఇక కథ విషయానికొస్తే...

చిన్నతనం నుంచి తన ఇంటిజెన్స్ తో చిన్న చిన్న సమస్యలను పరిష్కారిస్తూ ఇంటలిజెంట్ అనిపించుకుంటాడు తేజ. అలాంటి ఇంటలిజెంట్ పెరిగి పెద్దైయ్యాక సాప్ట్ వేర్ ఎప్లాయి అవుతాడు. అయితే సాప్ట్ వేర్ తో పాటు అన్ని రంగాల్లో భయాన్ని క్రియోట్ చేస్తూ ఆస్తులను ఆక్రమించుకుంటున్న విక్కీ భాయ్ తేజ పని చేస్తున్న కపెంనీ ఓనర్ నందకిషోర్ ను బెదిరించి కంపెనీని తనకు హాండోవార్ చేయాని బెదిరిస్తాడు. అందుకు నంద కిషోర్ విక్కీ భాయ్ మాటలను తిరస్కరించడంతో బలవంతంగా ఆ కంపెనీని తన పేరునా రాయించుకొని నందకిషోర్ ను చంపేస్తాడు. అప్పుడు తేజ తన ఇంటిజెన్స్ తో తను పనిచేస్తున్న కంపెనీని తిరిగి ఎలా దక్కించుకున్నాడు. విక్కీ భాయ్ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే....

12:30 - January 5, 2018

డైలాగ్ కింగ్ మోహన బాబు తనయుడు విష్ణు సతిమణి విరోనికా జనవరి 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. విష్ణు, మనోజ్ తర్వాత వారి వంశంలో పుట్టిన మొదటి బిడ్డ కావడంతో వారి ఇల్లు సంబురాలతో నిండింది. బుధవారం పుట్టిన బాబుకు నామకరణం చేశారు. బాబు పేరు అవ్రామ్ భక్త గా పేరు పెట్టారు. ఈ పేరులో ఓ విషయం ఉంది. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఆ పేరులో భక్త అని బాబు పెట్టారు.

13:42 - December 31, 2017

సినీనటి భూమికతో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన సినీ కెరీర్ గురించి వివరించారు. ఆమె తెలిపిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం.. 

16:20 - November 22, 2017

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు వరసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం, స్రైడర్ నిశరాశపరిచిన ఆయనకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. మహేశ్ తాజాగా మాస్ డైరెక్టర్ వినాయక్ తో సినిమా తీయడానికి ఒప్పుకున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత 25వ సినిమాను వంశీ పైడిపల్లి చేయనున్నాడు. 26వ సినిమాగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక వినాయక్ విషయానికొస్తే మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 1 తో హిట్ కొట్టి ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. చూద్దాం మరి వినాయక్, మహేశ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో..?

16:18 - June 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మళ్లీ అమెరికాకు పయనం కానున్నారా ? ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తమిళ రాజకీయాల్లోకి 'రజనీ' ఎంట్రీ ఉంటుందని...అభిమానులతో కూడా 'రజనీ' భేటీ కావడం రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన 'రోబో 2.0'..'కాలా' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. 'కబాలి' చిత్ర సమయంలో 'రజనీ' అమెరికాలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ 'రజనీ' అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 'కాలా' సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న 'రజనీ' అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిజాలు ఏంటో 'రజనీ' స్వయంగా..లేదా ఆయన కుటుంబసభ్యులు నోరు మెదిపితే కాని తెలియదు.

15:59 - June 30, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్'..ప్రముఖ దర్శకుడు 'సుకుమార్' కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఆర్ట్ సినిమాల ఉంటుందని..చిత్రం సామాన్య ప్రేక్షకుకుడికి రీచ్ అవుతుందా ? అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఎక్కువ శాతం షూటింగ్ కొనసాగుతోంది. 'రామ్ చరణ్' సరసన 'సమంత' నటిస్తోంది. గుబురు గడ్డంతో లుంగీతో కనిపించే చరణ్ ఒక పేదింటి అబ్బాయి అని ప్రచారం జరుగుతోంది. పల్లెటూరి అమ్మాయిలా ఈ సినిమాలో కనిపిస్తున్న 'సమంత' డబ్బున్న మారాజు కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించబోతోందని టాక్. వీరి మధ్యన జరిగే ప్రేమ...1985 నాటి పరిస్థితుల నేపథ్యంలో కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ మాత్రం సినిమాను చాలా డిఫరెంటింగ్ గా తీస్తున్నారని టాక్. చరణ్ కెరియర్ లో 'రంగస్థలం' ఎలాంటి ఫలితం ఇవ్వనుందో రానున్న రోజుల్లో తెలియనుంది.

Don't Miss

Subscribe to RSS - Tollywood Hero