tollywood movies

16:29 - September 13, 2017

నెల్లూరు : అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే స్వల్ప అస్వస్థతకు గురైంది. నెల్లూరులో ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరైన షాలిని అస్వస్థతకు గురవడంతో బోలినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

 

12:04 - August 30, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఈ చిత్రం ఆకర్షిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర మూడు పాత్రలకు సంబంధించిన ఫొటోలు..టీజర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆయా టీజర్స్ వేటికవే భిన్నంగా ఉన్నాయి.

‘జై' పాత్ర మాస్, ‘లవ' పాత్ర క్లాస్ గా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న ‘కుశ' కు సంబంధించిన ఫొటో విడుదల చేశారు. ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రత్యేక గీతం ఉంటుందని..అందులో మిల్క్ బ్యూటీ 'తమన్నా' నర్తించనుందని ప్రచారం జరుగుతోంది. 'తమన్నా' కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాల టాక్. 'తమన్నా' ఇప్పటికే 'జాగ్వార్‌', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడిన సంగతి తెలిసలిందే. గతంలో 'ఎన్టీఆర్‌', 'తమన్నా' జంటగా వచ్చిన 'ఊసరవెల్లి' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ నెలాఖరున 'కుశ' టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

12:49 - August 18, 2017

అజిత్ చిత్రం వివేగం రిలీజ్ కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్ర ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు ట్రైలర్‌ సాగింది. 
నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది.. అంటూ అజిత్‌ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ట్రైలర్ లో రోమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. అజిత్ సరసన కాజల్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించడం విశేషం. 24వ తేదీన విడుదలవుతున్న సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా 

19:39 - August 11, 2017

ఈ రోజు విడుదలైన మరో మూవీ నేనే రాజు నేనే మంత్రి సీనియర్ డైరక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ ఎంటటైనర్ నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో రానా హీరోగా గజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రివ్యూ కోసం వీడియో చూడండి.

19:38 - August 11, 2017

ఈ రోజు విడుదలైన్ మరో మూవీ లై అనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ ఎంటటైనర్ ఈ లై మూవీ. నితిన్ మేఘ ఆకాశ్ జంటగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ అర్జున్ విలన్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాలో పాటలతో పాటు ఆర్ఆర్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ మూవీ సంగీతం మణిశర్మ అందించారు. ఈ మూవీ టెన్ టివి రివ్యూ కోసం వీడియ్ క్లిక్ చేయండి.

10:56 - August 9, 2017

హైదరాబాద్ : ప్రిన్స్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా స్పైడర్‌ టీజర్‌ను విడుదల చేశారు. మహేష్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. 

 

16:21 - August 8, 2017

ప్రిన్స్ 'మహేశ్ బాబు'..'మురుగదాస్' కాంబినేషన్ లో నిర్మితమౌతున్న 'స్పైడర్' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన టీజర్స్..పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. రా ఏజెంట్ గా కనిపించబోతున్న 'మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటించింది.

రా ఏజెంట్ గా నటిస్తున్న 'మహేష్ బాబు' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా చిత్ర మొదటి సాంగ్‌ 'బూమ్‌ బూమ్‌..పల్లవితో సాగేదాన్ని విడుదల చేశారు. అంతేగాకుండా మరో టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఆగస్టు 9న 'మహేష్‌' పుట్టిన రోజున స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని మురుగదాస్ ప్లాన్స్ వేశారు. మరి విడుదలయ్యే టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

11:16 - July 24, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. మరుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. చిత్రం సెట్ పై ఉండగానే 'మహేష్' మరో సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో 'మహేష్' నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ టైటిల్ ను పెట్టారు.

రాజకీయ ప్రధానంగా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో 'మహేష్ బాబు' ముఖ్యమంత్రి పాత్రలో సందడి చేయనున్నాడని టాక్. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమ నేపథ్యంలో 'మహేష్'..ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీమంతుడు' తరువాత 'మహేష్' - ‘కొరటాల' కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను 'మహేష్' జన్మదినమైన ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో 'మహేష్' సరసన 'కైరా అడ్వాణీ' హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 'భరత్ అనే నేను' సినిమాను విడుదల చేయనున్నారు.

16:11 - July 11, 2017

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు ? విలన్ ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే వీటిపై తెగ గాసిప్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు దశబ్దకాలం పాటు సినిమాకు దూరంగా ఉన్న 'చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151వ సినిమాపై దృష్టి నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో 'చిరంజీవి' పవర్ పుల్ పాత్రలో నటించనున్నారని టాక్. కొణిదెల ప్రొడక్షన్ పై 'రామ్ చరణ్' చిత్రాన్ని నిర్మించనున్నారు. 'చిరు' 151వ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు రామ్ చరణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 'చిరంజీవి' సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ నటింప చేయాలని తొలుత అనుకున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ ల పేర్లు వినిపించాయి. టాలీవుడ్ లో అనుష్క..కాజల్..ఇతర హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా 'నయనతార' ఎంపిక చేసినట్లు తాజాగా వినిపిస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

14:48 - July 11, 2017

టాలీవుడ్ లో విలన్ లు హీరోలవుతున్నారు..హీరోలు విలన్ లు అవుతున్నారు. ఇటీవలీ కాలంలో విలన్ ను స్టైలిష్ గా చూపిస్తూ..కొత్తదనం క్రియేట్ చేస్తున్నారు. స్టైలిష్ విలన్ గా 'జగపతి బాబు' పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీనితో కొంతమంది విలన్ గా నటించేందుకు ముందుకొస్తున్నారు. పోలీసు పాత్రలకు న్యాయం చేసే నటుల్లో 'రాజశేఖర్' ఒకరు. ఆయన తొలుత విలన్ పాత్రలు పోషించి..హీరో అయిన సంగతి తెలిసందే. ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలు డిజాస్టర్ అవుతుండడంతో విలన్ పాత్రలపై వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా భారీ బడ్జెట్ తో 'గరుడ వేగ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను 'రాజశేఖర్' వెల్లడించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
'రామ్ చరణ్' నటించిన 'ధృవ' సినిమాలో విలన్ గా తానే నటించాల్సి ఉందని..కానీ 'అరవింద్ స్వామి'తో నటింప చేశారని పేర్కొన్నారని కథనాల సారాంశం. తాజాగా 'బాలకృష్ణ'..102వ సినిమాలో కూడా విలన్ గా నటించాలని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు..కానీ ఆ విలన్ పాత్ర రోటీన్ గా ఉండడంతో తాను ఒప్పుకోలేదని ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది. మంచి కథ..విలన్ పాత్ర వస్తే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని 'రాజశేఖర్' పేర్కొన్నట్లు టాక్. మరి ఆయన విలన్ గా చూపించడానికి ఏ దర్శకులు ప్రయత్నిస్తారో వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - tollywood movies