Tollywood Updates

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:10 - October 10, 2017

కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో సంక్రాతికి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ 102వ సినిమా పేరు 'కర్ణ' అనే టైటిల్ దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఆ చిత్ర యూనిట్ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు కుంభకోణం‌లో ఇటీవల మేజర్ షెడ్యూల్ జరగ్గా.. ఇపుడు హైదరాబాద్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్‌ చేస్తున్నారట.ఈ ప్రాజెక్టుకి ‘కర్ణ’ అనే తొలుత జయసింహ, రెడ్డిగారు లాంటి టైటిల్స్ అనుకున్నా స్టోరీకి తగ్గట్టుగా కర్ణ అయితే బాగుంటుందని యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్‌కు ఆకట్టుకునేలా స్టోరీ వుంటుందని యూనిట్ టాక్ మాట. నయనతార, నటాషా, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, మురళీ‌మోహన్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 

10:38 - August 28, 2017

వికెఎ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం "ఇగో". విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ను గోదావరి పరిసర ప్రాంతాల్లో తీయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "ఇగో" రెండు షెడ్యూల్స్ పూర్తయ్యిందని తెలిపారు. . భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుందన్నారు. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.. ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వి, గౌతంరాజు, షకలక శంకర్, చంద్ర, వేణు, శివన్నారాయణ, భద్రం, రైజింగ్ రాజు, గుండు మురళిలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, ఆర్ట్: ఆర్.కె, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, నిర్మాతలు: విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్, రచన-దర్శకత్వం: సుబ్రమణ్యం. 

12:06 - August 2, 2017

మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన 'వరుణ్ తేజ్' మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన సినిమా 'ఫిదా'పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తెలంగాణ భాష..నిజామాబాద్ లోని బాన్సువాడ ప్రాంతాన్ని అందంగా తెరకెక్కించిన తీరు..చిత్రంలో నటీ నటుల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన విధానం, సాయి పల్లవి యాక్టింగ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవిల మధ్య సన్నివేశాలు, సంగీతం ఇలా అన్ని అంశాలు అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.

తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న 'వరుణ్ తేజ్' రికార్డుల వేట మొదలు పెట్టాడనే చెప్పవచ్చు. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసినట్లు..ఓవర్సీస్ లో రూ. 1.62 మిలియన్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రూ. 2మిలియన్ మార్క్ సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ 'చిరంజీవి' నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రూ. 2.45 మిలియన్ల వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' సినిమాతో 'పవన్ కళ్యాణ్' 1.90 మిలియన్లు సాధించాడు. ఈ వారాంతానికే 'పవన్' కలెక్షన్లను 'వరుణ్' దాటేస్తాడని భావిస్తున్నారు. చూడాలి మరి..

11:41 - July 28, 2017

కెరియర్ మొదలు పెట్టిన దగ్గర వంద సినిమాలు పూర్తి చేసుకుని.. వరుస విజయాలతో ఆయన తన దూకుడు చూపిస్తూనే వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ, ఆ మధ్య 'నర్తనశాల' రీమేక్ తో నిర్మాతగా మారాలని చూశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ సినిమా చేస్తున్న బాలయ్య.. 102వ సినిమాను తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌తో చేయనున్నారు. కాగా, బాలయ్య గురించి తాజాగా ఓ గ్యాసిప్‌ పుట్టుకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్న బాలయ్య త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నారన్నదే ఆ గ్యాసిప్‌. తెలుగులో ప్రస్తుతం చాలా మంది స్టార్‌ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అయితే బాలయ్య మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ సినిమా నిర్మాణం జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం తనకు బాగా సన్నిహితుడైన మరో నిర్మాతతో కలిసి బాలయ్య సినిమాలు నిర్మించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్యానర్‌లో తొలి సినిమా మోక్షజ్ఞదే ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

11:13 - July 26, 2017

రకుల్ రిక్షా తొక్కడం ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా హీరోయిన్లు ఏం చేసినా అది న్యూస్ హెడ్ లైన్ గా మారిపోతోంది. ప్రస్తుతం తమిళ సినిమా ధీరన్ అధికరం ఒండ్రు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో రకుల్ రిక్షా తొక్కే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ కోసం కార్తీ హీరోగా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతోంది.

17:23 - July 25, 2017

మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి వెండితెరకు పరిచయమై బిజీ బిజీగా మారిపోతున్నారు. అందులో మెగా స్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' ఒకరు. ఇప్పటికే యువతో ఎంతో క్రేజ్ తెచ్చుకుని తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న నటుల్లో 'పవన్ కళ్యాణ్' ఒకరు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

సుకుమార్ దర్వకత్వంలో 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉండనుందంట. ఈ సినిమాలో 'రామ్ చరణ్' వైవిధ్యమైన పాత్రను పోషించనున్నారని..పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇందులో 'చెర్రీ' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా భారీ సెట్టింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ నవంబర్ బరిలో నిలిచిన 'పవన్'..’త్రివిక్రమ్' సినిమా సంక్రాంతికి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ‘పవన్ కళ్యాణ్' సైతం వేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇతర సినిమాలకు సైతం సైన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్..పవన్ యోచిస్తున్నట్లు టాక్.

మరి సంక్రాంతి బరిలో 'రామ్ చరణ్' నిలుస్తారా ? బాబాయ్ 'పవన్ కళ్యాణ్' సినిమాతో ముందే రిలీజ్ చేయాలని 'చెర్రీ' నిర్ణయిస్తారా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.

12:43 - June 20, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఏదైనా చిత్రంలో నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. అంతేగాకుండా భారీ స్థాయిలో మార్కెటింగ్ జరుగుతుందనేది తెలిసిందే. ‘కాటమరాయుడు' చిత్రం అనంతరం 'పవన్' పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అంతేగాకుండా పలు చిత్రాలను ఒప్పుకున్నట్లు..ఈ చిత్రాలను అత్యంత వేగంగా కంప్లీట్ చేయాలని 'పవన్' యోచిస్తున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించబోయే చిత్రంలోనే కాకుండా మరో చిత్రంలో నటించేందుకు 'పవన్' అంగీకరించినట్లు తెలుస్తోంది. 'హైపర్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని..తమిళంలో 'విజయ్' నటించిన 'పోలీస్' చిత్రాన్ని రీమెక్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరోమారు పవర్‌ఫుల్‌ పోలీస్‌గా 'పవన్' కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ‘పవన్’ ఏకంగా పారితోషకం రూ. 40 కోట్లు తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

13:24 - June 12, 2017

టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన 'అక్కినేని నాగార్జున' ‘అమల' వివాహ బంధానికి 25 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా 'నాగార్జున' తమ పెళ్లి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ..నేటికి 25 ఏండ్లు అవుతోంది..అని పేర్కొన్నారు. 1987లో 'కిరాయిదాదా' చిత్రంలో నాగార్జున, అమలలు నటించారు. తరువాత 'చిన్నబాబు'..’శివ'..’ప్రేమ యుద్ధం'..’నిర్ణయం'..వంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1992 జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహమయ్యాక 'అమల' సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత 2012లో విడుదలైన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో తల్లి పాత్రలో 'అమల' మెరిశారు. 'నాగార్జున' మాత్రం వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం 'రాజుగారి గది 2' చిత్రంలో 'నాగార్జున' నటిస్తున్నారు.

13:19 - June 12, 2017

'సమంత' జోరు కొనసాగిస్తోంది. పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యమ బిజీగా మారనుంది. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అక్కినేని నాగ చైతన్య'..’సమంత' మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. దీనితో నాలుగు నెలల్లో సినిమాలు కంప్లీట్ చేయాలని 'సమంత' యోచిస్తోందని తెలుస్తోంది. 'రామ్‌చరణ్‌' తో 'రంగ స్థలం 1985' చిత్రం..విజయ్ తో..విశాల్‌కి జోడీగా నటిస్తున్న 'ఇరుంబు థిరై' చిత్రాలుండగా, తాజాగా మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'శివకార్తికేయన్‌' హీరోగా నటించే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి చెన్నైలో ప్రారంభం కానున్నాయి. పెళ్లి సమయం వచ్చే సరికి ఈ నాలుగు సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల్లో గడిపేస్తున్నట్టు ట్వీట్‌ ద్వారా అభిమానులతో సమంత షేర్‌ చేసుకుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - Tollywood Updates