transport department

09:43 - March 28, 2018

పశ్చిమ గోదావరి : పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్‌ ఆటోను ఢీ కొట్టడంతో ఆటో వెళ్లి పంటపొలాల్లో బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. గాయపడినవారిని వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.కాగా గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమిమంగా వున్నట్లు తెలుస్తోంది. 

06:43 - August 12, 2017

హైదరాబాద్ : ఆర్టీసీకి అసలే అప్పుల కుప్పలు. ఆపై నష్టాల తిప్పలు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఆర్టీసీ పై జీఎస్టీ పిడుగులు. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్సీఈకి పన్నుల భారం తడిసిమోపెడవుతోంది. ఆర్టీసీకి జీఎస్టీ ప్రభావంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి రథ చక్రం.. ఆర్టీసి ప్రభుత్వ విధానాలతో కుదేలేవుతోంది. సంస్థను పటిష్టం చేయాల్సిన సర్కారు... ప్రైవేటు మాదిరిగానే ఆర్టీసీపై పన్నుల భారం మోపుతోంది. దీంతో సంస్థ సంక్షోభంలో చిక్కుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టీ ఆర్టీసికి శాపంగా పరిమణించింది. కోటి మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడంలేదు. ఆదాయ వ్యయాలకు మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ ఆర్టీసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చి నలభై రోజులు గడిచినప్పటికీ ఆర్టీసిపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై యాజమాన్యానికి స్పష్టత లేకపోయినా... ప్రజా రవాణ వ్యవస్థ విస్తరణకు జీఎస్‌టీ అవరోధంగా పరిమించే అవకాశం లేకపోతేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ వినియోగించే డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై అభ్యంతం వ్యక్తమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీజిల్‌పై అమ్మకం పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్‌పై 24.5 శాతం అమ్మకం పన్ను విధిస్తున్నారు. డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని పది వేలకు పైగా బస్సులు కలిగిన ఆర్టీసి కొత్త బస్ బాడీలు తయారు చేసేందుకు విడిభాగాలు, టైర్లు, ట్యూబ్‌లను పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిపై 18 నుండి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఇంతకు ముందు అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే, జీఎస్‌టీ చాలా ఎక్కువ. బస్ బాడీ తయారీకి వ్యాట్‌ ఐదు శాతం ఉంటే, జీఎస్టీలో ఇది 28 శాతానికి చేరింది. ఇది సంస్థకు భారమే.

జీఎస్టీ చట్ట నిబంధనల్లో 10 అంతకంటే ఎక్కువ సీట్లు సామర్థ్యం కలిగిన వాహనాలకు 15 శాతం సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి 28 శాతం కలిపితే మొత్తం 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సంస్థకు అదనపు భారమే. కొత్తగా కొనుగోలు చేయనున్న 1350 కొత్త బస్సుల కూడా జీఎస్‌టీ ప్రభావం పడుతుంది. మొత్తం మీదీ జీఎస్‌టీ ఆర్టీసీకి భారంగానే పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 

18:41 - April 2, 2017

నిజామాబాద్ : లారీ యజమానులు చేస్తున్న సమ్మె నేడు నాలుగో రోజుకు చేరింది. సరుకు రవాణా లారీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు వ్యతిరేకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లారీ యజమానులు ఆందోళనబాట పట్టారు. లారీలను ఎక్కడికక్కడే నిలిపివేసి మార్చి 30 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. పెంచిన చలాన్లు, టోల్‌గేట్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లారీ యజమానుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు ప్రారంభించలేదు. సమ్మె వల్ల నిత్యవసర వస్తువుల ధరులు పెరిగే అవకాశం ఉంది.

 

12:10 - December 20, 2016

హైదరాబాద్ : ఆంధ్రా బస్సుల వల్ల తెలంగాణకు రోజుకు ఆర్టీసీకి రూ.కోటి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆంధ్రా నుండి దాదాపు వెయ్యి బస్సుల వరకూ ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయనీ..ఆర్టీసీ బస్సులు దాదాపు 800ల బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆంధ్రా తెలంగాణ ఒప్పందం ప్రకారం ఫిఫ్టీ ఫిప్టీ నిబంధన ప్రకారం నడవాలనీ..దీనిమీద మా ప్రిన్సిపల్ గారు ఆంధ్రా సెక్రటరీకు లేఖ రాశారని తెలిపారు. అలాగే చీఫ్ సెక్రటరీగారు కూడా లేఖ రాశారని తెలిపారు. దీంతో తెలంగాణలో దాదాపు 3లక్షల వాహనాలు సింగిల్ పర్మిట్ తో నష్టలపాలవుతున్నాయని తెలిపారు. కాబట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన కోరారు. దీనికి సంబంధిత మంత్రి సమాధానమిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

13:36 - November 27, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో ఏపీ రవాణ రాజధాని విజయవాడలో రవాణ రంగం కుదేలైంది. సరకు రవాణ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. వంద కాదు, వెయ్యి కాదు.. విజయవాడలో ఉన్న మూడు లక్షల లారీల్లో సగానికి పైగా ఆగిపోయాయి. మిగిలినవి అరకొరగానే తిరుగుతున్నాయి. రవాణ రంగంపై ఆధారపడిన కార్మిక కుటుంబాలు ఆకలితో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో విజయవాడ రవాణ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:57 - June 10, 2016

హైదరాబాద్ : ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు పూర్తైనా ఇంకా ఆర్టీసీ విభజన కాకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాక సంస్ధ పూర్తిగా నష్టాలతో నడుస్తుండటంతో.. గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్ధాయిలో చర్చించేందుకు డిపో మేనేజర్ల స్ధాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ...
అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధను గాడిలో పడేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే 600 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్ధను ఎలా గట్టెక్కించాలని అధికారులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఉన్నతాధికారులతో మాత్రమే నామామాత్రపు చర్చలు జరిపితే సరిపోదని భావించిన సీఎం కింది స్ధాయి సిబ్బందితోనూ చర్చించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో డిపో మేనేజర్ల స్ధాయి అధికారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోవాని సీఎం యోచిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని రవాణామంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణను సీఎం ఆదేశించారు.

ఆర్టీసీకి అన్ని జిల్లాల్లోనూ నష్టాలే...
ఒక్క హైద్రాబాద్‌లో మినహాయిస్తే ఇతర జిల్లాలోని సంస్ధలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. మొత్తం ఆక్యూపెన్సీ తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇక హైద్రాబాద్‌లో మాత్రం బస్సులకు మెయింటెనెన్స్ కోసం జిహెచ్‌ఎంసీ నుంచి ఏడాదికి కొంత ఆర్థిక సాయం అందించేలా గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరంలో నష్టాల్లో ఉన్న డిపోలకు ఏడాదికి 50 కోట్ల వరకు జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికి బదులుగా జీహెచ్ఎంసీకి చెందిన వాహనాలకు ఆర్టీసీ సర్వీసు సెంటర్లలో రిపేర్ చేస్తున్నారు.

షీలా బేడి కమిటీ పరిధిలో విభజన అంశం...
ఆర్టీసీ పూర్తి స్థాయిలో విభజన కాకపోవడం కూడా అనేక సమస్యలకు దారి తీస్తోంది. సంస్ధకు చెందిన ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఈ విభజన అంశం షీలా బేడి కమిటీ పరిధిలో ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. అయితే ఈ రెండేళ్ళ కాలంలో కేవలం ఉద్యోగుల విభజన, బస్సుల పంపకం వంటివి మాత్రమే జరిగాయి. బస్ భవన్, ఆర్టీసీ హస్పటల్, విలువైన భూములు, భవనాల పంపకం పెండింగ్‌లో ఉంది. ఇలా చాలా అంశాలు పెండింగ్ ఉన్నందున వాటిని తానే స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించాలని సీఎం నిర్ణయించకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఏపీలో లాభాలు, టీ.ఎస్ లో నష్టాలు...
అయితే విభజన అయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లోకి ఎందుకు వెళ్తుందో చర్చించి.. లాభాల్లోకి వచ్చేందుకు క్షేత్ర స్ధాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. దీంతో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

06:58 - January 10, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది.

తెలంగాణలో 82 లక్షల వాహనాలు ....

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల వాహనాలున్నాయి. ఇందులో ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనాలు, లారీల వల్లే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన స్పీడ్‌, నిర్లక్ష్యంగా నడపడం, హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్‌ బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మంది మరణిస్తున్నారు. 30 వేల మంది గాయాలపాలవుతుండగా.. 20 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేకమంది రోడ్డునపడుతున్నారు.

రోడ్డు నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు....

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకోబోతుంది. కార్లు, ఇతర వాహనదారులు సీట్‌ బెల్టులు ధరించేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం మొదట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో కార్లకు నల్లటి అద్దాలు తొలగించిన తీరుగానే నెలవారీగా ట్రాఫిక్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.

హైవేలపై ఉన్న మద్యం దుకాణాలపై దృష్టి.......

మరోవైపు హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు.. హైవేలపై మద్యం దుకాణాల నిర్వహణపై కూడా దృష్టి సారించనున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరపకుండా కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నారు. ఇక నగరాల్లో నిర్వహిస్తున్న విధంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రమాదాల నివారణ కోసం పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్‌, రవాణా, విద్యాశాఖ, కమర్షియల్‌ టాక్స్‌ వంటి శాఖలను సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రమాదాల నివారణ కోసం ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ అధికారులు పర్యటన చేయనున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

18:33 - December 23, 2015

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు రహదారులు, భవనాల శాఖ డీఈ శంకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీఎస్పీ మహబూబ్ ఫాషా ఆధ్వర్యంలో ఆరు టీంలు ఒకేసారి దాడులు చేశాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. శంకర్ రెడ్డికి కోటి రూపాయల అక్రమ ఆస్తులున్నాయని తేల్చారు. అనంతరం శంకర్ రెడ్డిని అరెస్టు చేశారు. 

11:49 - September 24, 2015

హైదరాబాద్‌ : మెట్రోరైల్. నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా ఉండటానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు. కాన్‌సెప్ట్ బాగానే ఉంది కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ప్రస్తుతం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. వాహనాల్లో బయటకు వెళ్తే చాలు అరగంటలో వెళ్లొస్తామనే గ్యారంటీ లేదు. గమ్యం అరగంట అనుకుంటే రెండుగంటలు పడుతోంది. అయినా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తే.....

హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తే నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. అందుకోసం సర్కార్ వేగంగా పనులు కూడా చేపడుతోంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే వాహనదారులకు ఎంత కంపర్టబుల్‌గా ఉంటుందోగాని ఇప్పుడు మాత్రం నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మెట్రో పనులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. ఈ పనుల వల్ల నగరంలో ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. బైక్‌పై వెళ్లినా...బస్సెక్కినా..కార్లలో వెళ్లినా.. గమ్యస్థానానికి చేరాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు....

ఇప్పుడున్న రోడ్లకు మరమ్మతులపై కూడా చేపట్టడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై అనేక గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే చాలు వీటిలో నుంచి బయటపడటమే గగనమవుతోంది. ఈమెట్రో పనులు చేపట్టే ముందే రహదారుల విస్తరణ కూడా జరగాలి. అయితే కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ కూడా జరగలేదు. ఈ సమస్యలపై అధికారులుగాని, పాలకులుగాని కనీసం జీహెచ్‌ఎమ్‌సీగాని దృష్టిపెట్టడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా...అధికారులు, పాలకులు స్పందించి నగరంలో ట్రాఫిక్‌జామ్‌ కాకుండా చర్యలు చేపట్టాలని విపక్షాలు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

11:53 - September 8, 2015

హైదరాబాద్ : టూ వీలర్‌తోపాటు హెల్మెట్ తప్పనిసరిగా కొనాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ తర్వాతే తప్పనిసరన్న నిబంధన పెట్టాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ఎందుకు ఆదేశాలిచ్చారని ప్రశ్నించిన హైకోర్టు

జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు లో పిటిషన్...

హైదరాబాద్‌లో హెల్మెట్ తప్పనిసరి జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.. హెల్మెట్ కంపల్సరీ అంటూ ఇప్పటికిప్పుడు ఎందుకు ఆదేశాలిచ్చారని కోర్టు తెలంగాణ రవాణా శాఖను ప్రశ్నించింది.. ఇన్నాళ్లు ఏం చేశారని అడిగింది.. దీనికి సమాధానమిచ్చిన రవాణాశాఖ... సుప్రింకోర్టు ఆదేశాల తర్వాత 14 నెలల్లో 92వేల 14వందల కేసులు నమోదు చేశామని తెలిపింది.. అయితే ఇంత సడన్‌గా హెల్మెట్ వాడాలంటే ఇబ్బందులుంటాయని... ఈ అంశంపై 15రోజులపాటు అవగాహన కల్పించిన ఆ తర్వాత అమలు చేయాలని ఆదేశించింది.. విచారణను 15రోజులపాటు వాయిదావేసింది..

Don't Miss

Subscribe to RSS - transport department