tribal university

08:15 - August 10, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. విభజన హామీలు అమలు చేసే వరకు ప్రధాని మోదీ నేత్వత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదన్నారు. గిరిజనులందరికీ యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి విధాన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దితోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనులకు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 75 యూనిట్ల నుంచి వంద యూనిట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 
పాడేరులో పర్యటించిన చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో గర్భిణిలకు శ్రీమంతాలు నిర్వహించి, చంటిపిల్లలకు అన్నప్రాసన చేశారు. అక్కడే అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. అడారిమెట్ట గ్రామ సభలో పెన్షన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆరువేల మందికిపైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.... గిరిజనుల కోసం అన్నీ చేస్తున్న మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బీజేపీ మెడలు వంచి హక్కులు సాధించుకుంటామన్నారు. యాభై ఏళ్ల వయసు నిండిన గిరిజనులందరికీ పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాడేరు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాష్ట్ర ప్రభుత్వ పండుగగా మోదుకొండమ్మ జాతర 
విశాఖ మన్యంలో గిరిజనులు జరుపుకునే మోదుకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చంద్రబాబు ప్రకటించారు. సభా వేదికపై గిరిజనులు బహుకరించిన సంప్రదాయ టోపీని ధరించారు.  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో మంజూరు చేసిన ఇన్నోకార్లు, జీపులను లబ్దిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. విలువిద్యలో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులకు ఆర్చరీ పరికరాలు ఆందచేశారు. గిరిజన బాలికలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఆ తర్వాత పాడేరు నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు.
 

 

06:48 - August 9, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల అభ్యన్నతికి పాటుపడుతోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపడుతోంది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.... ఏపీలో గిరిజనుల అభ్యున్నతిపై కథనం...
గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీఠ 
తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి పెద్దపీఠ వేస్తోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వారి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేసింది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వారిని అన్ని రంగాల్లో ఆదుకుంటోంది. గిరిజన యువతలో స్కిల్స్‌ డెవలప్‌చేస్తూ వారిని ఉపాధిరంగంలో ప్రోత్సహిస్తోంది.
గిరిపుత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక
ఏపీలోని 35 జాతుల్లో 5.53శాతంగా ఉన్న గిరిపుత్రులను అన్నివిధాలా ఆదుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ అమలు చేస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు  2018-19కిగాను 2129.13 కోట్లను కేటాయించారు. సబ్‌ప్లాన్‌ కింద 2018-19కిగానూ 4,176.60 కోట్ల నిధులు కేటాయించింది. ఈ స్థాయిలో భారీగా నిధులు మంజూరు చేసి గిరిజన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటోంది.  విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావించిన ప్రభుత్వం.... గురుకుల విద్యా వ్యవస్థ కింద 174 విద్యాసంస్థలను ఆదివాసీ విద్యార్థుల కోసం నడుపుతోంది. మరో 80 గిరిజన హాస్టళ్లను కొత్తగా కన్వర్ట్ చేసి వాటిని కూడా ప్రభుత్వం గురుకులాల నియంత్రణ కిందకు తీసుకువచ్చి గిరిజన యువతకు విద్యను అందుబాటులోకి తెచ్చింది.
గిరిజనుల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత 
విద్య తర్వాత ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి అధికా ప్రాధాన్యత ఇస్తోంది. పాత పద్దతులకు స్వస్తి చెప్పి సరికొత్త ఆవిష్కరణలను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.  160 పీహెచ్‌సీలు, 249 సీహెచ్‌సీలు, 270 ఏహెచ్‌ల్లో మందులను అందుబాటులో ఉంచేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీల్లో 7 నుంచి 11 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను 23కు పెంచారు. 15 చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతుండడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి
 

 

06:42 - August 9, 2018

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతారు. మరోవైపు బాక్సైట్‌ అంశంతోపాటు గిరిజన యూనివర్సిటీ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ, బోయా వాల్మీకి కులాలను ఎస్టీలను చేర్చే అంశంపై సీఎంకు నిరసన తెలపాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగుతుందా లేక ఆదివాసీలు అడ్డుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.
పాడేరులో పర్యటించనున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన పాడేరులో పర్యటిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేశారు. చంద్రబాబు ప్రత్యేక విమానం ద్వారా విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పాడేరుకు హెలికాప్టర్‌ ద్వారా వెళ్తారు.  పాడేరు మండలం అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శి  కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అడారిమెట్ట, చింతలవీధి పరిధిలోని 8 గ్రామాల ప్రజలతో చంద్రబాబు ముచ్చటిస్తారు. గ్రామదర్శి కార్యక్రమంతోపాటు గ్రామ వికాసం కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ప్రతీవాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటుగా... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఏర్పాట్లను పరిశీలించారు.
చంద్రబాబు పాడేరు టూర్‌కు సమస్యలు స్వాగతం 
చంద్రబాబు పాడేరు టూర్‌కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ గనులకు సంబంధించి జీవో నంబర్‌ 97పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చెయ్యకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాల్కో సంస్థకు బాక్సైట్‌ను అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అందుకే జీవో నంబర్‌ 97ను రద్దు చెయ్యకుండా ఉంచిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో గిరిజన యూనివర్సిటీతోపాటుగా స్పెషల్‌ డీఎస్సీ అంశంపైనా గిరిజన నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలు గురించి కూడా సీఎం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.  ఇక బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని ఇక్కడి గిరిజనులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఆదివాసీ సమస్యలపై చంద్రబాబును నిలదీయాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. మొత్తానికి చంద్రబాబు పాడేరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

 

09:24 - May 2, 2018

కామారెడ్డి : గిరిజనుల  సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. కేసీఆర్ అంతు చూస్తామని హస్తం నేతలు  హెచ్చరించారు. కామారెడ్డిలో గిరిజన డిక్లరేషన్ సదస్సులో కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. గిరిజనుల రిజర్వేషన్, గిరిజన విశ్వవిద్యాలయం, పోడు భూముల అంశం సహా పలు అంశాలపై టీపీసీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సదస్సులో టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనపై దుమ్మెత్తి పోసిన నేతలు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామన్నారు.  
గులాబీపార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిక
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల హామి ఇచ్చిన కేసీఆర్.. ఆ హామిని విస్మరించారని హస్తంపార్టీ నేతలు మండిపడ్డారు. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. గులాబీపార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే.. ఖమ్మంజిల్లా బయ్యారంలో  స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, గిరిజన బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో  జనాభా ప్రాతిపాదికన  విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేస్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి.. ప్రజలు నిలదీస్తారనే ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ వేదికగా.. రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేయగా.. కామారెడ్డి కేంద్రంగా గిరిజన డిక్లరేషన్ ఏర్పాటు చేసింది. గిరిజన డిక్లరేషన్ సభ సక్సెస్ అయిందని  కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నెలకొంది. 

 

11:56 - March 2, 2018
13:32 - November 17, 2017

కాకినాడ : విభజన చట్టంలోని హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్రంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కైందని ఈనె 20వ తేదీన చలో అమరావతి కార్యక్రమం నిర్వహించన్నుట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. రైతుల ఆందోళనలను పక్కదారి పట్టేందుకు ఎమ్మెల్యేలతో ఏపీ ప్రభుత్వం పోలవరం పర్యటన చేయిస్తున్నారని విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

19:00 - November 22, 2015

హైదరాబాద్ : నిధులు, ప్రాజెక్టుల మంజూరులో కేంద్రం.. ఏపీ, తెలంగాణల మధ్య పక్షపాత దోరణిని ప్రదర్శిస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణకు రావాల్సిన ట్రైబల్‌ యూనివర్శిటీని ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. వరంగల్‌లో రైళ్ల కోచ్‌ ఫ్యాక్టరీని రద్దు చేశారని కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో కేంద్రమే స్టీల్‌ ఫ్యాక్టరీని నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి దమ్ముంటే..తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులను మంజూరయ్యేలా కేంద్రం వత్తిడి తేవాలని ఆమె సవాల్‌ విసరారు. 

Don't Miss

Subscribe to RSS - tribal university