TRS Government Development

16:34 - August 9, 2018

వరంగల్ : జిల్లాలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వం మినలర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ - ఖమ్మం రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న వాటర్ ప్లాంటును మూసివేస్తోందని తెలిపారు. వాటర్ ప్లాంట్ ఉన్నప్పుడు కేవలం రూ. 2లతో స్వచ్ఛమైన నీటిని తాగే వారమన్నారు. 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:43 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని టీపీసీసీ విమర్శించింది. ఎన్నికల నిలుపుదలకు హైకోర్టులో కేసు వేసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ మండిపడ్డారు. నాగర్‌కర్నూల నియోజకవర్గం ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి కేసు వేసిన విషయం టీఆర్‌ఎస్‌ నాయకులకు తెలియదా.. అని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

21:23 - July 7, 2018

హైదరాబాద్ : బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చిన్న వ్యాపారాలు, కులవృత్తులు చేసుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా 100శాతం రాయితీతో ఆర్ధికసాయం చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో  లబ్దిదారుల ఎంపిక కోసం కలెక్టర్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్థాపించామని.. వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో బీసీ వర్గాల సంక్షేమ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 

వెనకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు... చిన్న వ్యాపారాలు చేసేవారికి... కులవృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే 100శాతం రాయితీతో ఆర్ధికసాయం అందించాలని సూచించారు. గ్రామాలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలన్నారు. లబ్ధిదారుల జాబితా సిద్దంకాగానే ఆర్ధిక సాయం చేయాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకోసం వినియోగించాలన్నారు కేసీఆర్‌. 

వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎక్కడైనా సీట్లు మిగిలితే... బీసీలకే కేటాయిస్తామని... బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కల్లు దుకాణాల పునరుద్ధరణతో పాటు చెట్ల రకం రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతుందన్నారు. గీత కార్మికులకు కావాల్సిన విషయాలపై మరోసారి అధ్యయనం చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేయడంతో... ఆర్థికంగా బలోపేతమవుతున్నారని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులతో పాటు మత్స్యకారులు లబ్ది పొందుతున్నారన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలీలకు మేలు జరిగిందన్నారు. విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతో పాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసే వారికి పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు.

22:01 - July 6, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాసన్‌నగర్‌లో కానిస్టేబుల్‌ కిషోర్‌ ఏకే 47తో కాల్పుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  వెంటనే తేరుకున్న పోలీసులు కిషోర్‌ను  ఆస్పత్రికి తరలించారు. కిషోర్‌కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రిటైర్డ్‌ డీజీ ఆర్‌.పి.మీనా వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కిషోర్‌.. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు.  

 

21:57 - July 6, 2018

సిద్ధిపేట : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలో మొత్తం 4600 ఇళ్లకు గాను... 3500 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణంలో రాజకీయాలకు, ఫైరవీలకు తావులేకుండా చూస్తామన్నారు. అర్హులైన వారిని గుర్తించి రాజకీయాలకు తావులేకుండా పంపణీ చేస్తామన్నారు. అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను హరీష్‌రావు ఆదేశించారు. 

 

21:56 - July 6, 2018

హైదరాబాద్ : బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలు వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికసాయం అందించే కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం కార్యక్రమాలు అమలుచేయనున్నట్లు సీఎం తెలిపారు. వెనుబడిన తరగతుల వారికి  లక్ష, నుంచి  2 లక్షల విలువ చేసే యూనిట్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.ఈనెల 9న జరగనున్న కేబినెట్‌ భేటీలో దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈఏడాది చేపట్టనున్న  హరితహారం కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో  హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. 

 

15:29 - July 6, 2018

మేడ్చల్ : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసు స్టేషన్ లో సూర్యప్రకాశ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే షామీర్ పేట పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ పీఎస్ కు ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో షామీర్ పేటలోని తన ఇంట్లో ప్రశాక్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:00 - June 9, 2018

ఇఫ్తార్ దావతు మాలయ ముస్లీంలు..దశాబ్దాలుగా ముస్లింలకు మోసమే, బారాపర్సెంట్ రిజర్వేషనేదంటున్న ఉత్తం..మీరు ఎన్ని సీట్లిచ్చిండ్రయ్యా నాలుగేగా ??, నీరుగారి పోతున్నటీడీపీ నిర్మాణ దీక్షలు..బాబు ప్రసంగాన్ని ఎక్కిరిస్తున్న కుర్చీలు, జనంలకు వోలేకపోతున్న జన సమితి పార్టీ..దూకుడు వెంచకుంటే కష్టమే అంటున్నరు, ఆర్మూరు నియోజకవర్గంలో బీసీల గోస.. ఓట్లు బీసీలయి.. సీట్లు మాత్రం ఓసీలయి, తెల్గు రాష్ట్రాలను పల్కరిస్తున్న తొలకరి.. ఈసారి బాగ వానలు వడ్తయంటున్నరు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss

Subscribe to RSS - TRS Government Development