TRS MLA Jeevan Reddy

11:11 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో అసహనం ఉందని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనపై ఆయన మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో వ్యవహరిస్తున్న తీరును కిషన్ అసెంబ్లీలో ప్రస్తావించగా దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించుకోవడం జరిగిందని, హరీష్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రవేశ పెట్టకముందే ఫ్లోర్ లీడర్లను పిలిచి మాట్లాడిస్తే బాగుండేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ వ్యవస్థలో ఎవరూ ఆ విధంగా చేయకూడదన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి బాధను వ్యక్తపరచడం జరిగిందని, పరిగణలోకి తీసుకోకపోవడం..జానారెడ్డిని సస్పెండ్ చేయడం సభకు హుందాతనం అనిపించుకోదన్నారు.

దీనిపై కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. పార్లమెంట్ లోని విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవద్దని..సభలో లేని వ్యక్తుల అంశాన్ని ప్రస్తావిస్తే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా ఎలా మాట్లాడారో వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:08 - March 13, 2018

హైదరాబాద్ : సోమవారం నాడు జరిగిన ఘటన బ్లాక్ డే అని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో టి.కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది. స్పీకర్ మధుసూధనాచారి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ఘటన జరగడం దురదృష్టకరమని, ఇలా జరగడం బాధాకరమన్నారు. దాడిపై క్షమాపణలు చెప్పాల్సింది పోయి..గవర్నర్ పై దాడి చేయాలని అనుకున్నామని కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పరాజయం పాలవుతుండడంతో ఇక్కడి కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఎద్దేవా చేశారు. 

11:07 - March 13, 2018

హైదరాబాద్ : అరాచక శక్తుల పీచమణుస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశార. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం సమర్థిస్తున్నట్లు, ఇలాంటి ఘటనలు గత నాలుగు సంవత్సరాల నుండి జరగలేదన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నారని, అంతేగాకుండా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని, రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని సభకు తెలిపారు.

నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అరాచక శక్తులను ఎలాంటి పరిస్థితిలో ప్రోత్సహించడం జరగదన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పలుసార్లు చెప్పడం జరిగిందని, ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు. 

10:35 - March 13, 2018

హైదరాబాద్ : అందరూ ఊహించినట్టే జరిగింది. కాంగ్రెస్ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రారంభమైన శాసనసభలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ప్రసగించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటి ఛైర్మన్ స్వామిగౌడ్ గాయపడడం కలకలం రేగింది. మంగళవారం ప్రారంభమైన సమయంలో స్పీకర్ తొలుత మాట్లాడారు. ఘటన జరగడం బాధాకరమని, ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అరాచక చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎన్.ఉత్తమ్, డికే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, పద్మావతిలు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు, అంతేగాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వం ను రద్దు చేస్తున్నట్లు, ఈ తీర్మానాన్ని ఆమోదించాలని మంత్రి హరీష్ రావు సభలో తెలిపారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు, సస్పెండ్ అయిన వారు సభలో నుండి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. 

09:38 - March 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మార్షల్ పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు జరిగిన ఘటన చెదురుముదురు ఘటనలని అభివర్ణించారు. ఈ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. తక్షణమే సభలో జరిగిన పూర్తి వివరాలపై గవర్నర్ నివేదిక తెప్పించుకుని...వీడియో ఫుటేజ్ లను పరిశీలించి అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పది గంటలకు మొదలు కావాల్సిన గవర్నర్ ప్రసంగం ఐదు నిమిషాల ఆలస్యం అయ్యిందని దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మామా..అల్లుళ్ల నాటకానికి తెరదింపాలని..ప్రజా సమస్యలపై చర్చించాలని..రైతులకు అండగా నిలబడాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

09:27 - March 13, 2018

హైదరాబాద్ : మర్డర్ చేసిన తరువాత తప్పయింది అంటారా ? అంటూ టీఆర్ఎస్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం చేసే సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి విసిరన హెడ్ సెట్ మండలి ఛైర్మన్ కు తగిలిందని..ఆయన కంటికి గాయమైందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. దీనిపై జీవన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. ఒక నిండు శాసనసభలో ప్రసంగం చదువుతుంటే కాంగ్రెస్ నేతలు ఇలా చేయడం గూండాయిజం కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రవర్తనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నేతలు ఆలోచించాలని సూచించారు. నిరసన తెలియచేసే కార్యక్రమాలు వేరే ఉంటాయని, డైరెక్ట్ గా దాడులు చేయడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:18 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫీయి రీయింబర్స్ మెంట్ పథకంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. బుధవారం అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరుగార్చిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఆయన ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు వేశారు. పేదవర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాకర్ల మధ్య ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా ? అని ప్రశ్నించారు. 13 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందని, 80 మైనార్టీ స్కూళ్లు మూతపడ్డాయా ? లేదా ? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని సూటిగా ప్రశ్నించారు. చివరి సంవత్సరం నుండి బకాయిలు ఎంతుందో చెప్పాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. రూ. 4వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వాలన్నారు.

దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని..2016-17 విద్యా సంవత్సరానికి మరో వారంలో ఫీజులు బకాయిలు చెల్లిస్తామన్నారు. చిన్న కాలేజీలకు మొదట..పెద్ద కాలేజీలకు తరువాత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు తాము 52.35 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. 

21:17 - November 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం... తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హాట్‌హాట్‌ డిస్కషన్ జరిగింది. అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అవుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు...లెక్కలతో సహా చూపించాలన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటల ఖండించారు. రాష్ట్రం రెవెన్యూలో సర్‌ప్లస్‌లో ఉన్న మాట వాస్తవమే అని మంత్రి ఈటల అన్నారు. ఏ అప్పులు చేసినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం నుంచి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను మర్చిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగే పరిస్థితి కల్పించకూడదన్నారు.

విపక్ష పార్టీల నేతలను మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల నియామకాలన్నీ వచ్చే 20 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తమ మేనిఫేస్టోలో ఉన్న అంశాలు 90 శాతం అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27, 744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ సభకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7, 266 పోస్టులు విద్యుత్‌ శాఖలో 1, 427, పోలీస్‌ శాఖలో 12, 157 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదాపడింది.

20:29 - November 14, 2017

నిన్నియాళ్ల ఫేస్ బుక్కులళ్ల.. వాట్సప్ గ్రూపులళ్ల.. ఒక పోట్వ గిర్రా గిర్రా తిర్గుతున్నది.. కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు.. మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు సన్నాసులైండ్రు అనేది కుద్దు అచ్చరాలు రాశి అండ్లిండ్ల తింపుతున్నరు.. నిజంగ కేరళ ముఖ్యమంత్రి మన సీఎంలకంటె తోపా..? తోపైతె ఎట్ల తోపు అనేది ఒక్కపారి జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

08:25 - November 14, 2017

హైదరాబాద్ : జూదంపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి అసాంఘిక చర్యలకు మినహాయింపు ఇవ్వకుండా అసెంబ్లీ గేమింగ్‌ యాక్ట్‌కి చట్ట సవరణలు చేసింది ప్రభుత్వం. ఇకపై జూదం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇక నుండి జూదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న గేమింగ్‌ యాక్టులో కొన్ని సవరణలు చేసింది అసెంబ్లీ. ఈ సవరణలో పేకాట, మట్కా, సట్టా, జూదం, ఆన్‌లైన్ పేకాట వంటి వాటిని ఈ పరిధిలోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా వీటిని అమలు చేసే నిర్వహకులు, అందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్ట సవరణలో మార్పులు చేసింది.
జూదం ఆడినవారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష
కొత్త చట్టం 2017 జులై 8 నుండి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం జూదం ఆడినవారిపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించనుంది. అలాగే దాడులు చేసిన చోట లభించిన నగదుతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను జప్తు చేయడం వంటి అధికారం ఈ చట్టంలో ఉన్నాయి. అయితే హార్స్‌ రేసింగ్‌ను కూడా ఈ చట్టంలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 
హార్స్‌ రేసింగ్‌ను చట్టంలోకి తీసుకురావడం కుదరదు : నాయిని  
అయితే హార్స్‌ రేసింగ్‌ను ఈ చట్టంలోకి తీసుకురావడం కుదరదన్నారు మంత్రి నాయిని నర్సింహారెడ్డి. అర్బన్ రూరల్‌ ఏరియాలలో అందరికీ ఈ చట్టం వర్తిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో జూదం నిర్వహించే కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త చట్ట సవరణతో రాష్ట్రంలో జూదంపై పూర్తిగా నిషేధం అమలు కానుంది. జూదం వల్ల ఎక్కువ ప్రభావం చూపుతున్న  మహిళలు, విద్యార్థులకు ఈ చట్ట సవరణతో ఉపశమనం కలుగుతుందని అధికారులు బావిస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - TRS MLA Jeevan Reddy