TRS party

20:18 - September 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ప్రచారం సందడి నెలకొంటోంది. కేసీఆర్ ముందస్తుకు జై కొట్టి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరుగెత్తించారు. ఆయా నియోజకవర్గల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. మిగతా పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. ఇంక ప్రచారంలో టీఆర్ఎస్ అధిష్టానం హైటెక్ టెక్నాలజీని వాడుకొంటోంది. 

ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి..చేసే అభివృద్ధి గురించి డిజిటల్ ప్రచారం చేయనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నాయి. మొత్తంగా 40-50 వాహనాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. భారీ తెరలపై అభ్యర్థుల గురించి వివరించే ప్రయత్నం చేస్తామని, జరిగిన అభివృద్ధిపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతామని ప్రచార నిర్వాహకుడు టెన్ టివితో తెలిపారు. మరి ఈ డిజిటల్ ప్రచారం సత్ఫలితం ఇస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

15:24 - September 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు హడావుడి నెలకొంది. ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను గులాబీ బాస్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనితో టికెట్ వస్తుందని ఆశించిన పలువురు భంగపడ్డారు. ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టికెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కేటాయించడంపై ఆ పార్టీ నేత రమేష్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

రేఖా నాయక్ కూడా ఆయపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరారు. ఖానాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా ? అనేది తెలియాల్సి ఉంది. 

ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ...టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా పర్యటిస్తానని వెల్లడించారు. టికెట్ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని, 47 నియోజకవర్గాల్లో తమ జాతి ప్రభావిత శక్తిగా ఉందన్నారు. ఇక గత విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో రమేష్ చక్రం తిప్పారు. అయితే విభజన తరువాత తెలంగాణలో టీడీపీ ప్రాభల్యం తగ్గిపోవడంతో ఏడాది క్రితం గులాబీ కండువాను కప్పుకున్నారు. మరి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే గెలుపొందుతారా ? లేదా ? అనేది చూడాలి. 

21:35 - August 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు జనసమితి చైర్మన్‌ కోదండరామ్‌. మెదక్‌ జిల్లా చేగుంట, రుక్మాపూర్‌లలో పర్యటించిన కోదండరామ్‌... తెలంగాణ జనసమితి జెండాను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని.. మహిళలు, పిల్లలపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఐదేళ్లు పరిపాలన చేయమని ఓట్లు వేస్తే.. ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో చెప్పకుండా ప్రజలను అపహాస్యం చేస్తున్నారన్నారు కోదండరామ్‌. 

18:38 - July 26, 2018

మెదక్ : నర్సాపూర్ బస్ డిపో నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా మంత్రిగా పనిచేసినా సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ కు డిపోను నిర్మించలేకపోయారని హరీశ్ రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎటువంటి సంక్షేమపథకాలు అమలు చేసినా..ఓట్ల కోసం కాదనీ..మనసుతో చేస్తారని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుబందు పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ రైతుబంధు పథకం ద్వారా వచ్చిన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నేతలు చీకటిపడినాక వచ్చి పట్టికెళ్లారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినాక రైతన్నలకు రోజంతా విద్యుత్ వచ్చిందనీ..తెలంగాణలోని పెద్దోళ్లకు ఆసరా పెన్షన్లతో పెద్దోళ్లకు ధైర్యమొచ్చిందనీ..ముసలోళ్లకు భయం పోగొట్టిన ఘనతో సీఎం కేసీఆర్ దేనని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 

18:00 - July 26, 2018

మెదక్‌ : జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్‌ డిపో శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌ రెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే నర్సాపూర్‌లో అభివృద్ధి ప్రారంభమైందన్నారు డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి. ఎవరు అడ్డు వచ్చినా పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చితీరుతామన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. 

21:09 - June 1, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏ వర్గానికీ ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప కేసీఆర్ చేసింది శూన్యమని అన్నారు. గతంలో సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను అమలుచేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

16:57 - May 31, 2018

ఢిల్లీ : తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన లాడ్‌ బజార్‌ను ప్రారంభించారు టీఆర్‌ఎస్‌ నేతలు. తెలంగాణ వంటలు, పుస్తకాలు, పోచంపల్లి దుస్తులు వంటి స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 6 గంటలకు తెలంగాణ భవన్‌ నుండి ఇండియా గేట్‌ వరకు 3 కిలోమీటర్ల వరకు మారథాన్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ మారథాన్‌కు ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లల గోపీచంద్‌ హాజరుకానున్నారు. 

18:54 - May 27, 2018

ఢిల్లీ : పథకాల ప్రచారంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను వృథా చేస్తోందని కాంగ్రెస్ నీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకం ప్రచారం కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. రైతు బంధు పథకం సామాన్య, కౌలు రైతులకు ఉపయోగపడటం లేదని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పథకాలను అమలు చేయటం లేదని విమర్శించారు. 

 

09:37 - May 21, 2018

హైదరాబాద్ : ఎస్వీకేలో వున్న ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖులు వేసిన అరుదైన చిత్రాలు ఆహుతులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆర్టిస్ట్ సంతోష్ రాథోడ్‌ గీసిన పెయింటింగ్స్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శనకు ఉంచారు. తాను గీసిన చిత్రాలను తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఉంచడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వివిధ రకాల రంగులను ఉపయోగించి చిత్రాలను గీసినట్లు సంతోష్‌ రాథోడ్‌ తెలిపారు.

07:56 - May 8, 2018

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (వైసిపి), రాజమోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - TRS party