TRS Public Meeting

21:47 - May 22, 2017

మేడ్చల్ : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిపక్షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. అప్పుడెప్పుడో కాంగ్రెస్‌వాళ్లు దిక్కుమాలిన జీవోలిచ్చారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. కాంగ్రెస్‌ దిక్కుదివానంలేని కార్యక్రమాలే చేస్తారని మండిపడ్డారు.. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లోగొర్రెల అభివృద్ధి పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.

 

13:08 - April 28, 2017

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలకుర్తిలో పర్యటిస్తున్నారు. ఇంటికో పాడి..పశువులను ఇస్తామని హామీనిచ్చారు. రాఘవాపురంలో మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఆయన  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత బమ్మెర వెళ్లి మహాకవి పోతన సమాధిని సందర్శించారు. ఆ తర్వాత అభివృద్ధి పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 14 కోట్ల రూపాయల మేర స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేస్తారు.

 

11:05 - April 27, 2017

వరంగల్ : ఓరుగల్లు 'గులాబీ' జెండాలతో ముస్తాబైంది. సాయంత్రం భారీ బహిరంగసభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుక్ను గులాబీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని సభకు తరలించారు. సుమారు 12 లక్షల మందిని తరలించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తరలించడానికి రైళ్లు..ఆర్టీసీ బస్సులు..ప్రైవేటు బస్సులు..ఇతరత్రా రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో పలు బస్టాండ్లు బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. బస్సులు లేక ప్రయాణీకులు ఆగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను సభకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

21:44 - April 26, 2017
21:42 - April 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న మరోసారి ప్రత్యేకంగా సమావేశం కానుంది. భూసేకరణ బిల్లులో సవరణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భూసేకరణ బిల్లుపై కేంద్రం చేసిన అభ్యంతరాలు, బిల్లులో మార్పులు, చేర్పులు చేసే అంశంపై కూడా చర్చిస్తారు. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపి మళ్లీ కేంద్రానికి పంపుతారు. ఈ బిల్లుతో పాటు నకిలీ విత్తనాలు అరికట్టడానికి ఓ చట్టం రూపొందించి ఆ బిల్లును కూడా కేంద్రానికి పంపనున్నారు.

 

21:39 - April 26, 2017

హైదరాబాద్ : ముందు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత నాలుక్కరుచుకుని రాజీ పడడం తెలంగాణ సర్కార్ కు పరిపాటిగా మారింది. ప్రభుత్వంలో తమకెదురు లేదని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలన్నీ నీరుగారి పోతున్నాయి. ఇప్పటికే అత్యంత కీలకమైన భూ సేకరణ బిల్లుపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపింది.. ఢిల్లీలో ఉన్న పలుకుబడితో బిల్లును ఆమోదించుకోవచ్చు అనుకోని భంగపడింది. దీంతో బిల్లులో సవరణలు సూచిస్తూ వెనక్కి పంపారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన రెండో రోజే కేబినెట్‌ను కూడా సంప్రదించకుండా కేసీఆర్‌.. విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించారు. కానీ.. అప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా జీవో నెం.16ని జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ సంస్థలు,ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లలో పని చేస్తున్నవారి సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ఇక వివిధ గ్రేడింగ్‌లు, వయో పరిమితి, రోస్టర్‌ సిస్టమ్‌ వంటి అంశాలను సాకుగా చూపి సంఖ్యను 25 వేలకు తగ్గించారు. అయితే ఇందులో కార్పొరేషన్లలో పని చేసేవారిని రెగ్యులరైజ్‌ చేయడం కుదరదని సీఎస్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల అధ్యయన కమిటీ తేల్చి చెప్పింది. ఇక క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. రెండేళ్లుగా విచారణ చేసిన కోర్టు.. తీర్పు వెలువరించింది. జీవో 16ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 1996 తర్వాత రిక్రూట్‌ చేసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలోనూ క్రమబద్దీకరించరాదని చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ అంచనా ప్రకారం ఉన్న 25 వేల సంఖ్య మరింత కుదించబడడం ఖాయం. మొత్తానికి తొందరపాటు నిర్ణయాలతో తెలంగాణ సర్కార్‌ చేస్తున్న చర్యల పట్ల అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

19:13 - April 26, 2017
18:42 - April 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. మొన్న సింగరేణి..నిన్న భూసేకరణ బిల్లు వాపస్..నేడు క్రమబద్ధీకరణ. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు హైకోర్టు బ్రేకు వేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవో 16పై ఓయూ విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. 1996 తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయవద్దని వారు కోరారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారించింది. తదనంతరం జీవోను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందా ? లేదా ? చూడాలి.

17:56 - April 26, 2017

హైదరాబాద్ : మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 30న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. భూసేకరణ సవరణల బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం సూచనలతో భూ సేరణ బిల్లులో మూడు సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

17:50 - April 26, 2017

కామారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభకు కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నుండి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంద ట్రాక్టర్లు బయల్దేరాయి. సభకు వెళ్తున్న వారంతా జాగ్రత్తగా వెళ్లాలని మంత్రి సూచించారు. సభకు రానున్న కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - TRS Public Meeting