Trump Daughter

21:55 - November 28, 2017

హైదరాబాద్ : ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడిపారు. హైదరాబాద్‌ చేరుకున్న ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంక...ఆకట్టుకునే స్పీచ్‌తో అదరగొట్టారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నట్లు చెప్పారు. 

జీఈ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్న ఇవాంక ట్రంప్‌..తొలిరోజు బిజీ బిజీగా గడిపారు. ప్రత్యేక విమానంలో తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇవాంకకు అమెరికా రాయబారి కెన్నత్ జుస్టర్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరుపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆమెకు స్వాగతం పలికారు. 

ఎయిర్‌పోర్టు నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. ఇవాంక ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకున్నారు. ఆ తర్వాత హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ  అయ్యారు. అనంతరం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసారు. తర్వాత ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ వ్యాపార సదస్సులో పాల్గొన్నారు. భారత్‌లో పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైందన్నారు. జీఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నట్లు చెప్పారు ఇవాంక.

అనంతరం జీఈ సదస్సు ప్యానెల్‌ సెషన్‌కు హాజరైన ఇవాంక పారిశ్రామికవేత్తలతో చర్చించారు. మనలో ఉన్న ఆలోచనలు, నైపుణ్యాలు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఇవాంక అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చన్నారు. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్‌కు ఇవాంక వెళ్లారు.  బుధవారం ఉదయం ఇవాంక హెచ్ఐసీసీ సదస్సులో పాల్గొంటారు. 

21:50 - November 28, 2017

అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు... ఈ ఇంటర్నెట్ యుగంలో పైపై డెకరేషన్లతో అసలు రంగు దాగుతుందా? నగరాన్ని నివాసయోగ్యంగా మార్చటం, సుందరంగా మలచటం అనేది ఓ నిరంతర ప్రక్రియ. అది రాత్రికి రాత్రో, ఓ వారం రోజుల్లోనో చేసేది కాదు. దానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల గౌరవం ఉండాలి. కానీ, అతిధుల ముందు గొప్పలుపోయే ప్రభుత్వాలకు సామాన్యుడి సంగతి పట్టదని మరోసారి రుజువయింది. వారం రోజుల్లో ప్రజల సొమ్మును కోట్లు ఖర్చుపెట్టిన తీరు అనేక ప్రశ్నలకు కారణమౌతోంది. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అసలిది భాగ్యనగరమేనా? మన గతుకుల రోడ్లేమయ్యాయి..అడుగడుగునా కనిపించాల్సిన చెత్తకుప్పలెక్కడ? అడుగడుగునా కనిపించే బిచ్చగాళ్లెక్కడ? నగరానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి డ్రైనేజీ వాసనలెక్కడ? పూలవనాలు, దీపాలంకరణలు, ఆహ్లాదభరిత పరిమళాలు ఆహా..ఇది భాగ్యనగరమేనా? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:14 - November 28, 2017
09:19 - November 28, 2017

హైదరాబాద్ : ప్రధాని మోడీ మెట్రో ను నేడు జాతికి అంకితం చేయనున్నారు. మోడీ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని అక్కడ నుంచి మియాపూర్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు మోడీ ప్రారంభించానున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

09:05 - November 28, 2017
08:04 - November 28, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్ ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఆమె ఉదయం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె మధ్యాహ్నం 2గంటల వరకు ట్రైడెంట్ హోటల్ లోనే ఉంటారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:48 - November 28, 2017

హైదరాబాద్ : ఇవాంక ట్రంప్‌..ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. వైట్‌హౌస్‌లో చక్రం తిప్పే పవర్‌ఫుల్‌ లేడీ. శ్వేతసౌధంలో సలహాదారు హోదాలో అధికార కేంద్రంగా పనిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తన గారాల పట్టి ఇవాంక చెప్పిందే వేదం. తండ్రి వెంటే ఉండే ఈ బ్యూటీ.. అంతర్జాతీయ వేదికలపై అమెరికా ప్రతినిధిగా పాల్గొంటుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఇవాంక ట్రంప్‌పైనే పడింది. ఆమె ఏం మాట్లాడుతారు? ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు? భారత్‌, అమెరికా సంబంధాల గురించి ఆమె మదిలో ఏముంది ? ఇలా పలు ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇవాంక వ్యక్తిగత జీవితంలో అనేక విభిన్న అంశాలు
ఇవాంక వ్యక్తిగత జీవితంలో అనేక విభిన్న అంశాలు కనిపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య సంతానమే ఇవాంక. 1981, అక్టోబర్ 30న జన్మించింది. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క మోడలింగ్‌లో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. 14 ఏళ్ల వయసులోనే మోడిలింగ్‌ను స్టార్ట్ చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చింది. మిస్ యూఎస్ఏ పోటీల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. 2004లో ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకుంది. ఫ్రెంచ్ భాషపై కూడా మంచి పట్టున్న ఇవాంకా తండ్రి గొప్ప వ్యాపార వేత్త అయినా తమ వ్యాపార సంస్థల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అనుభవం కోసం బయటి సంస్థల్లో కొద్దికాలంపాటు పనిచేసి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుంది. ట్రంప్‌ ఆర్గనేజైషన్‌లో ఇవాంక ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇవాంక బ్రాండ్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. ది అప్రెంటీస్‌ అనే టీవీషోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తండ్రితో పాటు ప్రచారంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. రాజకీయ నిర్ణయాల్లో కూతురు ఇవాంక సలహాలు ట్రంప్ తూ.చ. తప్పకుండా పాటిస్తారట. అందుకే ఈ ఏడాది మార్చిలో ఆమెకు వైట్‌హౌస్‌ సలహాదారుగా అధికారిక హోదా ప్రకటించారు

బుధవారం ఛార్మినార్‌ టూర్‌కు....
గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సుకు ఇవాంక స్టార్‌ అట్రాక్షన్‌గా మారారు. మంగళవారం ఇవాంక జీఈ సదస్సుకు హాజరువుతారు. రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే డిన్నర్‌కు అటెండ్ అవుతారు. బుధవారం ఛార్మినార్‌ టూర్‌కు వెళ్తారు. లాడ్‌ బజార్‌లో బ్యాంగిల్స్ షాపింగ్స్ చేస్తారు. ఇక ఈవెనింగ్ గోల్కొండలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ట్రీట్‌కు హాజరవుతారు. 

06:47 - November 28, 2017

హైదరాబాద్: ఇవాంక ట్రంప్ తెల్లవారుజామున 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆమె షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము 3 గంటలకు ఇవాంక శంషాబాద్‌ చేరుకున్నారు. అటునుంచి తాను బసచేయనున్న ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 5.50కి తిరిగి ట్రైడెంట్‌ హోటల్ కు చేరుకుంటారు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10. 40కి తిరిగి ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుని జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకుంటారు.

20:20 - November 27, 2017

మెట్రో రైలు పరుగులు తీసే సమయం దగ్గరకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న భాగ్యనగర వాసి పిల్లర్లపై పరుగులు తీసే మెట్రోలో పయనించబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో పాటు, మరికొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. సదుపాయాలు, పార్కింగ్ గురించి పలుప్రశ్నలు వినిపిస్తుంటే, అసలీ మెట్రో సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అనే సందేహాలూ.... టికెట్ రేట్లు అనూహ్యంగా పెంచిన తీరుపై విమర్శలూ వినిపిస్తున్నాయి. సో పరుగులు తీయనున్న మెట్రోపై ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూస్తున్న మెట్రో రైలు మరికొద్ది గంటల్లో నగరంలో పరుగులు పెట్టనుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి మెట్రో నగర ముఖ చిత్రాన్ని ఎలా మార్చనుంది.. ?మెట్రో స్టేషన్ల నిర్వహణ ఎలా ఉండబోతోంది? భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి. మానవ రహిత ఆటోమాటిక్ సిస్టమ్ లు ఎలా పనిచేస్తాయిదీనిపై మెట్రో వర్గాలేం చెప్తున్నాయి?

మెట్రో రైలు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా?నగర వాసులను ఊరిస్తూ వస్తున్న మెట్రో సాధారణ ప్రజానీకానిగా బరువుగా మారనుందా? అవునంటున్నారు ప్రజలు. టికెట్ రేట్లు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగా కనిపిస్తున్న తీరు నిరాశకు గురిచేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు మెట్రో రైలు టికెట్లు ఎలా ఉన్నాయి?దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశహర్మ్యాలూ విశాలమైన రోడ్లూ ఫ్లైఓవర్లతో నగర ముఖచిత్రం మారిపోయింది. నగరానికి సైబరాబాద్‌ అనుబంధమైంది. ప్రపంచ స్థాయి సంస్థలెన్నో నగరంలో తమ చిరునామా ఏర్పరచుకున్నాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, టూరిజం రంగాల్లో వేగంగా అభివృద్ధిని నమోదు చేస్తున్న నగర జనాభా ఇప్పటికే కోటి దాటుతోంది. ఈ తరుణంలో వస్తున్న మెట్రోపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో పార్కింగ్ లాంటి పలు సమస్యలకు ఇంకా సమాధానం కనిపించని పరిస్థితి ఉంది

రవాణా సదుపాయాలు పెరగటం ఏ నగరానికైనా మంచి విషయమే. అందునా, జనాభా విపరీతంగా పెరుగుతూ, వివిధరంగాల పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్న భాగ్యనగరంలో మెట్రో సదుపాయం రావటం ఉపయోగమే. కానీ, సామాన్యుడికి అందుబాటులో లేని అభివృద్ధి వల్ల ప్రయోజనాలు స్వల్పమే. అశేష ప్రజానీకం భరించగలిగేలా మెట్రో ఛార్జీలు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇలాంటి భారీ ప్రాజెక్టుల పరమార్ధం నెరవేరుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:49 - November 27, 2017

హైదరాబాద్ : ప్రపంచ వ్యాపారసదస్సుకు హాజరవుతున్న ఇవాంక ట్రంప్‌ ఏ హోటల్‌లో బస చేస్తుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముందుగా హైటెక్‌సిటీలోని మైండ్‌స్పేస్‌ హోటల్‌లో ఆమె బసకు ఏర్పాట్లు చేశారు. తాజాగా అదే ప్రాంతంలోని మరో హోటల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ట్రెటెన్డ్‌ హోటల్‌లో ఇవాంక విడిది ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Trump Daughter