TS Budget 2018

21:04 - March 17, 2018

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన కేటీఆర్ నియోజకవర్గంలో ఖాళీ బిందెలు నిరసన చేస్తున్న మహిళలు..

21:38 - March 16, 2018

తెలంగాణ జనం సంతోషంగున్నరు...ఆనందం ఎల్లగక్కిన అధినేత కేసీఆర్, మందక్రిష్ణను మళ్ల అణచివేస్తమన్న సీఎం..మస్తుగ జూశ్నం మీ అసొంటోళ్లనన్నక్రిష్ణ, అయ్యా భజన సుర్వు జేశ్న నారా లోకేశం...ఆర్కేస్ట్రా టీం ఒక్కటే తక్వుండే అసెంబ్లీల, చైర్మన్ సారు కంటి చికిత్స విజయవంతం...డాక్టర్లకు రుణపడి ఉన్న తెలంగాణ జనం, ఎంపీ, ఎమ్మెల్యే కీసులాటకు సీఐ బలి...బహుజన పోలీసు అధికారి సస్పెండ్, ఉంటె పులన్న ఉండాలే లేదంటె మేమన్న..చిర్తపులి రావొద్దని ఊరి జనాల ధర్నా... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

19:19 - March 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌లో సామాజిక సమతుల్యత లోపించిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బడ్జెట్‌లో చిన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, ఎంబీసీలకు కులాల జాబితా ప్రకటించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు అవకాశం కల్పించాలన్నారు. ఈ నెల 19న బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

 

 

21:34 - March 12, 2018

హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని.. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్టగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం
తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విపక్షాల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత : గవర్నర్
అలాగే తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందని.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలను ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని తప్పు పట్టిన విపక్షాలు
మరోవైపు గవర్నర్‌ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ప్రసంగం మొత్తం అబద్దాలే ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తుల విషయంలోనూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.గవర్నర్‌ ప్రసంగం మొత్తం సత్యదూరంగా ఉందంటూ ప్రసంగం మధ్యలోనే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలోని ఏ అంశాన్నీ గవర్నర్‌ ప్రసంగంలో పెట్టలేదని టీడీపీ ఆరోపించింది. చివరిబడ్జెట్‌లోనైనా న్యాయం చేస్తారనుకుంటే అదీ లేదని ఆపార్టీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య మండిపడ్డారు.

రైతులను విస్మరించారు : సున్నం రాజయ్య
రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఎరువుల సాయం అంశాలను గవర్నర్‌ ప్రసంగంలో విస్మరించారని సీపీఎం ఆరోపించింది. మిషన్‌ భగీరథ 90 శాతం పూర్తయిందనడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఖండించారు. స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ వర్కర్లు, నిరుద్యోగుల అంశాన్ని గవర్నర్‌ ప్రస్తావించలేదన్నారు.

21:27 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తొలి రోజే గందరగోళం ..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే గందరగోళం నెలకొంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు చేపట్టిన నిరసన... సభలో గందరగోళానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగాన్ని వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మరింత ముందుకెళ్ళాలని భావించిన సభ్యులు...తమ చేతిలోని ప్రసంగం కాపీలను చించి విసిరారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టేబుల్‌పైనున్న హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడంతో.. అది గవర్నర్‌ పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్పగాయమైంది. గవర్నర్‌ ప్రసంగం అయ్యే వరకు అలాగే ఉండి తర్వాత సరోజనీ దేవి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

దాడికి పాల్పడిన సభ్యులపై కఠిన చర్యలు :
సభలో కాంగ్రెస్ సభ్యులు అనుసరించిన తీరును టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దాడికి పాల్పడిన సభ్యులపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు సభలో ఉండటం ఇష్టం లేదని హరీష్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గుండాల్లాగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, కొండాసురేఖ విమర్శించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారమే కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారని మీడియా పాయింట్‌ వద్ద అన్నారు.

గొంతునొక్కేస్తున్నారు : విపక్షాలు
ఇటు కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అంతే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సభలో తమగొంతునొక్కేస్తున్నారని.. అసలు నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహిరించదని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా లేదని.. అందుకే తాము ఆందోళన చేశామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లామన్నారు... అయితే మార్షల్స్‌ తమకు అడ్డుతగిలి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గలాటాలోతన కాలికి గాయం అయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చూపించారు. అయితే తమ ఆందోళన గవర్నర్‌ మీదే తప్ప...మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ మీద కాదని..ఇది అనుకోకండా జరిగిన పరిణామం అని విచారం వ్యక్తం చేశారు.

27 వరకు శాసనసభ సమావేశాలు
అనంతరం జరిగిన బిజినెస్‌ అడ్వయిజరీ మీటింగ్‌లో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

17:58 - March 12, 2018

హైదరాబాద్ : సభలో విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఇవాళ సభలో.. జరిగిన తమ ఆందోళనను పెద్దదిగా చేసి.. ప్రయోజనం పొందాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మొదట మాములుగా కనిపించిన మండలి ఛైర్మన్.. తరువాత ఆసుపత్రికి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మటిరెడ్డితో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

17:24 - March 12, 2018
17:13 - March 12, 2018

హైదరాబాద్ : మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు..గూండాల్లాగా కాంగ్రెస్ శాసన సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హెడ్ ఫోన్ సెట్ ను తిప్పి తిప్పి కొట్టటం ఎంతవరకూ సమంజసం అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఘటనపై సీసీ పుటేజ్ ను పరిశీలించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతోంది. కాగా తాము చేసింది నిరసనలో బాగమే తప్ప ఉద్ధేశ్యపూర్వకంగా కాదనీ..మాపై చర్యలు తీసుకుందుకు మాపై టీఆర్ఎస్ సర్కార్ కుట్రపన్నుతోందని వారు ఆరోపిస్తున్నారు. గౌరవనీయులై సభాధ్యక్షుడిపై గూండాల్లా ప్రవర్తించిన మీది కుట్రా? ప్రజాస్వామ్య బద్ధంగా సభ నడుపుతున్న మాది కుట్రా? అని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కోమటిరెడ్డితో సహా మరో ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సమాలోచన చేస్తోంది. కాగా మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్ ఫోన్ విసరటం, అనంతరం ఆయనను సరోజినీదేవి కంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే.

16:01 - March 12, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్‌ అన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపించివేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పట్ల గవర్నర్‌ స్పీచ్‌లో ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణలో 4వేల మంది చనిపోయిన రైతులవి ఆత్మహత్యలు కాదని కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు ఉత్తమ్‌. తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో లక్షా నలభైవేల కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 

15:07 - March 12, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగిస్తుండగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలకు సర్కార్‌ సిద్దమైంది. కోమటిరెడ్డి, సంపత్‌, మరో ఇద్దరు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. వీడియో ఫుటేజి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - TS Budget 2018