tv

10:06 - April 8, 2017

పాకిస్తాన్ లో తన సినిమా విడుదల చేయవద్దని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. ఆయన నటించిన 'దంగల్' చిత్రం ఏ మేర విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం భారీగా కలెక్షన్లు సైతం రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనా పాక్ లో మాత్రం విడుదల కాలేదు. 2016 జమ్మూ కాశ్మీర్ లోని ఉరి దాడుల అనంతరం పాక్ లో భారత సినిమాలను ప్రదర్శించడం లేదనే సంగతి తెలిసిందే. అనంతరం గొడవలు సద్దుమణిగిన అనంతరం సినిమాలప నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో 'దంగల్' సినిమాను పాక్ లో విడుదల చేయాలని పాక్ లో ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కోరారు. దీనికి 'అమీర్' ఒప్పుకున్నారు. కానీ 'దంగల్' సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా...జాతీయగీతం ఉండడంతో ఈ సన్నివేశాలని తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు ఆదేశించడం పట్ల 'అమీర్' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడకు సంబంధించిన అంశమని..భారత్..పాక్ కు ఎలాంటి సంబంధం లేదని..అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సినవసరం ఏంటీ ? అని అమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పాక్ లో సినిమాను విడుదల చేయడానికి అమీర్..చిత్ర యూనిట్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

21:33 - March 26, 2017

ధర్మశాల వేదికగా సాగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్‌ ఆచితూచీ ఆడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో టెస్ట్‌లో భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు పోరాడుతున్నాయి. ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 300 రన్స్‌కే కట్టడి చేసిన భారత్‌.. భారీ స్కోరు సాధించేందుకు శ్రమిస్తోంది. ప్రారంభంలోనే ఓపెనర్ మురళీ విజయ్‌ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మాధ్యూవేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. 87 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ ఔటయ్యాడు. రాహుల్ 60 పరుగులు చేశాడు.

248 పరుగులు..
పుజారాతో జతకలిసిన అజింక్యా రహానే ఆచితూచి ఆడుతూ స్కోరును 150 పరుగులు దాటించారు. ఈ సమయంలోనే 57 పరుగులతో జోరుమీదున్న పుజారా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ 5పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో 167 పరుగులకే భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌... రహానేతో కలిసి 49 పరుగులు జోడించారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రహానే.. ఆలియాన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత ఆల్‌రౌండర్ అశ్విన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. దీంతో 221 పరుగులకే భారత్‌ ఆరువికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా, జడేజా మరో విక్కెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. మొత్తంగా ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 248 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. భారత బ్యాటింగ్‌ జోరుకు.. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ అడ్డుకట్ట వేశాడు. కీలక సమయాల్లో నాలుగు వికెట్లు తీశాడు.

21:31 - March 26, 2017
13:54 - March 22, 2017

సినిమాల్లో 'ఎల్బీ శ్రీరాం' తెలియని వారుండరు. ఎందుకంటే ఆయా సినిమాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. మరి ఆయన 'పక్షి' తీర్థం పుచ్చుకోవడం ఏంటీ ? పక్షి అని ఏదైనా పార్టీ పెట్టారా ? లేక దానిపేరు మీదున్న పార్టీలో చేరారా ? అని అనుకోకండి. రచయితగా పరిశ్రమలోకి వచ్చి, తరువాత 'చాలాబాగుంది' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యి పాతికేళ్లకు పైగా సినిమా పరిసమలో కొనసాగుతున్నాడు ఎల్బీ శ్రీరాం. ఇటీవలే ఆయన ఎల్ బి క్రియేషన్స్ బ్యానర్ పై షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు. ‘పక్షి' తీర్థం అంటే ట్విట్టర్ ఖాతా తెరిచారని అర్థం. మార్చి 18న ట్విట్టర్ ఖాతా తెరిచిన ఎల్బీ శ్రీరామ్.. తనదైన రచనా శైలిలో ట్వీట్ చేశారు. ‘'ఇ-ప్పు-డే' కొత్త రెక్కలతో 'L'B-oard పెట్టుకుని ఈ 'పక్షి'తీర్థానికి ఒచ్చేను వసంతానికి ముందే ""కో"" అని కూస్తూ.....!!’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు స్వాగతం పలికారు. మరికొంతమంది ఫన్నీగా ట్వీట్ చేశారు.

21:39 - March 4, 2017

హైదరాబాద్ : అమరావతిలో శాసనసభ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. రోజాపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై కమిటీ చర్చించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. రోజా బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ సభ్యులు తెలిపారు. రోజా వివరణపై ప్రివిలేజ్‌ కమిటీ సంతృప్తి చెందలేదు. గతంలో రోజాను ఏడాదిపాటు శాసనసభ సస్పెండ్‌ చేసింది. రోజా సమాధానం సంతృప్తిగా లేనందున శాసనసభ నిర్ణయాన్ని పునరుద్ధరించాలని కమిటీ భావించింది. ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని కమిటీకి సిఫారసు చేసింది. ఈనెల 7న నివేదికను క్రమశిక్షణా కమిటీ శాసనసభకు సమర్పించనుంది.

 

22:15 - March 3, 2017

పెరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు..భార్యను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న ఎస్సై, బాలల హక్కుల సంఘం అధికారుల చెంపచెల్లుమనిపించిన మహిళ, సీఎం చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని యజ్ఞయాగాలు, టీటీడీ హుండీలో పాత నోట్లు.. తిరుమల ఎంకన్న అరెస్టుకు రంగం సిద్ధం..? ఆగిన చైల్డ్ మ్యారేజీ... 13 ఏళ్ల అమ్మాయికి పెళ్లి..ఆ ఊరి పిల్లను ఆ ఊరి పిల్లగానికే ఇస్తరంట... ఊర్లో పెళ్లి సందడి, ఆడి పాడిన తాటికొండ రాజన్న..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:45 - March 3, 2017

విజయ దేవరకొండ హీరోగా, పూజా జవేరి హీరోయన్ గా శ్రీనివాస రవీంద్ర రచించి, దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం 'ద్వారక'..ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రద్యుమన్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది...? ప్రేక్షకులు ఫీలింగ్స్ ఏమిటీ...? సినిమా రేటంగ్ వంటి వివరాలను వీడియోలో చూద్దాం...

20:49 - March 3, 2017

చిత్తూరు : రద్దైన వెయ్యి, 5వందల నోట్లను భక్తులు శ్రీవారి హుండీలో వేయడం ఇకనైనా మానుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. పాతనోట్ల మార్పిడికి గడువు ముగిసినా భక్తులు ఇంకా వాటినే హుండీలో వేస్తున్నారని చెప్పారు. డిసెంబర్‌ 31 నుంచి  ఇప్పటి వరకు భక్తులు హుండీ ద్వారా 8.29 కోట్ల రూపాయలు సమర్పించారని చెప్పారు. ఈ నగదును తీసుకోవడానికి ఆర్బీఐ నిరాకరిస్తోందన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఇవాళ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...భక్తులు ఇకనైనా పాతనోట్లను   హుండీలో వేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

20:25 - March 3, 2017

సూర్యాపేట : జిల్లాల్లో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.. పెట్టిన పెట్టుబడిఅయినా తిరిగిరాక నిమ్మకాయల్ని చెట్టుపైనే వదిలేస్తున్నారు రైతన్నలు.. వందల కిలోమీటర్ల దూరంలోఉన్న మార్కెట్‌కు పంట తరలించలేక... ఆ ఖర్చులు భరించలేక కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలో నిమ్మ రైతుల దీనావస్థపై టెన్ టివి స్పెషల్ రిపోర్ట్. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

20:08 - March 3, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన దురదృష్టకరమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తప్పుపట్టారు. తెలంగాణపై చంద్రబాబు విషంకక్కుతున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో పోటీ పడవద్దని హితవు పలికారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - tv