UAE

11:23 - December 5, 2018

వాయిదాలు లేవు.. వన్ టైం సెటిల్ మెంట్ కూడా లేదు.. మొత్తం అప్పు కట్టేస్తా.. తీసుకోండి అంటూ బ్యాంకులతోపాటు భారత ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చారు విజయ్ మాల్యా. అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాననే విషయంగా గతంలోనే చెప్పాను.. అయినా నా మాట ఎందుకు వినిపించుకోవటం లేదు.. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ట్విట్ ద్వారా ప్రశ్నించారు మాల్యా. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గట్టి పారిపోయాడు అంటూ తెగ గోల చేస్తున్నారని.. ఇదంతా అబద్దం అని స్పష్టం చేశారాయన. 

 

నన్ను విలన్‌గా చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ట్వీట్స్ చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అకస్మాత్తుగా నష్టాల్లో కూరుకపోయిందని.. అప్పులు పెరిగాయని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు 100 శాతం ఇస్తానని చెప్పాను.. దయచేసి తీసుకోండి అంటూ వేడుకున్నారు. ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే విధించాలన్న మాల్యా విజ్ఞప్తిని ముంబై ప్రత్యేక కోర్టు కొటివేసిన సంగతి తెలిసిందే. భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న సమయంలో మాల్యా స్పందించడం విశేషం.

Politicians and Media are constantly talking loudly about my being a defaulter who has run away with PSU Bank money. All this is false. Why don’t I get fair treatment and the same loud noise about my comprehensive settlement offer before the Karnataka High Court. Sad.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

Airlines struggling financially partly becoz of high ATF prices. Kingfisher was a fab airline that faced the highest ever crude prices of $ 140/barrel. Losses mounted and that’s where Banks money went.I have offered to repay 100 % of the Principal amount to them. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

For three decades running India’s largest alcoholic beverage group, we contributed thousands of crores to the State exchequers. Kingfisher Airlines also contributed handsomely to the States. Sad loss of the finest Airline but still I offer to pay Banks so no loss. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

I see the quick media narrative about my extradition decision. That is separate and will take its own legal course. The most important point is public money and I am offering to pay 100% back. I humbly request the Banks and Government to take it. If payback refused, WHY ?

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018
08:00 - September 14, 2018
ఢిల్లీ : ఆసియాకప్‌ చరిత్రలో ఆరుసార్లు విజేతగా నిలిచిన  టీమ్‌ఇండియా..తమకు కలిసొచ్చిన టోర్నీలో మరోసారి  కలబడుతోంది. ఆసియా క్రికెట్‌ దేశాల మధ్య స్నేహపూర్వక  వాతావరణం పెంపొందించడం కోసం 1983లో తొలిసారిగా  ఆసియాకప్‌ నిర్వహించారు. ఆసియాక్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహణ  బాధ్యతలు చూసుకుంది. అయితే 2015 నుంచి ఐసీసీ దీనిని  నిర్వహిస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఒకసారి  టీ20 కప్‌గా, మరోసారి వన్డే కప్‌గా రొటేషన్‌ పద్ధతిలో  జరుపుతున్నారు. చివరిసారిగా 2016లో జరిగిన టీ20  కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది.

ఎప్పటిలాగే ఈసారి కూడా మిగతా జట్ల కంటే టీమ్‌ఇండియానే  పటిష్టంగా కనిపిస్తున్నది. రోహిత్‌శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌  రాహుల్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్  పాండ్యతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్‌,  శార్దూల్‌తో పేస్‌ ఎటాక్...చాహల్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌తో స్పిన్‌  ఎటాక్‌ సైతం స్ట్రాంగ్‌గా ఉంది. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌  ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను  సెప్టెంబర్‌ 18న హాంకాంగ్‌తో ఆడుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్‌ 19న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది.

భారత్‌ తర్వాత శ్రీలంక అత్యధికంగా ఐదు సార్లు ఆసియాకప్  గెలిచింది. లంక..ఈసారి అంత బలంగా కనిపించకపోయినా,  యువ క్రికెటర్లతో జట్టు సమతూకంలోనే ఉన్నది. కెప్టెన్‌  మాథ్యూస్‌కు తోడు సీనియర్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ జట్టులో  చేరడం లంకకు కలిసొచ్చే అంశం. గాయం కారణంగా దినేశ్‌ చండిమాల్‌ ఆఖరి నిమిషంలో తప్పుకోవడం ఆ జట్టును కొంత కలవరపరిచే అంశం. అటు బంగ్లాదేశ్‌ కూడా బలంగా  కనిపిస్తోంది. కెప్టెన్‌ మొర్తజా, ఆల్‌రౌండర్‌ షకీబ్‌, ముష్పికర్‌  రహీమ్‌, మహ్మదుల్లా జట్టులో కీలకపాత్ర పోషించనున్నారు. దీంతో తొలి మ్యాచ్‌ కావల్సినంత కిక్‌ ఇవ్వడం ఖాయం.

సర్ఫరాజ్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌  మినహా మిగతా వారందరూ యువ క్రికెటర్లే. బాబర్‌ అజామ్‌,  ఫక్హర్‌ జమాన్‌, మహ్మద్‌ అమీర్‌, జునైద్ ఖాన్‌ కీలక ఆటగాళ్లు.  పాక్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 16న హాంకాంగ్‌తో  ఆడుతుంది. మరోవైపు పసికూనలు అనే ముద్ర చేరిపేసుకునేందుకు  ఆఫ్ఘనిస్థాన్‌ సిద్ధమైంది. కెప్టెన్‌ అస్గర్‌ ఆఫ్ఘాన్‌తో పాటు మహ్మద్‌ నబి వంటి సీనియర్లుండగా...స్పిన్‌ సంచలనాలు రషీద్‌ఖాన్‌, ముజీబుర్‌ రహ్మన్‌ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వాలని తహతహలాడుతున్న ఆఫ్ఘన్‌ సెప్టెంబర్‌  17న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. మొత్తానికి క్రికెట్‌ అభిమానులను 14 రోజుల పాటు అలరించేందుకు ఆసియాకప్‌ సిద్ధమైంది.

ఆసియా కప్‌ షెడ్యూల్‌
సెప్టెంబర్‌ 15 – బంగ్లాదేశ్‌ × శ్రీలంక
సెప్టెంబర్‌16 – పాకిస్థాన్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌17 – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌
సెప్టెంబర్‌18 – భారత్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌19 – భారత్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబర్‌20 – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబర్‌21 – Supe 4 మ్యాచ్‌ 1, 2
సెప్టెంబర్‌23 – Super 4 మ్యాచ్‌ 3, 4
సెప్టెంబర్‌25 – Super 4 మ్యాచ్‌ 5
సెప్టెంబర్‌26 – Super 4 మ్యాచ్‌ 6
సెప్టెంబర్‌28 – ఫైనల్‌
18:12 - August 25, 2018

ఢిల్లీ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కేరళకు భారీ ఎత్తున సామాగ్రిని పంపనుంది. యూఏఈ ప్రభుత్వ విమాన సంస్థ ఎమిరేట్స్ విమానంలో 175 టన్నుల సహాయ సామాగ్రిని తీసుకుని   కేరళకు బయలుదేరింది. కేరళకు యూఏఈ అండగా ఉంటుందని, 175 టన్నుల సామాగ్రిని తీసుకొస్తున్నామని ఎమిరేట్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. యూఏఈలోని ఎంతోమంది వ్యాపారవేత్తలు, ప్రజలు, సంస్థలు అందించిన సాయాన్ని విమానాల ద్వారా తిరువనంతపురానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోట్లు, రగ్గులు, నిల్వ ఆహార పదార్థాలు, తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నారు. యూఏఈలో పనిచేస్తున్న విదేశీయుల్లో 80 శాతం మంది కేరళ వాసులే ఉండడంతో వరద బాధితులను ఆదుకునేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది.

18:28 - October 23, 2017

ఢిల్లీ : యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథార్టీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టే బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో అధిక శాతం ఏపీలో పెట్టాలని బాబు కోరారు. ఇందుకు ఏడీఐఏ సంసిద్ధత వ్యక్తం చేసింది. అత్యంత క్లిష్ట సమయంలో నవ్యాంధ్రలో సీఎంగా బాధ్యతలు స్వీకరించాననని, సంస్కరణలు చేపట్టి సంక్షోభాన్ని అధిగమించడం జరిగిందని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న సహజ వనరులు, సుదీర్ఘ సముద్ర తీరం..రైలు..అంతర్గత జల రవాణా..మార్గాలు మరే ఏ రాష్ట్రానికి లేవని తెలిపారు. 15 శాతం వృద్ధిని 15 ఏళ్ల పాటు స్థిరంగా కొనసాగించడమే తమ లక్ష్యమని బాబు పేర్కొన్నారు. 

06:41 - January 4, 2017

హైదరాబాద్ : ముంబై వరుస పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. దుబాయ్‌లో దావూద్‌ సోదరుడు గోల్డెన్‌ బాక్స్‌ పేరుతో ఓ కంపెనీని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. డాన్ దావూద్ ఇబ్రహీంకు ఇండియా, పాకిస్థాన్‌తో పాటు దుబాయ్, మొరాకో, స్పెయిన్, సింగపూర్, థాయిలాండ్, సైప్రస్, టర్కీలో పలు ఆస్తులున్నాయి. దుబాయ్‌లో ఉన్న దావూద్‌ స్థలాలను యూఏఈ అధికారులు సీజ్‌ చేశారు. భారత్‌ నుంచి దావూద్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు దుబాయ్‌కు పంపించడంతో అక్కడ ప్రభుత్వం ఇటీవల విచారణ చేపట్టింది.

దుబాయ్‌ ప్రభుత్వానికి దావూద్‌ అక్రమాస్తుల వివరాలు అందజేత

అయితే దుబాయ్‌లోని రూ.15,000 కోట్ల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ఏడాది దుబాయ్ వెళ్ళిన ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, దావూద్‌కు సంబంధించిన అక్రమాస్తుల వివరాలను ఆ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన యూఏఈ అధికారులు దావూద్‌కు చెందిన గోల్డెన్ బాక్స్ కంపెనీ ఆస్తులు, షేర్లతోపాటు పలు హోటల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

16:07 - June 6, 2016

మనసుకు నచ్చిన వాటిని కొనేయడం..ఎంత ధర ఉన్నా వాటిని కొంతమంది చేజిక్కించుకోవడానికి పోటీ పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అందులో నెంబర్స్ కూడా ఒకటి. తాము కొన్న కార్లకు ప్రత్యేక నెంబర్లు ఉండాలని వేలు..లక్షలు పోసి తీసుకుంటూ ఉంటుంటారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 11 లక్షలు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. అందర్నీ తలదన్నే విధంగా ఓ వ్యక్తి కోట్లు కుమ్మరించాడు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరిగిన ఫ్యాన్సీ నెంబర్లు వేలం చూస్తుంటే నోట మాట రాదంటే నమ్మండి. '1' నెంబర్ కోసం ఆ దేశానికి చెందిన అరబ్ షేక్ ఏకంగా రూ. '32 కోట్లు' తగలేశాడు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం చూసిన వారు ఆశ్చర్యపోయారంట. ఈ నెంబర్ తో పాటు ఇతర నెంబర్లు కూడా వేలం వేసిన నిర్వాహణ సంస్థ రూ. 91 కోట్ల ఆదాయం పొందిందంట. 

13:36 - March 11, 2016

యూఏఈ : ఏడారి దేశాలను వర్షం ముంచేసింది. వడగాల్పులు తప్ప వాన జాడలేని దేశాల్లో ఇప్పుడు రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. 2రోజులుగా కురుస్తున్న వర్షాలతో గల్ఫ్ దేశాల్లో కొత్త వాతావరణం కనిపిస్తోంది. 
తగ్గుముఖం పడుతున్న వరదలు
ఏడారి దేశం యూఏఈలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటలుగా స్తంభించిన జనజీవనం ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న షార్జాకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోగా, నేడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. జనాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకి వస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కొన్ని విమాన సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు.
యూఏఈ అతలాకుతలం
ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం అతలాకుతలమైంది. ఆ ఒక్కరోజే 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అటు వర్షాల కారణంగా దాదాపు 250  రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.
దుబాయ్ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం 
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరం దుబాయ్ సహా అక్కడి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, జోరువానలతో అక్కడి జనజీవనం స్థంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది. అయితే చాలా ఏళ్ల తరువాత ఇంతగా వర్షాలు పడటంతో... దుబాయ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

07:26 - March 4, 2016

ఆసియా కప్‌ ట్వంటీ 20 మ్యాచ్‌లో పసికూన యూఏఈపై పై భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలింగ్‌తో యూఏఈను బెదరగొట్టిన భారత్‌..అటు తరువాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. యూఏఈ విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్‌లు మరో వికెట్ పడకుండా 39 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 10.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

18:10 - March 3, 2016

బంగ్లాదేశ్ : ఆసియా కప్‌ టీ-20 టైటిల్‌ ఫేవరెట్ టీమిండియా ..ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమయ్యింది.వరుసగా నాలుగో విజయంతో టైటిల్ ఫైట్ కు సమాయత్తం కావాలన్న పట్టుదలతో ఉంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే నాలుగో రౌండ్ పోటీలో పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టుతో ధోనీసేన తలపడుతుంది. రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన యువఆటగాడు పవన్ నేగీ, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పేసర్ భువనేశ్వర్ కుమార్ లకు..తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.... 
టీమిండియాకు యూఏఈ సవాల్
ఆసియా కప్‌లో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో భారత జట్టు ఆఖరాటకు సిద్ధమైంది. పవర్‌ ప్యాకెడ్‌ టీమిండియాకు ...యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ జట్టు సవాల్‌ విసురుతోంది. ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టి, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన......డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకను సైతం ఓడించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు  ఆడిన మూడు రౌండ్ల మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూఏఈ జట్టు ఢీలాపడింది.  
అదరగొడుతున్న టీమిండియా
ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా....అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌,విరాట్‌ కొహ్లీ, రహానే ,సురేష్‌ రైనా,  యువరాజ్‌ సింగ్‌,హార్ధిక్‌ పాండ్యా,  ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌ , జడేజాలతో  బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. 
ధోనీ సేన పట్టుదల
రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై , మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై సాధించిన విజయం ...భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ప్రస్తుత ఆసియా కప్‌లో అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించిన ఏకైక జట్టు భారత్‌ మాత్రమే. ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌లోనూ నెగ్గి ఫైనల్‌కు ముందు పూర్తి స్థాయిలో సమాయత్తమవ్వాలని ధోనీ సేన పట్టుదలతో ఉంది. 
మరింత బలపడిన భారత జట్టు బ్యాటింగ్‌ 
విరాట్‌ కొహ్లీ కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో ఉండటంతో పాటు.....మూడో మ్యాచ్‌తో యువరాజ్‌ సింగ్‌ ఫామ్‌లోకి రావడం భారత జట్టు బ్యాటింగ్‌ మరింత బలపడిందనే చెప్పాలి.  పేసర్లు నెహ్రా, బుమ్రా,పాండ్య ...స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.
రహానే,  నెగీ, పార్థీవ్‌ కు అవకాశం..? 
గాయాలతో ఇబ్బందిపడుతున్న రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, ధోనీలకు విశ్రాంతినిచ్చి..... ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌కు వారి స్థానంలో రహానే, పవన్‌ నెగీ, పార్థీవ్‌ పటేల్‌కు అవకాశమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జడేజా, అశ్విన్‌లలో ఒకరిని తప్పించి హర్భజన్‌ సింగ్‌ను తుది జట్టులో చోటు కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. 
తొలి విజయం కోసం యూఏఈ తహతహ 
మరోవైపు ఆసియా కప్‌ టోర్నీ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచి....మెయిన్‌ రౌండ్‌కు అర్హత సాధించిన అరబ్‌ ఎమిరేట్స్ జట్టు తొలి విజయం కోసం తహతహలాడుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఎమిరేట్స్ జట్టు.....బౌలింగ్‌ విభాగంలో మాత్రం నిలకడగా రాణించింది.
కీలక సమయాల్లో చేతులెత్తేసిన యూఏఈ
తనకంటే పటిష్టమైన శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లను దాదాపుగా ఓడించినట్లే కనిపించిన....యూఏఈ టీమ్‌ అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో కీలక సమయాల్లో చేతులెత్తేసింది. బౌలర్లు మహమ్మద్‌ నవీద్‌,జావెద్‌, షెహజాద్‌ నిలకడగా రాణిస్తూ....యూఏఈ జట్టును పోటీలో నిలుపుతుంటే, బ్యాట్స్ మెన్‌ వైఫల్యం కారణంగా ఎమిరేట్స్ జట్టు తేలిపోతోంది. బ్యాటింగ్‌లో షైమన్‌ అన్వర్‌...కెప్టెన్‌ అంజద్‌ జావెద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా...మిగతా బ్యాట్స్ మెన్‌  విఫలమవ్వడంతో యూఏఈ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లను సైతం ఓడిపోయింది. 
భారత జట్టుకే విజయావకాశాలు 
ఆసియా కప్‌లో ప్రస్తుత ఫామ్‌, ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే....ఈ మ్యాచ్‌లో భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాను ఓడించడం మాట పక్కన పెడితే....అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

 

09:54 - February 22, 2016

దుబాయి : పర్యాటక శాఖ..హోం మంత్రి శాఖ..పురపాలక శాఖ..ఇలాంటివి ఇంకా కొన్ని శాఖలుంటాయి. కానీ ఈ 'సంతోషం' శాఖేంటీ ? అని కన్ ఫ్యూజ్ అవుతున్నారా ? అవునండి సంతోషం అనే కొత్త శాఖను ఏర్పాటు చేసి ఏకంగా ఓ మంత్రికి దీని బాధ్యతలు అప్పచెప్పారు. ఇది జరిగింది మన దేశంలో కాదులెండీ...ప్రపంచంలోనే తొలిసారిగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చదవండి..
ప్రజల సంతోషమే తమ ధ్యేయంగా పనిచేయాలని అక్కడి ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగా 'సంతోషం' అనే శాఖను సృష్టించింది. ప్రజల మంచి కోసమే ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని దుబాయి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. ఒహుద్ అల్ రౌమీ అనే మహిళ నూతనంగా కేబినెట్ లో చోటు కల్పించి 'సంతోషం' శాఖకు మంత్రి బాధ్యతలను అప్పచెప్పారు. దేశ భవిష్యత్..యువతకు తోడ్పాడు..ప్రజల సంతోషం..ఉన్నత విద్య అంశాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మినిస్టర్ ఆఫ్ హ్యాపినెస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అదండి అసలు సంగతి..

Pages

Don't Miss

Subscribe to RSS - UAE