Udaipur

19:23 - December 9, 2018

రాజస్థాన్: భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతరు ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ అతిథులు వేడుకలకు తరలివచ్చారు. ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్‌ ఉదయ్‌విలాస్‌ వేదికగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈశా అంబానీ సంగీత్‌ వేడుకల్లో సినీ తారలే కాదు కుటుంబసభ్యులు కూడా డ్యాన్సులతో దుమ్మురేపారు. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం ఈశా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌లు సైతం పలు బాలీవుడ్‌ పాటలకు డ్యాన్సులు చేశారు. దీంతోపాటు నీతా, ఆకాశ్‌, అనంత్‌లు సైతం మరోసారి ఈశా కోసం స్టెప్పులేశారు. గులాబీ రంగు గ్రాండ్‌ లెహంగాలో పెళ్లికూతురు ఈషా జిగేల్‌మంది. ఈశా-ఆనంద్‌ల చెయ్యి పట్టుకుని స్వయంగా ముకేష్ అంబానీ వేదిక మీదకు తీసుకొచ్చారు. అన్నదమ్ములు ముకేష్‌, అనిల్‌ అంబానీలు స్వయంగా దగ్గరుండి అతిథులకు స్వాగతం పలికారు.
హిల్లరీ క్లింటన్‌, వివిధ సంస్థల సీఈవోలు, బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్ దంపతులు‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా దంపతులు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, జాన్వి, అమీర్‌ఖాన్ దంపతులు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. డిసెంబర్ 8న ప్రారంభమైన రెండు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు డిసెంబర్ 9తో ముగియనున్నాయి. 12న ముంబైలోని అంబానీ నివాసం యాంటీలియాలో ఈషా-ఆనంద్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

17:51 - December 9, 2018

ప్రపంచ కుబేరుల్లో ఆయనొకరు. భారత్‌లో నెంబర్ 1 సంపన్నుడు. అలాంటి వ్యక్తి ఇంట వివాహం అంటే మాములుగా ఉంటుందా. భారత బిజినెస్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న జరగనుంది. పెళ్లికి ముందు రెండు రోజుల వేడుకను ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుపుతున్నారు. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు నేటితో(డిసెంబర్ 9) ముగియనున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ కూడా విచ్చేశారు.

Image result for isha ambani

ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల ఎఫెక్ట్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. ఎయిర్‌పోర్టులో ఒక్కఃసారిగా విమాన రాకపోకలు పెరిగిపోయాయి. ప్రైవేటు ఫ్లైట్లు, విమానాలతో కిక్కిరిసిపోయింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు తమ ప్రైవేట్ ఫ్లైట్స్‌లో తరలివచ్చారు. ఈ క్రమంలో ముంబైలోని విమానాశ్రయం సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఎయిర్‌పోర్టులో ఒకే రోజు 1007 విమాన రాకపోకలు నడిచాయి. ఇది సరికొత్త రికార్డు. గతంలో 1003 విమానరాకపోకలు నడిచాయి. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యింది. 8, 9న ఈషా-ఆనంద్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయ్యాక.. డిసెంబర్ 12న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది.

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

08:56 - November 3, 2016

జైపూర్ : రాజస్థాన్‌లోని ఓ నగరంలోకి బీఎస్‌ఎఫ్‌ బలగాలతో అధికారులు వెళ్లారు..ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..అక్కడికి వెళ్లిన అధికారులు కూడా ఆ ప్రాంతంలో సోదాలు చేస్తే దొరికిన టాబ్లెట్లు చూసి నివ్వెరపోయారు..అవన్నీ మత్తు పదార్థాలే... భారీ డ్రగ్‌ రాకెట్‌ను చేధించిన డీఆర్‌ఐ అధికారులు బాలివుడ్‌ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు...అధికారుల రైడ్స్‌లో దొరికిన మత్తు పదార్థాల విలువ మూడువేల కోట్లకుపైనే...
పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు 
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు రెడీ చేస్తున్న భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టును విప్పారు డీఆర్‌ఐ అధికారులు...సెంట్రల్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి...వేల కోట్లు విలువజేసే డ్రగ్స్‌ను పట్టుకోవడంతో కలకలం రేపింది.
3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ సీజ్ 
రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. 3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
టాబ్లెట్ల రూపంలో తయారీ...
ఉదయపూర్ సమీపంలోని మరుధర్ డ్రింక్స్ అనే కంపెనీలో టాబ్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకుని దాడులు చేశారు...ఇందులో మెత్తం 2 కోట్లకుపైగా ఉన్న టాబ్లెట్స్ దొరికాయి..ఇవి 23 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని లెక్క తేల్చారు.... దీని మార్కెట్ విలువ 3వేల కోట్ల విలువ ఉంటుందని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్టమ్స్‌ చైర్‌ప‌ర్సన్ న‌జీబ్ షా వెల్లడించారు. ఇక్కడ త‌యారవుతున్న ఈ మాండ్రాక్స్ మాత్రలను మొజాంబిక్‌, సౌతాఫ్రికాల‌కు త‌ర‌లిస్తున్నట్లు విచారణలో తేలింది.

 

Don't Miss

Subscribe to RSS - Udaipur