up

16:51 - July 9, 2018

ఉత్తరప్రదేశ్‌ : గ్యాంగ్‌స్టర్‌ మున్నా బజరంగీని బాగ్‌పత్ జైలులో కాల్చి చంపారు. 2005లో బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన మున్నా బజరంగి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మున్నా బజరంగీపై హత్య, దోపిడి, తదితర 40 కేసులున్నాయి. మున్నాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసే ఆలోచనలో ఉన్నారని, ఆయనకు భద్రత కల్పించాలని మున్నా భార్య వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసినన నేపథ్యంలో ఈ హత్య జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన సిఎం యోగి ఆదిత్యనాథ్- జైలర్‌, డిప్యూటి జైలర్‌ను సస్పెండ్‌ చేసి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రేమ్‌ ప్రకాశ్‌ అలియాస్‌ మున్నా బజరంగిని 2009లో ముంబైలో అరెస్ట్‌ చేశారు. బజరంగి 2012 యూపీ ఎన్నికల్లో అప్నాదల్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. 

07:46 - May 30, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి రాజేష్‌ సాహ్ని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. సెలవుల్లో ఉన్న రాజేష్‌ ఇవాళ ఆఫీస్‌కు వచ్చారు. తన కారులో ఉన్న పిస్టల్‌ను సిబ్బందితో తెప్పించుకున్నారు. సర్వీస్‌ రివాల్వర్‌తో తనని తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సుసైడ్‌ నోట్‌ కూడా రాయలేదు. 1992 బ్యాచ్‌ ప్రొవెన్షియల్ పోలీస్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ రాజేష్‌ సాహ్ని యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌లో ఎఎస్‌పిగా ఉన్నారు. ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో రాజేష్‌ కీలక పాత్ర పోషించారు. రాజేష్‌ సాహ్ని నిబద్ధత గల అధికారని యూపీ డిజిపి ఓమ్‌ ప్రకాశ్‌సింగ్ ట్వీట్‌ చేశారు. అతని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదన్నారు.

 

22:24 - April 3, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు సరికాదని సీపీఎం కేంద్రదర్శివర్గసభ్యులు వి.శ్రీనివాస్ రావు అన్నారు. కోర్టు తీర్పుకు కేంద్రం వత్తాసు పలుకుతుందన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పీవో యాక్టు కింద కేసులు బుక్ అయ్యే అవకాశమే లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పీవో యాక్టు స్ఫూర్తికి భిన్నమైందన్నారు. తీర్పు పట్ల కేంద్రం నిర్లక్ష్యం మూలంగా ఆందోళనలు చెలరేగాయన్నారు. వెంటనే రివ్యూ పిటిషన్ వేసిఉంటే బాగుండేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఉన్న పునాదిని దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. పీవో యాక్డును నీరుగార్చుతున్నారని పేర్కొన్నారు. చట్టాన్ని కాపాడే వారే..చట్టాన్ని దిగజార్జితే అర్థం ఏముందన్నారు. చట్టాలకు రక్షణ లేదన్నారు. రాజ్యాంగపరమైన సంస్థలను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిలో కూర్చున్న వారికి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు గౌరవం, మర్యాద ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రపతి పంజరంలోని పక్షి అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:58 - April 3, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చారంటూ సాగుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. మా తీర్పును ఆందోళనకారులు పూర్తిగా చదివారా అని ప్రశ్నించింది. నిరసనల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదని.. కాని అమాయకులకు శిక్షపడరాదన్నదే తీర్పు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.  

 

16:51 - April 2, 2018

రంగారెడ్డి : దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ పిలుపు ఇచ్చారు. దేశంలో ఒకశాతం ఉన్న సంపన్నుల చేతిలో 65 శాతం సంపద కేంద్రీకృతం కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదంతో రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. భారత్‌ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం - సవాళ్లు అన్న అంశంపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన సదస్సులో పాల్గొన్న బృందా కరత్... ప్రధాని మోదీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు.  

13:31 - April 2, 2018
11:39 - April 2, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బీహార్, ఒడిషా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ లో రోడ్లపై రైల్వే ట్రాక్ లపై దళితులు చేరుకుని ఆందోలన చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నిర్వీర్యమయ్యేలా సుప్రీం తీర్పు ఉందని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేంద్ర రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:51 - March 12, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌లు కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోనే అతి పెద్ద సౌర విద్యుత్‌ ప్లాంట్‌ కావడం విషేషం. ఇక్కడ 75 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఫ్రాన్స్‌కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్‌కు కింద చేపట్టారు. నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన మాక్రన్ వారణాసిలో పర్యటిస్తున్నారు.

21:54 - August 19, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. పూరి నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద  రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్టు  తెలుస్తోంది. మరో 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. తీవ్రంగా గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైలు దుర్ఘటనపై రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు.

 

20:58 - August 19, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. పూరి నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద  రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - up