upper caste

15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:05 - October 22, 2017

ప్రముఖ నవలా రచయిత యండమూరి రచించిన 'తులసిదళం’ లో ఏమీ లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా యండమూరి రచించిన ‘తులసిదళం’ నవలపై స్పందించారు. సీరియల్ గా వస్తున్న సమయంలో తనకు కొంతమంది చెప్పారని..గొప్ప నవల అని చెప్పడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకపోవడంతో అంతగా దృష్టి సారించలేదన్నారు. కానీ జ్యోతి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది..ఎందుకిలా జరిగిందనే ఆసక్తి తనలో నెలకొందన్నారు. పెళ్లి సాధ్యం కాదు..ఎంజాయ్ చేద్దాం అనే ఉత్తరంలో ఉందని..అమ్మాయి షాక్ అయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం పుస్తకం చదివానని..కానీ అందులో ఏమీ లేదన్నారు. ఎంత తుక్కు కథ..అంటే అంత తుక్కు కథ అని విమర్శించారు. ఓ డాక్టర్ ముందుమాటలో నవలను మెచ్చుకోవడం జరిగిందన్నారు. దీనిపై తాను ‘గంజాయి దమ్ము’ అని పుస్తకం రాసి..డాక్టర్ పై కూడా తాను విమర్శ చేయడం జరిగిందన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ తనపై కేసు పెట్టలేదని..ముందుమాట రాసిన వ్యక్తి కేసు పెట్టడం జరిగిందని..క్షమాపణ చెప్పాలని ఉత్తరంలో ఆ వ్యక్తి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జైల్లో పెట్టాలి..లేదా రూ. వెయ్యి జరిమాన కట్టాలని జడ్జి పేర్కొనడంతో జరిమాన కట్టేసి వచ్చామన్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

07:59 - September 7, 2017

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి గ్రామంలో దాడి ఘటనలో.. దళితులు పోలీసులను ఆశ్రయించారు. అగ్రవర్ణాలు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో కులంపేరుతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు. 

08:38 - August 27, 2017

రంగారెడ్డి :  జిల్లాలో మరోసారి అగ్రవర్ణాల దౌర్జన్యం బయటపడింది.. చాదర్‌గూడెం మండలం వీరన్నపేటలోని అగ్ర వర్ణాల యువకులు.. పెద్దెల్కపల్లిలోని దళితులపై దాడి చేశారు... మూడేళ్లక్రితం ఈ రెండు గ్రామాలకు చెందిన ప్రేమ జంట ఒక్కటైంది.. ఇద్దరి కులాలు వేరుకావడంతో గ్రామ పెద్దలు అగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విషయం మనసులో పెట్టుకొని యువకుడిని అగ్ర కులాలవారు చితకబాదారు..... పైగా పోలీసులపై ఒత్తిడి చేసి దళితులపైనే కేసులు పెట్టేలా చేశారు.. ఈ విషయం తెలుసుకున్న కులవివక్ష పోరాట సమితి సభ్యులు బాధితుల్ని పరామర్శించారు.. దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

21:59 - August 18, 2017
21:09 - August 18, 2017

కుట్ర ప్రకారంగా ప్రొమోషన్ అడ్డుకున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బాధిత ఉద్యోగి డా.కిరణ్ కుమార్, దళిత సంఘం నేత రాజాసుందర్ బాబు పాల్గొని, మాట్లాడారు. తన పట్ల కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని డా.కిరణ్‌కుమార్‌ అన్నారు. రోస్టర్ పాయింట్ విధానం సక్రమంగా అమలు కాలేదని చెప్పారు. 'ఏపీ వైద్య విద్యాశాఖ ప్రమోషన్లలో అక్రమాలు బయటపడ్డాయి. దళిత అధికారికి ప్రమోషన్‌ రాకుండా కొంతమంది అగ్రవర్ణ ఉద్యోగులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పొందాల్సిన రిజర్వేషన్లను వారికి ఇవ్వకుండా అగ్రకుల ఉద్యోగులకు కట్టబెట్టారని పలువురంటున్నారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:12 - June 29, 2017

ఖమ్మం : జిల్లాలోని ముదిగొండ మండలం పెద్దమండవలో దారుణం జరిగింది. అగ్రకులాలు దళిత మహిళ అంత్యక్రియలను అడ్డుకున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ పొలాల నుంచి వెళ్లొద్దని అగ్రకులాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికకు వెళ్లకుండా అగ్రకులస్తులు అడ్డుకోవడంతో దళితులలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత వివరాలకు వీడియో చూడండి. 

16:42 - August 23, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో దళితులపై పెత్తందారుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సీతానగరం మండలం నల్లగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా... చెరువు గట్టుపై మొక్కలు నాటుతున్న దళితులపై పెత్తందారులు తోట అన్నవరం, తోట శ్రీనివాస్, తోట సోమరాజు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. చెరువుని ఆనుకుని ఉన్న పొలం తమదని, చెరువు గట్టుపై మొక్కలు నాటే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తూ.. దళితులపై దాడి చేశారు. గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకే మొక్కలు నాటుతున్నమని చెప్పినా... వినిపించుకోకుండా... తలలు పగిలేలా కొట్టారు. గాయపడ్డ దళిత కూలీలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - upper caste