Uttar Pradesh

19:17 - May 15, 2018

ఉత్తరప్రదేశ్ : నిర్మాణంలో వున్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలింది. వారణాసిలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో వున్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. మరో 50మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మరికొంతమంది వున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య సమీక్షిస్తున్నారు. ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవటంతో ఆ మార్గంలో వెళుతున్న ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. ఫ్లైఓ వర్ కింద వున్న పదుల సంఖ్యలో వున్న వాహనాలపై కూలిపోవటంతో వాహనాలలో వున్న ప్రయాణీకులు కూడా మృతి చెంది వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ ఎన్నికలు..ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజీ బిజీగా వున్న బీజేపీ నేతలు ప్రస్తుత ప్రమాదంపై ఎటువంటి స్పందనా లేకపోవటం విమర్శనలకు దారితీస్తోంది. 

10:48 - May 4, 2018

ఢిల్లీ : వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులతో ఉత్తరాది వణికిపోతుంది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో జనజీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలతో ఆరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 117 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈదురు గాలులు, ఇసుక తుఫానులతో భయానక వాతారవణం నెలకొంది. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. యూపీ, రాజస్థాన్‌లో 111, ఆగ్రాలో 46 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లో అత్యధికంగా భరత్ పూర్‌లో 36 మంది మృతి చెందారు. పంజాబ్, పటియాలాలో ఇద్దరు మృతి చెందారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగాయి. ఇళ్ళు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యూపీ, రాజస్థాన్‌లలో మరో 48 గంటల్లో తుఫాన్ సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాజస్థాన్‌లో ఈదురుగాలుల తీవ్రత పెరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఇసుక తుఫానులు సంభవించినట్లు తెలిపింది. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాలపై తుఫానులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

 

17:09 - May 2, 2018

ఢిల్లీ : ఉత్తర భారతంలో దళితులపై దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా...ఆటవిక చర్యలు ఆగడం లేదు. అగ్రకుల దురహంకారంతో కనీసం తోటి మానవుడని కూడా గుర్తించకుండా నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. తమ పంటను కోయడానికి రాలేదన్న కారణంతో కొందరు అగ్ర కులస్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా అజంపూర్‌ బిసౌరియా గ్రామానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్దిపాటి పొలంలో గోధుమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఊర్లోని అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు ముందు తమ పొలంలో పంటను కోయడానికి రావాలని సీతారాంను ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో అతడిపై దౌర్జన్యానికి దిగారు. చెప్పులతో దాడి చేశారు. మీసాలను బలంగా లాగుతూ మూత్రం తాగించారని సీతారాం ఆరోపించారు. ఏప్రిల్‌ 24న ఈ ఘటన చోటుచేసుకుంది.

తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేయడానికి హజరత్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో బాధితుడు ఎస్పీని ఆశ్రయించాడు. ఎస్పీ ఆదేశంతో స్పందించిన స్థానిక పోలీసులు సీతారాంపై దాడి చేసిన విజయ్‌ సింగ్‌, విక్రమ్‌ సింగ్‌, సోమ్‌పాల్‌ సింగ్‌, పింకు సింగ్‌లను అరెస్ట్‌ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారి రాజేష్‌ కశ్యప్‌ను పై అధికారులు సస్పెండ్‌ చేశారు.

దళితులు గుర్రంపై ఊరేగడం కూడా నేరమే! రాజస్థాన్‌లో పెళ్లిరోజు గుర్రంపై ఊరేగినందుకు అగ్ర కులస్తులు కొందరు ఓ దళితుడిని చితకబాదారు. భిల్వారా జిల్లా గోవర్ధన్‌పుర గ్రామంలో ఏప్రిల్‌ 29న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఎస్‌సి/ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. దాడిలో గాయపడ్డ పెళ్లికొడుకును ఆసుపత్రిలో చేర్చారు. గత నెల మార్చిలో గుజరాత్‌ భావనగర్‌ జిల్లాలో కూడా గుర్రంపై ఊరేగిన ఓ దళితుడిని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కొట్టి చంపారు. సామాజిక వివక్షను తట్టుకోలేక చాలామంది దళితులు బౌద్ధమతంలో చేరుతున్నారని బిజెపికి చెందిన ఎంపి ఉదిత్‌ రాజ్‌ చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు పెరిగిపోయాయని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన పేర్కొనడం గమనార్హం. 

14:24 - May 2, 2018

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్...సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఆయా జాతీయ రాజకీయ నేతలతో భేటీ అవుతున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో భేటీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన అఖిలేష్ కు మంత్రులు కేటీఆర్, తలసానిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా అఖిలేష్ ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అవశ్యకతలపై చర్చించనున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ రాజకీయాలలో పెరగాలని ఇందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ తో కొంత సన్నిహితంగా మెలుగుతున్న అఖిలేష్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్ది సేపు వరకు వేచి చూడాల్సిందే. 

13:53 - May 2, 2018

హైదరాబాద్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అఖిలేష్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:52 - May 2, 2018

హైదరాబాద్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:44 - May 2, 2018

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బేగంపేట్ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, అఖిలేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అఖిలేష్ యూపీకి తిరుగుప్రయాణం కానున్నారు. 

10:53 - May 2, 2018

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బేగంపేట్ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, అఖిలేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అఖిలేష్ యూపీకి తిరుగుప్రయాణం కానున్నారు. 

11:23 - April 30, 2018

ప్రకాశం : వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనకమిట్ట మండలం గొట్లగట్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఓ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు దగ్గర అతివేగంగా వచ్చిన లారీ.. ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఖాదర్‌, ప్రుకాను, వెంటకరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆటోలో బట్టల వ్యాపారం చేసుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు...స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆటోను ఢీకొన్న లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

19:02 - April 28, 2018

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలోని లఖీమ్‌పుర్‌ ఖీరీ జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న టాటా మాజిక్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. డ్రైవర్‌తో పాటు 9 మంది ఘటనాస్థలంలోనే మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు, పస్‌గావా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 24వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. వ్యాన్‌ను డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు బిహార్‌లోని వైశాలి జిల్లా లాల్‌గంజ్‌ పిఎస్‌ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లికి హాజరైన 8 మంది 4 మోటార్‌ సైకిళ్లపై తిరిగి వస్తుండగా మినీ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Uttar Pradesh